అఖిల్‌కు మోనాల్ గజ్జర్ కోలుకోలేని దెబ్బ.. సోహెల్ డబుల్ షాక్.. కెప్టెన్సీ చేజారడంతో.
బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో 75వ రోజు ఫన్‌తోపాటు భావోద్వేగ అంశాలు కనిపించాయి. లాస్య ఫ్యామిలీకి రావడం, అలాగే కమాండెంట్ టాస్క్ ముగియడం, అంతేకాకుండా కెప్టెన్సీ ఎంపిక జరిగింది. ఇంకా ఇంటిలో 74, 75వ రోజు జరిగిన విషయాలు ఏమిటంటే..

ఇంటిలోకి జున్ను, మంజునాథ్
కమాండెంట్ టాస్క్ ఆడుతుంటే ఇంటిలోకి లాస్య కుమారుడు జున్ను, భర్త మంజునాథ్ ఇంటిలోకి వచ్చారు. వారిని చూసిన లాస్య ఆనందంతోపాటు ఉద్వేగంతో కంటతడి పెట్టారు. వారి వద్దకు పరుగున చేరుకొని భర్తతో తన భావాలను పంచుకొన్నారు. అయితే నువ్వు చాలా స్ట్రాంగ్.. అలా ఏడవ వద్దు సలహా ఇచ్చాడు.

నీ గేమ్ బాగుంది.. స్ట్రాంగ్‌గా ఉండు..
ఇక నేను ఎలా ఆడుతున్నానంటే.. చాలా బాగా ఆడుతున్నావు. 10 వారాలపాటు ఉన్నావంటే దాని అర్ధం బాగా ఆడుతున్నావని అర్థం. నీ ఆటను బాగా ఎంజాయ్ చేస్తున్నాం. నీ గేమ్‌ను కూడా బాగా చూపిస్తున్నారు. నీవేమి మా గురించి బాధపడకు. నీవు స్ట్రాంగ్ ఆడు. మన కోసం నీవు స్ట్రాంగ్‌గా ఉండాలి అని చెప్పారు.

నీ కళ్లలోకి చూస్తేనే తెలుస్తున్నది..
భర్తను చూసి గ్లాస్‌పై ఐ లవ్ యూ అంటూ లిప్‌స్టిక్‌తో రాసింది. అయితే నీవు రాయనవసరం లేదు. నీ కళ్లలోకి చూస్తేనే తెలుస్తుంది. నన్ను మిస్ అవుతున్నావా అంటూ లాస్య అడిగితే.. లేదు అంటూ మంజునాథ్ సమాధానం ఇచ్చారు. ఎందుకంటే నీ చేష్టలన్ని జున్నుకు వచ్చాయి. దాంతో నీవు లేవనే ఫీలింగ్ నాకు కలగడం లేదు అని చెప్పారు. నేను బిగ్‌బాస్‌ను వదిలేయాలనిపిస్తుంది అంటూ.. అలాంటి పని చేయకు. నీ కోసం మూడు నెలలు వేచి చూడాలని డిసైడ్ అయ్యాను అంటూ మంజునాథ్ కామెంట్ చేశారు.

కెప్టెన్సీ టాస్క్ అలా..
ఇక ఇంటిలో కెప్టెన్సీ టాస్క్ జరిగింది. కమాండెంట్ టాస్క్‌లో స్టార్స్ సంపాదించిన అఖిల్, హారిక, అభిజిత్‌ను కెప్టెన్సీ పోటీ దారులుగా నిర్ణయించారు. ఇక అయితే పోటీ దారులను మరో కంటెస్టెంట్ భుజాలపై ఎత్తుకోవాలి. అలా ఎవరు తన పోటీదారుడి కోసం చివరి వరకు ఎక్కువ సేపు నిలబడుతారో వారు సపోర్ట్ చేస్తున్న వ్యక్తి కెప్టెన్ అవుతాడని గేమ్ రూల్ చెప్పారు.
Recommended Video

కెప్టెన్‌గా హారిక ఎంపిక
కెప్టెన్సీ టాస్క్ కోసం అఖిల్‌ను భుజాలపై మోసేందుకు సోహెల్, అభిజిత్‌ను భుజాలపైకి ఎత్తుకొనేందు అవినాష్, హారికను భుజాలపైకి ఎత్తుకొనేందుకు మోనాల్ సిద్ధమయ్యారు. అయితే ఈ టాస్క్‌లో మోనాల్ చివరి వరకు ఉండటంతో హారిక గెలిచి కెప్టెన్ అయ్యారు. ఆ తర్వాత అఖిల్ నుంచి కెప్టెన్ బ్యాండ్‌ను తన చేతికి ధరించి కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టారు. ఎన్నో రోజులుగా, ఎన్నోసార్లు కెప్టెన్సీ కోసం పోరాడి చివరకు 11వ వారంలో ఆ హోదాను దక్కించుకొన్నారు.


Click it and Unblock the Notifications











