అఖిల్ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు.. నేను ఎందుకు ఎలిమినేట్ కావాలి? అవినాష్ పంచ్
బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌కు సంబంధించిన 13వ వారం నామినేషన్ ప్రక్రియలో గందరగోళం నెలకొన్నది. ఈ వారం కీలకంగా మారడంతో ఇంటి సభ్యులు తన గేమ్‌పై ఫోకస్ పెట్టారు. గ్రాండ్ ఫినాలేలో చోటు సంపాదించుకొనేందుకు తమ వ్యూహాలను సిద్దం చేసుకొన్నారు. నామినేషన్ ప్రక్రియ సందర్భంగా వాడివేడి వాదనలు వినిపించారు. 13వ వారం నామినేషన్ ప్రక్రియలో ఏం జరిగిందంటే..

కలర్ బాటిల్స్ మెడలో వేసుకొని
ఇంటి సభ్యులకు కలర్ బాటిల్స్‌ను ఇచ్చి వాటిని మెడలో వేసుకోవాలి. తాము నామినేట్ చేసే ఇద్దరి కంటెస్టెంట్ల ముందు ఉన్న గాజు కూజాలో తమ ఎంచుకొన్న కలర్‌ను పోసి నామినేట్ చేయాలని గేమ్ రూల్‌ను బిగ్‌బాస్ సూచించాడు. దాంతో గత టాస్కుల ఆధారంగా ఇంటి సభ్యులు ఒకరినొకరు నామినేట్ చేసుకొన్నారు.

అవినాష్, అఖిల్ మధ్య మాటల యుద్దం
అయితే 13వ నామినేషన్ ప్రక్రియలో అవినాష్, అఖిల్ మధ్య భారీగా మాటల యుద్దం జరిగినట్టు సోమవారం విడుదల చేసిన ప్రోమోలో స్పష్టంమైంది. నాకంటే వీక్ కంటెస్టెంట్లు ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎందుకు ఎలిమినేట్ కావాలి అంటూ అఖిల్‌ను ఉద్దేశించి అవినాష్ ఫైర్ అయ్యారు.

అఖిల్ నీకు ఓవర్ కాన్ఫిడెన్స్..
అయితే నీవు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్ కాదా? అని అఖిల్ గట్టిగా సమాధానం ఇవ్వడంతో అవినాష్ కౌంటర్ ఇచ్చాడు. నీవు నెంబర్ వన్ కంటెస్టెంట్ అనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్ కాదా అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. ఇలా వారి మధ్య భారీగా వాగ్వాదం చోటుచేసుకొన్నదనే ప్రోమోలో స్పష్టమైంది.
Recommended Video

13వ వారం నామినేట్ అయింది వీరే..
తాజా సమాచారం ప్రకారం.. 13వ వారం ఎలిమినేషన్ కోసం ఐదుగురు నామినేట్ అయినట్టు సమాచారం. అభిజిత్, హారిక దేత్తడి, అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్, అవినాష్ నామినేట్ అయ్యినట్టు తెలిసింది. తాజా ప్రోమో సోమవారం ప్రసారం అయ్యే ఎపిసోడ్‌పై ఆసక్తి పెంచింది.


Click it and Unblock the Notifications











