మాట ఇచ్చి మోసం చేయకు.. నీ ప్రవర్తన అదే.. మోనాల్‌పై మండిపడ్డ అఖిల్

బిగ్‌బాస్ తెలుగు ఇంటిలో 12వ వారం నామినేషన్ల సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య వాదనలు భారీగా జరిగాయి. ఎప్పటి మాదిరిగానే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకొన్నారు. ప్రధానంగా మోనాల్ గజ్జర్, అఖిల్ మధ్య వాడివేడిగా వాదనలు చోటుచేసుకొన్నాయి. నేను స్ట్రాంగ్ అంటే.. నేను స్ట్రాంగ్ అంటూ కామెంట్ చేసుకొన్నారు. మోనాల్ తనకు సపోర్టు ఇవ్వడం లేదు అంటూ అఖిల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ..

నేను సేఫ్ జోన్‌లో ఉన్నా.. స్వాప్ వద్దు

నేను సేఫ్ జోన్‌లో ఉన్నా.. స్వాప్ వద్దు

హౌస్‌లో నీవు స్ట్రాంగ్ అని భావిస్తున్నావు కాబట్టి స్వాప్ చేసుకోమని మోనాల్‌ను అఖిల్ అడిగాడు. అయితే అందుకు మోనాల్ ఒప్పుకోలేదు. కలర్స్ టాస్క్ సమయంలో నేను వీక్ అని చెప్పి నేను నామినేట్ అయ్యాను. కానీ ఇప్పుడు నాకు సేఫ్ జోన్‌లో ఉండే అవకాశం వచ్చింది. కాబట్టి నేను నీ బదులు నేను నామినేట్ కాదలచుకోలేదు. మీరు చాలా స్ట్రాంగ్. ప్రేక్షకుల నుంచి మంచి సపోర్టు ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ కూడా మిమ్మల్ని టాప్ 5లో ఉంటారని చెప్పారు. కానీ నా పేరు టాప్ 5లో లేదు. కాబట్టి నేను ఈ ఇంటిలో ఉండటం మంచిదని, సేఫ్ జోన్‌లో ఉండాలని నిర్ణయించుకొన్నాను అని మోనాల్ చెప్పింది.

లాస్య అక్క ఇంటిలో లేదు..

లాస్య అక్క ఇంటిలో లేదు..

టాప్ 5లో ఉంటారని ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. కానీ మనం ఉండాలా? లేదా? అనేది ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లాస్య టాప్ 5లో ఉంటారని చెప్పారు. కానీ ఈ రోజు లాస్య అక్క ఇంటిలో లేదు. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన మాటలు ఎవరూ పట్టించుకోవద్దు అని అఖిల్ వాదించాడు.

నా పక్కన ఉంటే వీక్‌గా..

నా పక్కన ఉంటే వీక్‌గా..

చాలా టాస్కులలో నీవు వీక్‌గా కనిపించావు. నీవు నా పక్కన ఉంటే వీక్‌గా కనిపించడం లేదు. కాబట్టి స్వాప్ చేసుకోమని అడుగుతున్నాను అని అఖిల్ అంటే.. నాకు కూడా అలాగే ఫీలింగ్ కలుగుతుంది. నీ పక్కన ఉంటే నేను వీక్‌గా కనిపిస్తున్నాను. అందుకే నేను స్వాప్ చేసుకోవాలని అనుకోవడం లేదు అని మోనాల్ అన్నారు. అందుకు సమాధానంగా ఓహో చాలా మంచి క్లారిటీ ఇచ్చావు అంటూ అఖిల్ సెటైర్ వేశాడు.

నీవు సపోర్టు చేస్తే కెప్టెన్ అయ్యేవాడిని

నీవు సపోర్టు చేస్తే కెప్టెన్ అయ్యేవాడిని

అఖిల్ అంతటితో నీవు సపోర్టు ఇవ్వడం లేదు. అందరూ నీ నుంచి సపోర్టు ఉందని భావిస్తున్నారు. కానీ అలాంటిది నాకు కనిపించలేదు. కెప్టెన్సీ టాస్క్‌లో నాకు సపోర్టు ఇవ్వలేదు. నా పక్కన నిలుచుంటే నేను కెప్టెన్ అయ్యేవాడిని. కానీ నా కోసం స్టాండ్ తీసుకోలేదు. నీ కోసం నేను నా షూస్, బట్టలు వేశాను. కానీ నా కోసం నీవు సపోర్టు చేయడం లేదు అంటూ మోనాల్‌పై అఖిల్ మండిపడ్డారు.

Recommended Video

Star Director On Cards For Chatrapathi Bollywood Remake
మాట ఇస్తే.. కట్టుబడి ఉండు

మాట ఇస్తే.. కట్టుబడి ఉండు

కెప్టెన్సీ టాస్క్ విషయంలో ఎవరికైనా సపోర్టు చేయాలనే అనుకొంటే నీ ఇష్టం అంటే నేను హారికకు సపోర్టు చేశాను. నీకు సోహెల్ సపోర్టుగా ఉన్నారనే నేను హారికకు సపోర్టు చేశాను. అయితే నేను నీకు ఇది చేశాను.. అది చేశాను అని చెప్పుకోను అంటూ మోనాల్ చెప్పింది. దాంతో నాకు చాలా క్లారిటీ వస్తుంది. పొద్దున ఒక మాట ఉంటుంది.. సాయంత్రం ఇంకో మాట ఉంటుందని మోనాల్‌కు అఖిల్ చేతులెత్తి దండం పెట్టాడు. ఎవరికైనా మాట ఇస్తే దానిని నెరవేర్చడానికి ప్రయత్నించు. మాట ఇచ్చి తప్పుకోవడం నీ అలవాటు అంటూ అఖిల్ ధ్వజమెత్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X