twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నువ్వు తురుమ్‌ఖాన్‌వా? బచ్చగాడివి.. పులికాదు బలి మేకవు.. అఖిల్‌పై అభిజిత్ ఫైర్

    |

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 11వ వారం ఎలిమినేసన్ కోసం జరిగిన నామినేషన్‌ ప్రక్రియలో రచ్చ రచ్చ జరిగింది. ఇంటి సభ్యుల మధ్య ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నామినేట్ చేసే సమయంలో సోహైల్‌కు అభిజిత్‌కు మధ్య, అలాగే అభిజిత్‌కు అఖిల్‌కు మధ్య భారీగా వాగ్వాదం చోటు చేసుకొన్నది. వారి మధ్య మాటల యుద్దం ఎలా జరిగిందంటే..

    వేడి పుట్టించిన నామినేషన్ ప్రక్రియ

    వేడి పుట్టించిన నామినేషన్ ప్రక్రియ

    ఇంటిలో నామినేషన్ ప్రక్రియలో వరస్ట్ ఫెర్ఫార్మర్‌ ఎవరో చెబుతూ వారి గుండెల్లో కత్తులు దించాలి అంటూ నామినేషన్ ప్రక్రియలో రూల్ చెప్పారు. అలాగే హృదయం అట్ట బొమ్మను మెడలో వేసుకోమని చెప్పారు. అలా నామినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియ ఇంటి సభ్యుల మాటలతో హౌస్‌లో వేడిని పుట్టించింది.

    పులిలా బయటకు వచ్చా.. కెప్టెన్ అయ్యాను

    పులిలా బయటకు వచ్చా.. కెప్టెన్ అయ్యాను

    ఇక నామినేషన్‌ ప్రక్రియలో అఖిల్ పాల్గొంటూ.. తను సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లిన సమయంలో అభిజిత్ మాట్లాడిన మాటలను బయటపెట్టారు. మటన్ షాపు వాడు గడ్డి వేస్తే మేక పరిస్థితి ఏమైంది అనే మాటను అభిజిత్‌కు అప్పజెపుతూ.. గడ్డి పెడితే మేకు ఏం కాలేదు. మేకను బయటకు పులిలా వదిలాడు. అదే నేను ఇప్పుడు కెప్టెన్ అయ్యాను అంటూ అఖిల్ కామెంట్ చేశాడు.

    పులివి కావు.. బలి మేకవు.. బుద్ది రాలేదా?

    పులివి కావు.. బలి మేకవు.. బుద్ది రాలేదా?

    అఖిల్ మాటలకు అభిజిత్ కౌంటర్ ఇస్తూ.. మేక పులి ఎప్పుడూ కాదు. మేక బలి అవుతుంది. మళ్లీ లోపలికి వస్తావనే కాన్ఫిడెన్స్‌తో వెళ్లావు. ఇంత జరిగిన తర్వాత కూడా నీకు బుద్ది రాలేదా. అయినా నీవు ఇంకా నాతో మాట్లాడుతున్నావు చూడు అది దారుణం అంటూ అభిజిత్ మండిపడ్డారు.

    ఎవడి బుద్ది గురించి మాట్లాడుతున్నావని అఖిల్

    ఎవడి బుద్ది గురించి మాట్లాడుతున్నావని అఖిల్

    అభిజిత్ మాటలకు అఖిల్ కౌంటర్ ఇస్తూ ఎవడి బుద్ది గురించి మాట్లాడుతున్నావు. నా పాయింట్ మాట్లాడితే.. నాకు నచ్చకపోతే డెఫినెట్‌గా మాట్లాడుతాను అంటూ అఖిల్ ఫైర్ అయ్యాడు. అయితే అఖిల్ మాటలను ఖాతరు చేయకుండా అభిజిత్ ధీటుగా జవాబిచ్చాడు.

    ఎనిమిది కోట్ల మంది ముందు భయ పడకుండా

    ఎనిమిది కోట్ల మంది ముందు భయ పడకుండా

    నా ఆలోచన (సోచ్) ఇక్కడ ఉందో.. అక్కడ ఉందో చెప్పడానికి నువ్వెవరు? నీవు అక్కడెక్కడో సినిమా చూశావు. ఇక్కడికి వచ్చి రివ్యూ చెప్పడానికి నీవెవరు. ఎనిమిది కోట్ల మంది ప్రేక్షకుల ముందు మాట్లాడడానికి భయపడని నేను.. నీ ముందు మాట్లాడటానికి భయపడుతానా? నీవెవరు ఆఫ్టరాల్. నా సినిమా ఆగదు అంటూ అఖిల్‌ ఏదో చెప్పబోతుంటే అభిజిత్ కసురుకొన్నాడు.

    Recommended Video

    Teja Launches Vikram Movie First Look
    నీవు తురుమ్ ఖాన్‌వా? బచ్చాగాడివి

    నీవు తురుమ్ ఖాన్‌వా? బచ్చాగాడివి

    నా గురించి మాట్లాడితే ఊరుకొను.. ఎక్కడికక్కడిగా కడిగిపడేస్తాను అంటూ అఖిల్ మాటలకు అడ్డుపడుతూ ఇక్కడికి వచ్చి నీకు నీవు తురుమ్ ఖాన్ అనుకొంటున్నావా? నీవు పాతికేళ్ల నుంచి చూశావేమో.. నేను 32 ఏళ్ల నుంచి చూస్తున్నాను అంటూ అభిజిత్ సమాధానం ఇచ్చాడు. అయితే నీవు ఇక్కడికి రావడానికి 32 ఏళ్లు పడితే.. నాకు 25 ఏళ్లు పట్టింది అని అఖిల్ అంటే.. నీవు బచ్చాగానివి.. నీకు ఏమి తెలియదు.. కూర్చో పక్కన అంటూ అభిజిత్ ఘాటుగా సమాధానం ఇచ్చాడు.

    English summary
    Bigg Boss Telugu 10th week show updates: Mehaboob Dilse has eliminated from Bigg Boss Telugu House in 10th week. Apart from that, Nominations for Elimination of 11 week has finished in the bigg Boss House. As per report, Abijeet, Lasya, Ariana Glory, Syed Sohel Ryan, Harika, Monal Gajjar in the list. Before discussion, Hot discussion went between Akhil and Abijeet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X