బొంగులో ఆదేశాలు అంటూ హారిక.. తొక్కలో యవ్వారం.. నీ యవ్వారం.. అఖిల్‌పై సోహెల్ ఫైర్
బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షోలో 92వ రోజు ఇంటిలో ఫన్నీ టాస్క్‌ను ఇంటి సభ్యులకు ఇచ్చారు. రాజు,రాణి ఆట ఆడారు. ఈ టాస్క్‌లో తొలుత రాజుగా సోహెల్ వ్యవహరించారు. ఎవరైతే రాజుగా వ్యవహరిస్తారో వారికి మంత్రిగా అఖిల్ వ్యవహరించాల్సి ఉంటుంది. సోహెల్ రాజ్యంలో ఇంటి సభ్యులు వినోదాన్ని పంచారు. ఈ సందర్భంగా కొన్ని విషయాల్లో సోహెల్, అఖిల్ మధ్య వాగ్వాదం జరిగింది. 92వ రోజు ఇంకా ఇంటిలో ఏం జరిగాయంటే..

14వ వారం నామినేట్ అయింది వీరే
సోమవారం నామినేషన్ల రోజు కావడంతో అందరూ టెన్షన్‌లో కనిపించారు. అయితే ఇంటి సభ్యులందరూ నామినేషన్ల ప్రక్రియకు సిద్ధమమై ఉండగా బిగ్‌బాస్ అందరికి షాక్ ఇచ్చాడు. రోడ్ టూ ఫినాలే సాధించిన అఖిల్‌ను మినహా ఇంటి సభ్యులందరిని నామినేట్ చేశాడు. దాంతో 14వ వారం అభిజిత్, దేత్తడి హారిక, మోనాల్ గజ్జర్, సోహెల్, అరియానా గ్లోరి నామినేట్ అయ్యారు.

రాజుగా సోహెల్ సయ్యద్
సోహెల్ రాజుగా వ్యవహరించిన సమయంలో అరియానా అల్లరి పీక్స్‌లో సాగింది. అల్లరి తనదైన శైలిలో ఇంటిలో వినోదాన్ని పంచారు. సోహెల్ రాజుగా ఇంటి సభ్యులకు ఆదేశాలు జారీ చేశారు. ఒక దశలో ఆదేశాలతో విసిగిపోయిన దేత్తడి హారిక బొంగుల ఆదేశాలు అంటూ భగ్గుమన్నది.

అభిజిత్ సాఫ్ట్ రాజాగా
ఆ తర్వాత అభిజిత్ రాజుగా వ్యవహరించాడు. అయితే ఇంత సాఫ్ట్ రాజగా ఉండకండి అంటూ సోహెల్ కామెంట్ చేశాడు. అభిజిత్ రాజుగా వ్యవహరించిన సమయంలో వినోదంగా సాగింది. ఆ తర్వాత హారిక దేత్తడికి అధికారం ట్రాన్స్‌ఫర్ అయింది. హారిక ఆదేశాలు ఇవ్వడం, అఖిల్ వాటిని మ్యానుపులేట్ చేయడానికి ప్రయత్నించడంతో సొహెల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

హారిక రాణిగా.. లొల్లి లొల్లిగా
అఖిల్ మంత్రిగా వ్యవహరిస్తున్న సమయంలో హారిక ఇచ్చిన ఆదేశాలను కాకుండా సొంతంగా ఐడియాలు ఇవ్వడంతో సోహెల్ ఫైర్ అయ్యాడు. తొలుత హారిక ముద్దుగా లవ్ ప్రపొజల్ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. అయితే అలాంటి టాస్క్ సింపులగా ఉంటుంది. అది కాకుండా రెండు కాళ్లకు షూస్ వేసుకొని లేసులు ముడివేసుకోవాలి అంటూ సూచించాడు.

అఖిల్‌పై సోహెల్ భగ్గుమంటూ
షూస్ ముడివేసుకొనే గేమ్‌ను 15 సెకన్లలో ప్రారంభించాలి అంటూ అఖిల్ సలహా ఇవ్వడంతో సోహెల్ కుదరదంటూ బెట్టు చేశాడు. సోహెల్ 15 సెకన్లలో చేయకపోతే బట్టలు తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్‌లో వేయాలి అంటూ రాణి హారిక ఆదేశాలు ఇచ్చింది. దాంతో అఖిల్ వచ్చి అభిజిత్ బట్టలు స్విమ్మింగ్ పూల్ వేయడంతో మండిపడ్డారు.

నీ యవ్వ అంటూ ఆవేశంతో సోహెల్
హారిక, అఖిల్ గురించి అభిజిత్‌తో చెబుతూ పక్కనే ఉన్న చైర్లు విసిరికొట్టాడు. తొక్కలో ఆదేశాలు..నీ యవ్వ అంటూ సోహెల్ ఊగిపోయాడు. నేను రాజుగా ఉన్నప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే ఆడించాను. కానీ హారిక రాణిగా ఉన్న సమయంలో కక్ష తీర్చుకొంటున్నారంటూ సోహెల్ మండిపడ్డారు


Click it and Unblock the Notifications











