Bigg Boss Telugu.. 11వ వారం నామినేషన్ లిస్టు లీక్.. ఎవరెవరు ఉన్నారంటే..

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 11వ వారంలోకి ప్రవేశించింది. బిగ్‌బాస్ విజేత ఎవరో వెల్లడికావడానికి ఇక మిగిలింది నాలుగు వారాలే. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి సభ్యుల పట్టుదల, ఆటపై ఫోకస్ 100 శాతం పెరిగింది. తాజాగా 11వ వారానికి జరిగిన నామినేషన్‌లో మళ్లీ గందరగోళం, వాగ్వాదం ఇంటి సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో నెలకొన్నది. 71వ రోజు ఎపిసోడ్‌లో భాగంగా జరిగిన నామినేషన్‌ ప్రక్రియ ఇలా ఉంది...

మోహబూబ్ ఇంటి నుంచి వెళ్లిన తర్వాత

మోహబూబ్ ఇంటి నుంచి వెళ్లిన తర్వాత


ఇంటిలో అందరి మనసులను చూరగొన్న మెహబూబ్ దిల్‌సే గేమ్ నుంచి బయటకు పోయిన పరిస్థితుల్లో ఇంటి సభ్యులందరూ ఓ రకమైన బాధలో ఉండిపోయారు. అయితే అలాంటి పరిస్థితుల్లోనూ ఉంటూ ఇంటి సభ్యులు 11వ వారానికి జరిగే నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు.

11వ వారం నామినేషన్ల ప్రక్రియలో ..

11వ వారం నామినేషన్ల ప్రక్రియలో ..

ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియలో తమకు నచ్చని కంటెస్టెంట్‌ను బయటకు పంపించేందుకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొనగా నామినేషన్ ప్రక్రియ కొనసాగినట్టు తెలిసింది. ఇంటి సభ్యులు తీవ్రమైన ఆరోపణలు చేసుకోగా వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకొన్నట్టు సమాచారం.

 మెడలో హార్ట్ సింబల్ వేసి

మెడలో హార్ట్ సింబల్ వేసి

నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యులకు హార్ట్ సింబల్ మెడలో వేసి.. చేతిలో చాకులను ఇచ్చారు. తమకు నచ్చని వ్యక్తి పేరు చెప్పి సరైనా కారణాలను వెల్లడిస్తూ ఎదుటి వ్యక్తి మెడలో ఉన్న హార్ట్ బొమ్మలో చాకును గుచ్చి నామినేట్ చేయాలి. అలా తమకు నచ్చని వ్యక్తిని నామినేట్ తగిన కారణాలు చెబుతుండగా.. ఇంటి సభ్యులు ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రతి ఆరోపణలు చేసుకొన్నట్టు తాజా ప్రోమోలో స్పష్టమైంది.

Recommended Video

Bigg Boss Telugu 4 : ఒక కామెడీ పీస్ అరిస్తే ఏడుస్తావా ? నాగార్జున స్ట్రాంగ్ కౌంటర్,ఏడ్చేసిన సోహైల్
11వ వారం నామినేట్ అయిన వారు వీరే

11వ వారం నామినేట్ అయిన వారు వీరే

తాజా సమాచారం ప్రకారం.. 11వ వారానికి నామినేట్ అయిన సభ్యుల్లో సయ్యద్ సోహెల్ ర్యాన్, హారిక, అరియానా గ్లోరి, మోనాల్ గజ్జర్, అభిజిత్, యాంకర్ లాస్య ఉన్నారు. 8 మందిలో ఆరుగురు నామినేట్ అయినట్టు తెలిసింది. ఇక ఈ వారం అందరూ టాప్ కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉండటం ఆసక్తిగా మారింది.

 అఖిల్ సార్థక్, అవినాష్ సేఫ్

అఖిల్ సార్థక్, అవినాష్ సేఫ్


సీక్రెట్ రూమ్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత అఖిల్‌ కెప్టెన్ కావడంతో ఈ వారం నామినేషన్ నుంచి ఇమ్యునిటీ లభించడం తెలిసిందే. ఇక 8 మందిలో 7 గురు నామినేషన్ ప్రక్రియకు టార్గెట్ అయ్యారు. అఖిల్‌తోపాటు అవినాష్ ఈ వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియ నుంచి సేవ్ అయ్యారు.

11వ వారంలో ఎవరికి ముప్పంటే..

11వ వారంలో ఎవరికి ముప్పంటే..


ఇక 11వ వారంలో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారే అవకాశం ఉంది. గత కొద్దికాలంగా అనూహ్యంగా మోనాల్ గజ్జర్ ఎలిమినేషన్ వేటును తప్పించుకొంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఈ వారం మోనాల్, హారిక, లాస్య బలహీనంగా కనిపిస్తున్నారు. గత వారాల్లో జరిగిన ఓటింగ్ సరళిని చూస్తే ఈ ముగ్గురిలో ఒకరు ఇంటి నుంచి బయటకు వెళ్లే అవకాశాలు స్ఫష్టంగా కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X