నీవు మైండ్‌తో.. నేను హార్ట్‌తో.. అఖిల్‌కు మోనాల్ దిమ్మతిరిగే షాక్!
బిగ్‌బాస్ ఇంటిలో 13వ వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియలో షాకుల మీదు షాకులు కనిపించాయి. ఈ షో ముగింపుకు చేరుకోవడంతో ఇప్పటి వరకు జోడి కట్టి సేఫ్ గేమ్ ఆడిన కంటెస్టెంట్లు వారిలో కలర్స్‌ను తమ తోటి కంటెస్టెంట్లకు చూపించినట్టు స్పష్టమైంది. ఈ నామినేషన్ ప్రక్రియలో అఖిల్‌ను మోనాల్ నామినేట్ చేయడం పెద్ద షాక్‌గా మారింది. ఈ వివారాల్లోకి వెళితే.

మోనాల్, అఖిల్ మధ్య
బిగ్‌బాస్ తెలుగు 4 మొదలైనప్పటి నుంచి ఇంటిలో క్రేజీగా ఏదైనా జంట ఉందంటే.. అది అఖిల్, మోనాల్‌దే అనే విషయం కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే చాలాసార్లు వారిద్దరూ నామినేషన్లలో ఒకరికొకరు సహకరించుకోవడం తెలిసిందే. గతవారం నుంచి వారి మధ్య కాస్త గేమ్ విషయంలో కొత్తగా వ్యూహాలు పన్నుకొంటున్నారనేది స్పష్టమైంది.

నీవు మైండ్ పెట్టి ఆడుతున్నావా?
తాజాగా 86 రోజు ఆటలో షాకింగ్ విషయాలు మోనాల్, అఖిల్ మధ్య కనిపించాయి. అఖిల్‌ను మోనాల్ నామినేట్ చేయడంతో కంగుతిన్నాడు. నేను కూడా కొంత ఫీల్ అవుతున్నాను. నీ కోసం ఇంత కొట్లాడుతున్నాను. నీవు కూడా మైండ్ పెట్టి గేమ్ ఆడుతున్నావు అంటూ అఖిల్ ఎమోషనల్ అయ్యాడు.

నేను హార్ట్ పెట్టి ఆడుతున్నాను..
అయితే అఖిల్ మాటలకు ఘాటుగా మోనాల్ గజ్జర్ జవాబిచ్చింది. నీవు మైండ్‌తో గేమ్ ఆడుతున్నావు. నేను హృదయంతో ఆడుతున్నాను అని మోనాల్ అయింది. దాంతో నీవు ఈ విషయాలు ప్రేక్షకులకు చెప్పి నన్ను బ్యాడ్ చేయాలని అనుకొంటున్నావా? ఇక అన్ని విషయాలు కంప్లీట్ అంటూ మోనాల్‌కు అఖిల్ ఝలక్ ఇచ్చాడు.
Recommended Video

నామినేట్ అయిన ఐదుగురు కంటెస్టెంట్లు
అత్యంత గందరగోళం, అసహనాల మధ్య జరిగిన నామినేషన్ ప్రక్రియ ఇంటి సభ్యుల మధ్య ఓ క్లారిటీని తెచ్చిపెట్టింది. ఒకరికొకరు తమ గేమ్ ప్లాన్‌ను సెట్ చేసుకొన్నట్టు కనిపించింది. ఈ వారం అఖిల్, అభిజిత్, అవినాష్, మోనాల్, హారిక నామినేట్ అయినట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











