Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నీవు ఛీకొట్టినా.. నీ వద్దకే వచ్చా.. ప్లీజ్ సోహెల్ ఈసారికైనా.. అంటూ అరియానా
బిగ్ బాస్ తెలుగు షోలో 12వ వారం అభిజిత్, అరియానా, అవినాష్, అఖిల్ నామినేషన్ ప్రక్రియలో ఇరుక్కుపోయారు. అయితే ఇంటి సభ్యుల్లో నామినేట్ కాని వారిని అడిగి స్వాప్ చేసుకొనే అవకాశాన్ని బిగ్‌బాస్ ఇచ్చాడు. ఈ క్రమంలో అరియానా తనకు హెల్ప్ చేసి తన వంతుగా నామినేట్ కావాలని అడిగింది. ఈ క్రమంలో సోహెల్, అరియానా మధ్య సంభాషణ ఇలా జరిగింది..

హెల్ప్ కోసం నీ వద్దకు
బిగ్‌బాస్ గేమ్ అనేది వ్యక్తిగతమైనదనే విషయం అయినప్పటికీ.. తోటి కంటెస్టెంట్ల సహకారం తప్పనిసరి. చాలా సార్లు నీ హెల్ప్ కోసం నీ వద్దకు వచ్చాను. కానీ నీకు ఉన్న కమిట్‌మెంట్స్ కోసం నీవు పెద్దగా నాకు సపోర్టు చేయలేదు. ఓ దశలో నన్ను నీ ఫ్రెండ్స్ లిస్టులో నుంచి తీసేశావని చెప్పావు. అయినా నేను నీ వద్దకు వస్తూనే ఉన్నాను. ఆ సమయంలో నీకు మెహబూబ్, ఇతరులకు హెల్ప్ చేసే ఆలోచనలో ఉన్నావు అని అరియానా అన్నారు.

నీ బిహేవియర్, యాటిట్యూడ్
నన్ను మూడు, నాలుగు సార్లు నామినేట్ చేసినా నేను వద్దకు వచ్చాను. ఎందుకంటే నీ బిహేవియర్, యాటిట్యూడ్ నచ్చింది. ప్రతీసారి హెల్ప్ కోసం నేను నీ వద్దకు వచ్చాను. అప్పుడు నీవు నాకు హెల్ప్ చేయలేదు. కానీ ఇప్పుడు నాకు హెల్ప్ అవసరం ఉంది. కాబట్టి నీవు ఈ పరిస్థితుల్లో సహాయం చేయి అంటూ సోహైల్‌ను అరియానా అభ్యర్థించింది.

నీకు కమిట్‌మెంట్స్ లేవు
గేమ్‌లో భాగంగా మన మధ్య చాలా గొడవలు జరిగాయి. వాటిని దృష్టిలో పెట్టుకోకు. ఇప్పుడు నీకు కమిట్‌మెంట్స్ లేవు. ఎవరికి ప్రామిస్ చేయలేదు. ఇప్పుడు నాకు హెల్ప్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి నాకు ఈ సారి హెల్ప్ చేయి. నాతో నీవు స్వాప్ చేసుకొని నామినేట్ అవ్వు అని అరియానా అన్నారు.

లాస్ట్ టైమ్ గేమ్ పరంగా
అయితే నీవు నన్ను ఫ్రెండ్‌గానే ట్రీట్ చేసి లాస్ట్ టైమ్ నీవు నామినేట్ చేశావు. నేను నామినేట్ చేశానని మనసులో పెట్టుకొని నన్ను నామినేట్ చేశావు అని సోహెల్ అంటే.. నీవు నన్ను చిన్న చిన్న విషయాలకు కూడా నామినేట్ చేశావు. కానీ నేను నిన్ను నామినేట్ చేయలేదు. లాస్ట్ టైమ్ గేమ్ పరంగా నేను నామినేట్ చేశాను అని అరియానా చెప్పింది.

నేను రిస్క్ చేయలేను
అయితే నామినేషన్ కావడానికి నాకు ఇష్టం లేదు. నేను 12 వారాలు ట్రావెల్ అయి ఇక్కడకు వచ్చాను. ఈ పరిస్థితుల్లో నేను రిస్క్ చేయలేదు. అదృష్టం కొద్ది నేను సేఫ్ జోన్‌లో ఉండే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని చేజార్చుకోలేను. నీవు ఎలా అయితే సేఫ్ కావాలని అనుకొంటున్నావో.. నేను కూడా అలానే ఫీల్ అవుతున్నాను అంటూ సోహెల్ చెప్పడంతో స్వాప్ విషయం అంతటితో ఆగిపోయింది.