ఇది కాబోయే పెళ్లాం.. దీన్ని ఏమైనా అంటే ఖబర్దార్.. అభిజిత్‌కు మెహబూబ్ వార్నింగ్

బిగ్‌బాస్ తెలుగు 4లో 59వ రోజున జరిగిన పల్లెకు పోదాం ఛలో ఛలో టాస్క్‌లో మెహబూబ్ మళ్లీ రౌడీ అవతారం ఎత్తాడు. గేమ్‌లో భాగంగా పాన్ డబ్బా అవినాష్‌కు సోదరుడిగా, ఊర్లో రౌడీయిజం చేసే శ్రీనుగా నటించాడు. మీరు రౌడీగా నటించాలి అంటూ బిగ్‌బాస్ సూచించగా.. ఈ షో అంతా నేను రౌడీనేనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తనను బుల్డోజర్ అంటూ అభిజిత్ చేసిన కామెంట్‌పై మెహబూబ్ ఎలా స్పందించారంటే...

అన్న ప్రేమకు అండగా మెహబూబ్

అన్న ప్రేమకు అండగా మెహబూబ్


పాన్ షాపు నడుపుకొనే తన అన్నయ్య అవినాష్‌కు, గ్రామ పెద్ద కూతురు అరియానా మధ్య నడిచే ప్రేమకు అండగా మెహబూబ్ నిలుస్తూ కనిపించాడు. తన అన్న ప్రేమ కోసం గ్రామ పెద్దను ఎదురించాడు. నీ అంతు చూస్తానని హెచ్చరించాడు. అలాగే మల్లీగా నటిస్తున్న హారికతో పీకల్లోతూ ప్రేమలో మునిగిన యువకుడిగా ఆకట్టుకొన్నాడు.

హరికతో చెట్టుపుట్టా వెంట లవ్ ట్రాక్

హరికతో చెట్టుపుట్టా వెంట లవ్ ట్రాక్


హారికతో రొమాన్స్ చేస్తూ ఇంటిలోని చెట్టు, పుట్ట మధ్య పరుగులు పెడుతూ కనిపించాడు. అలాగే తనను బుల్డోజర్ అంటూ కామెంట్ చేసిన అభిజిత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. హైదరాబాద్ నుంచి వచ్చి హోటల్ పెట్టుకొంది నీవేనా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. తన లవర్ హారికపై అభిజిత్ చాడీలు చెప్పినా నమ్మకుండా మేము పది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ తన ప్రేమను మెహబూబ్ వ్యక్తం చేస్తూ కనిపించాడు.

పది రోజుల్లో నా పెళ్లి అంటూ

పది రోజుల్లో నా పెళ్లి అంటూ

అఖిల్‌కు లైన్ వేస్తున్నట్టు హరిక గురించి అభిజిత్ చెప్పినా.. నమ్మకుండా.. ఇది నా కాబోయే పెళ్లాం. పది రోజుల్లో నేను మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాం. దీన్ని ఏమైనా అంటే ఊరుకోను అంటూ తన ప్రేయసిని మెహబూబ్ కౌగిలించుకొన్నాడు. అలా హారికను వాటేసుకొంటూ మెహబూబ్ రొమాన్స్‌ను పండించాడు.

ఇంటిలో హోమాన్ని ఆర్పేందుకు ప్లాన్

ఇంటిలో హోమాన్ని ఆర్పేందుకు ప్లాన్

ఇంటిలో నిరంతరం మండే హోమాన్ని ఆర్పేందుకు తన శాయశక్తులా ప్రయత్నించాడు. తన గేమ్‌ ప్లాన్‌లో భాగంగా టాస్క్‌ను ఆపివేసే ప్రయత్నాలు చేపట్టాడు. హోమాన్ని చల్లార్చేందుకు కట్టెలు దొంగతనం చేశాడు. మంటపై నీళ్లు చల్లుతూ కనిపించాడు. ఇలా టాస్క్‌ కోసం రకరకా పాత్రల్లో దూరిపోయాడు.

కెప్టెన్సీ టాస్క్ కోసం ప్రయత్నాలు

కెప్టెన్సీ టాస్క్ కోసం ప్రయత్నాలు

ఇక పల్లెకు పోదాం ఛలో ఛలో టాస్క్‌లో వ్యక్తిగతమైన టాస్క్ అని.. దానిలో కంటెస్టెంట్లు చూపే ప్రతిభ ఆధారంగా కెప్టెన్సీ టాస్క్‌కు ఎంపికవుతారు అంటూ బిగ్‌బాస్ చెప్పడంతో.. ఎవరికి వారు ఉత్తమ ప్రదర్శనను ఇచ్చేందుకు తమ వంతు ప్రయత్నిస్తున్నారు. హారిక, మెహబూబ్, అరియానా, అవినాష్, లాస్య, అమ్మా రాజశేఖర్ కామెడీని పండించేందుకు ప్రయత్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X