నామినేషన్‌లో అడ్డంగా బుక్కైన అఖిల్, హారిక దేత్తడి.. అవినాష్ ఇంకా అదే తీరు!
బిగ్‌బాస్ ఇంటిలో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఇంటి సభ్యుల మధ్య భారీగా చర్చ, అభిప్రాయలు బయటకు వచ్చిన తర్వాత తమకు తోచిన వారిని వారు నామినేట్ చేసుకొన్నారు. అందుకు తగిన కారణాలను చెబుతూ నామినేట్ చేశారు. ప్రధానంగా అఖిల్‌కు మోనాల్, మోనాల్‌కు అరియానాకు మధ్య పెద్దగా వాగ్వాదం జరిగింది. ఇంకా నామినేషన్ ప్రక్రియలో ఏం జరిగిందంటే...

అవినాష్ అసంతృప్తితో
ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా సేవ్ కావడంపై అవినాష్ అసంతృప్తిగా కనిపించాడు. అయితే అతడికి క్లారిటీ ఇవ్వడానికి సోహెల్, అఖిల్ ప్రయత్నించారు. అయితే తనకు ఓటు వేయకపోవడంతో బాధగా ఉంది. మీ అందరి దృఫ్టిలో చిన్నచూపుగా ఉండే అవకాశం ఉందంటే అవినాష్ తన వాదనను వినిపించారు.

నామినేషన్ ప్రక్రియ ఇలా..
హారిక దేత్తడి నామినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. అవినాష్‌ను, అభిజిత్‌ను నామినేట్ చేశారు. అఖిల్, మోనాల్‌ను అవినాష్ నామినేట్ చేశాడు. అవినాష్‌ను, మోనాల్‌ను అఖిల్ నామినేట్ చేశాడు. ఆ తర్వాత మోనాల్‌ను, హారికను అభిజిత్ నామినేట్ చేశాడు. ఆ తర్వాత మోనాల్ వంతు రావడంతో అవినాష్, అభిజిత్, అఖిల్‌ను నామినేట్ చేసింది.

నిన్ను అందుకే నామినేట్ చేయలేదు
అఖిల్‌తో నామినేషన్ సందర్భంగా మోనాల్ ఎమోషనల్ అయింది. టాస్క్ సరిగా ఆడటం లేదనే విషయంపై అఖిల్‌ను అడ్డుకొన్నది. నీవు మైండ్‌తో గేమ్ ఆడుతున్నావు. నేను హార్ట్‌తో ఆడుతున్నాను అనే విషయంపై ఇద్దరు వాదించుకొన్నారు. నాకు హార్ట్ ఉండటం వల్లే నిన్ను నామినేట్ చేయలేదని అఖిల్ చెప్పారు. అఖిల్‌తో గొడవ తర్వాత భోరున విలపించింది.

నన్ను చెత్త కెప్టెన్ అంటావా?
ఆ తర్వాత అరియానా నామినేట్ చేసే సమయంలో మోనాల్‌తో భారీ వాగ్వాదం జరిగింది. తనను చెత్త కెప్టెన్ అని ఎందుకు అన్నావు. అందుకు దానికి కారణాలు చెప్పు అంటూ అరియానా నిలదీసింది. అయితే అన్ని విషయాలకు నేను సమాధానం చెప్పను. చెప్పాలని ఒత్తిడి చేయడానికి నీవు నాకు బాస్ కావు అంటూ అరియానాను మోనాల్ ఝలక్ ఇచ్చింది.
Recommended Video

అడ్డంగా బుక్కైన అఖిల్, హారిక..
వాటర్ కంటైనర్‌లో కలర్ నీరు ఉన్న లెవెల్స్ బట్టి నామినేట్ అయినట్టు బిగ్‌బాస్ నిర్ణయం తీసుకొన్నారు. వాటర్ కంటైనర్‌లో ఎక్కువ నీరు ఉండటం వల్ల అభిజిత్, అవినాష్, మోనాల్, అఖిల్, హారిక నామినేట్ అయినట్టు ప్రకటించారు. పాపం అఖిల్, హారికకు సమానంగా వాటర్ లెవెల్స్ ఉంటి టై కావడం వల్ల ఇద్దరిని నామినేట్ చేసినట్టు బిగ్‌బాస్ ప్రకటించారు.


Click it and Unblock the Notifications











