అరియానా నీ కాళ్లు మొక్కుతా.. ఇక ఆపు.. చేతులు జోడించిన అఖిల్
బిగ్‌బాస్ తెలుగు షోలో 59వ రోజు ఆసక్తికరంగా ప్రేమ కథలు కనిపించాయి. పల్లెకు పోదాం ఛలో ఛలో గేమ్‌లో భాగంగా దేత్తడి హారిక, మెహబూబ్ ఓ జంటగా, అవినాష్, అరియానా మరో జంటగా కనిపించారు. అరియానా, హారిక ఊళ్లో వారందరిని ఆటపట్టించే కొంటే యువతులుగా జోష్‌తో నటించారు. ఈ సందర్భంగా ఇంట్లో జరిగిన ఆసక్తికరమైన విషయాలు ఇలా ఉన్నాయి.

అవినాష్‌తో లవ్ ట్రాక్
బిగ్‌బాస్ తెలుగులో 9వ వారం కెప్టెన్సీ కోసం జరుగుతున్న గేమ్‌లో వెంకటలక్ష్మీగా అరియానా అల్లరి పిల్లగా నటించింది. గ్రామ పెద్ద సోహైల్ కూతురైన అరియానా పాన్ షాప్ నడుపుకొనే అవినాష్‌తో ట్రాక్ నడుపడం ఊరంతా తెలిసిపోయింది. ఈ క్రమంలో తన బావ అఖిల్ మనస్తాపానికి గురయ్యాడు. తన అక్క లాస్యకు అరియానాపై ఫిర్యాదు చేస్తూ.. వెంకటలక్ష్మీ వల్ల పరువు పోతుందని పేర్కొన్నాడు.

అభిజిత్‌కు, అఖిల్‌తో కూడా
ఇక అవినాష్‌తో లవ్ ట్రాక్ నడుపుతూనే గ్రామంలోని అభిజిత్‌కు, అఖిల్‌కు సైట్ కొట్టడం ప్రారంభించింది. అలాగే తన బావతోపాటు అభిజిత్‌ను ముగ్గులోకి దించుతూ సినిమాకు వెళ్దామని ఆఫర్ ఇచ్చింది. రెండు టికెట్లు బుక్ చేస్తాను అంటూ సైగలు చేసింది. ఇలా ట్రయాంగిల్ లవ్‌తో అరియానా ఊరేగుతుంటే అఖిల్ తన అక్క వద్దకు వచ్చి గుండెలు బాదుకొన్నాడు. పాన్‌షాప్ నడిపే వ్యక్తితో ప్రేమలో పడటం వల్ల ఊళ్లో పరువు పోతుంది. మనం ముఖం చూపించుకోలేని పరిస్థితి ఎదురవుతున్నది అంటూ తన అక్కతో అఖిల్ ఆవేదన వ్యక్తం చేశాడు.

పరువు పోతే మళ్లీ..
అయితే అఖిల్ మాటలపై స్పందిస్తూ.. పరువు పోతే మళ్లీ వెనుకకు రమ్మను అంటూ అమాయకంగా పంచ్ వేస్తే.. తల్లి లాస్య కంగుతిన్నది. నా బంగారు తల్లి అంటూ ముద్దు చేసింది. అరియానా వేసిన పంచులకు అఖిల్ బిత్తరపోయి.. తల్లి నీకు దండం పెడుతా.. కాళ్లు మొక్కుతా. ఇక పంచులు ఆపు అంటూ వేడుకొన్నాడు. ఇలాంటి సంభాషణ ఇంటిలో ఆసక్తిగా మారింది.

నా లవర్ ఊర్లో ప్రతీ ఒక్కడితో అంటూ అవినాష్
ఇదిలా ఉంటే.. అవినాష్ తన ప్రేయసి అరియానా తీరుపై కంగారుపడిపోయాడు. నా మల్లి ఊర్లో ప్రతీ ఒక్కడితో తిరుగుతున్నది. కనిపించిన ప్రతీ ఒక్కడికి సైట్ కొడుతున్నది అంటే.. నీకు నీ ప్రేయసి దక్కేలా ఓ చూపు చూసుకొంటాను అంటే.. నీది నువ్వు చూసుకో.. నీ చూపు ఎలా ఉంటుందో నాకు తెలుసు అంటూ మెహబూబ్ పంచ్ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











