బిగ్‌బాస్ హైడ్రామాకు మోనాల్ గజ్జర్ బలి.. అఖిల్‌కు విలన్‌గా హారిక.. నామినేషన్‌లో భారీ ట్విస్టులు!
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 11వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ముగియగానే సోమవారం రోజున నామినేషన్ ప్రాసెస్ మొదలైంది. ఇంటి నుంచి 12వ వారంలో బయటకు పంపించేందుకు రంగం సిద్ధమైంది. గత వారాల గేమ్ ఆధారంగా నామినేషన్ల ప్రక్రియను మొదలుపెట్టారు. తాజాగా ఇంటిలో జరిగిన విషయాలు ఇలా లీక్ అయ్యాయి. సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ టోపి
బిగ్‌బాస్ రియాలిటీ షోకు సంబంధించిన 76, 77 రోజులకు సంబంధించిన ఆటలో ఇంటి సభ్యులకే నామినేషన్ ప్రక్రియను వదిలేశారు. ఇంటి సభ్యులను పరుగెత్తి లాన్‌లో ఉన్న టోపి పెట్టుకోవాలని సూచించారు. దాంతో వారు పరుగున వెళ్లి తమకు అందిన టోపిని పెట్టుకొన్నారు. ఆ టోపితోనే నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన ట్విస్టు ఇచ్చారు. ఎవరి టోపి కింద ఎర్రటి రంగు ఉంటుందో వారే నామినేట్ అయినట్టు ప్రకటించారు.

ఇంటి సభ్యులకు ట్విస్టు
అయితే ఎర్ర కలర్ ప్రకారం.. అభిజిత్, అరియానా, అవినాష్, అఖిల్ నామినేషన్ ప్రాసెస్‌లో ఉండగా.. బిగ్‌బాస్ మరో ట్విస్టు ఇచ్చారు. ఇంటి సభ్యుల్లో నామినేట్ అయిన వారు.. నామినేట్ కాని వారితో తమ స్థానాలను మార్చుకోవచ్చనే ఆప్షన్ ఇచ్చారు. ఆ ప్రక్రియలో వారి మధ్య భారీగా వాగ్వాదం జరిగినట్టు కనిపిస్తున్నది. ఈ ప్రాసెస్ తర్వాత ఎవరూ కూడా స్థానాలను మార్చుకోవడానికి వీలు కాకపోవడంతో బిగ్‌బాస్ క్రేజీగా మరో నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం.

కెప్టెన్ హారికకు సూపర్ పవర్
నామినేషన్ ప్రక్రియలో స్వాపింగ్ ప్రక్రియను కెప్టెన్ హారిక దేత్తడి చేతిలో పెట్టారు. తనకు ప్రత్యేక అధికారాలు ఇస్తూ.. నామినేషన్‌లో ఉన్న ఓ కంటెస్టెంట్‌ను, నామినేట్ కాని కంటెస్టెంట్‌తో మార్చుకోవచ్చని సూచించినట్టు సమాచారం. అయితే హారిక తనకు ఉన్న అధికారంతో మోనాల్‌ను నామినేషన్‌లోకి పంపించి.. అభిజిత్‌ను సేవ్ చేసినట్టు సమాచారం. అయితే ఈ నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన విషయం సోమవారం రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో పూర్తిగా అర్ధమవుతుంది.
Recommended Video

అభిజిత్‌తో మోనాల్ స్వాపింగ్ అలా
ఇక తాజా సమాచారం ప్రకారం.. 12వ వారంలో మోనాల్, అవినాష్, అరియానా, అఖిల్ నామినేట్ అయినట్టు తెలిసింది. హారిక కెప్టెన్‌గా ఉండటంతో ఆమెకు మినహాయింపు లభించింది. సోహెల్‌కు గ్రీన్ కలర్ క్యాప్ లభించడంతో సేఫ్ అయ్యారు. హారిక ప్రత్యేక అధికారంతో అభిజిత్ గట్టెక్కడంతో మోనాల్ నామినేషన్‌లోకి వెళ్లడం జరిగిందనేది తాజా సమాచారం. నామినేషన్ విషయంలో మోనాల్‌కు హారిక విలన్‌గా మారిందనేది తాజా వాదన.


Click it and Unblock the Notifications











