నీవ్వంటే ప్రాణం..నిన్ను పెళ్లి చేసుకొంటాను...అరియానాతో అవినాష్ మ్యారేజ్ ప్రపోజల్

బిగ్‌బాస్ ఇంటిలో పల్లెకు పోదాం ఛలో ఛలో టాస్క్ ఫన్నిగా సాగింది. వెంకటలక్ష్మీ అంటూ అరియానా వెంట అవినాష్ పడ్డాడు. పక్కనే కూర్చోని ఏదో చెప్పబోగా.. ఏంటీ? మా నాన్న చూస్తే చర్మం వలిచేస్తాడు తెలుసా? అంటూ హెచ్చరించింది. దాంతో నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని అవినాష్ తన మనసులోని మాట చెబితే... నేనంటే ఊళ్లో అందరికీ ఇష్టమే అంటూ అరియానా సమాధానం ఇచ్చింది.

వెంకటలక్ష్మి పెళ్లి చేసుకొంటా..

వెంకటలక్ష్మి పెళ్లి చేసుకొంటా..

అరియానా మాటలకు అడ్డుపడుతూ.. అది కాదు వెంకటలక్ష్మి.. నిన్ను నేను పెళ్లి చేసుకొంటాను అని అవినాష్ అమాయకంగా చెప్పారు. అయితే నీవు ఎంత సంపాదిస్తావు అంటే రోజుకు ఐదు వందలు అంటూ అవినాష్ సమాధానం ఇచ్చాడు. ఇలా తమ పెళ్లి వ్యవహారం గురించి మాట్లాడుకొంటుంగానే బావ అఖిల్ వచ్చి అరియానాను రెక్క పట్టి లాగే ప్రయత్నం చేశాడు. అలాగే అఖిల్‌కు వార్నింగ్ ఇచ్చాడు.

రౌడియిజం చేస్తున్నారా?

రౌడియిజం చేస్తున్నారా?

అరియానా చెయ్యి పట్టుకొని అవినాష్ వదలకపోవడంతో లాస్య కేకలు పెట్టింది. దాంతో తండ్రి సోహైల్ పరుగున అవినాష్, అరియానా వద్దకు వచ్చాడు. తన కూతురి చేయి పట్టుకోవడం చూసి.. ఏంటి రా మీ రౌడీయిజం అంటూ సోహైల్ గద్దించాడు. అయితే రౌడీయిజం బరాబర్ చేస్తాం అంటూ సోహైల్ ప్రతిగా సమాధానం ఇచ్చాడు.

గ్రామ బహిష్కరణ విధిస్తా

గ్రామ బహిష్కరణ విధిస్తా

తన అన్న ప్రేమకు అన్యాయం జరుగుతుందనే భావనలో ఉన్న మెహబూబ్ గ్రామ పెద్ద సోహైల్‌ను ఎదురించేందుకు ప్రయత్నించాడు. ఇలా పిచ్చి వేషాలు వేస్తే గ్రామ బహిష్కరణ చేస్తాను. జాగ్రత్త అంటూ సోహైల్ హెచ్చరించాడు. దాంతో తమ్ముడు మెహబూబ్‌ను కట్టడి చేసేందుకు అవినాష్ ప్రయత్నించాడు.

నీవెంత.. నీ బ్రతుకు ఎంత?

నీవెంత.. నీ బ్రతుకు ఎంత?

తండ్రి సోహైల్‌ను మెప్పించేందుకు అవినాష్ ప్రయత్నిస్తూ.. నాకు వెంకట లక్ష్మి అంటే ప్రాణం. పెళ్లి చేసుకొంటాను అయ్యా అంటూ అవినాష్ ప్రాధేయపడ్డారు. దాంతో ఆగ్రహించిన సోహైల్.. నీవెంత.. నీ బ్రతుకు ఎంత.. అంటూ బూతులు తిట్టబోయి కంట్రోల్ చేసుకొన్నాడు.

అయ్యా నీ కాళ్లు పట్టుకొంటా అంటూ అవినాష్

అయ్యా నీ కాళ్లు పట్టుకొంటా అంటూ అవినాష్

తమ ఇంటి వాళ్లు ఎంత చెప్పిన అదే విధంగా ప్రేమ వ్యవహారం కొనసాగిస్తూ సోహైల్ కంటపడ్డారు. దాంతో మీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా.. ఇంకో సారి కనిపిస్తే గ్రామ బహిష్కరణ చేస్తాను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వెంకటలక్ష్మి అంటే తనకు ప్రాణమంటూ సోహైల్ కాళ్లపై అవినాష్ పడి ప్రేమ కోసం పరితపించాడు. ఇలా ఎపిసోడ్ సరదాగా, ఫన్నీగా సాగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X