twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోహైల్, మెహబూబ్ మధ్య మంటపెట్టిన అమ్మా రాజశేఖర్.. కరడు గట్టిన హంతకురాలిగా దేత్తడి హారిక

    |

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 59వ రోజు కెప్టెన్సీ టాస్క్ కోసం ఇంటి సభ్యులకు గేమ్ ఇచ్చాడు. పల్లెకు పోదాం ఛలో. ఛలో.. అనే గేమ్‌ గురించి ఇంటి సభ్యులకు తమ పాత్రల గురించి వెల్లడించారు. ఈ గేమ్‌కు ముందు ఇంటి సభ్యులు మధ్య ఆసక్తికరమైన సంఘటన జరిగింది. గేమ్‌లో భాగంగా ఇంటిలో ఏర్పాటు చేసిన హోమంలో మంటను ఆర్పకుండా చూసుకోవాలని సూచించాడు. ఇంకా గేమ్‌లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయంటే..

    పల్లెకు పోదాం.. టాస్క్‌తో

    పల్లెకు పోదాం.. టాస్క్‌తో

    పల్లెకు పోదాం ఛలో ఛలో గేమ్‌లో ఇంటి పెద్దగా సోహైల్ వ్యవహరించాలని సూచిస్తూ పాత్రకు సంబంధించిన దుస్తులును ఇచ్చాడు. గ్రామ పెద్ద భార్యగా లాస్య, కూతురుగా అరియానా, గ్రామస్థుడిగా రాజశేఖర్ గ్రామ పెద్దకు ఊర్లోని గాసిప్స్ విషయాలను తెలియజేయాలి. గ్రామపెద్ద భార్యను ఆకట్టుకోవడానికి ప్రయత్నించాలి అని బిగ్‌బాస్ రూల్స్ చెప్పారు.

    పాత్రలు, పాత్రధారులు వీరే..

    పాత్రలు, పాత్రధారులు వీరే..

    ఇక అఖిల్ సార్థక్ బాధ్యతలేని గ్రామస్తుడిగా.. గ్రామ పెద్దను ఎదురిస్తు ఉంటాడు. అభిజిత్, మోనాల్ గజ్జర్.. వంటగాళ్లుగా దాన్ని అమ్మి.. బియ్యాన్ని, పాన్‌ను గ్రామస్తుల వద్ద నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. హారిక దేత్తడి.. అల్లరిపిల్లగా, హంతకురాలిగా.. మూడు హత్యలను చేయాల్సి ఉంటుంది. అలాగే హారికకు సీక్రెట్ టాస్క్ అప్పగించారు. అమ్మా రాజశేఖర్‌పై కాఫి చల్లడం, అవినాష్‌కు కోపం తెప్పించడం, ఏదైనా చోట తను చంపే వ్యక్తి పేరు రాయడం లాంటి సీకెటె్ ఇచ్చాడు. పాన్ షాపును మెయింటెన్ చేసే వ్యక్తిగా అవినాష్, అతడి తల్లిగా మెహబూబ్ నటించాలి. ఈ గేమ్లో. విలన్‌గా మెహబూబ్ వ్యవహరించాల్సి ఉంటుంది.

    పాన్ డబ్బా అవినాష్‌తొ అరియానా

    పాన్ డబ్బా అవినాష్‌తొ అరియానా

    ఇక గ్రామపెద్ద కూతురైన అరియానా... పాన్ డబ్బా అవినాష్‌తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం అమ్మా రాజశేఖర్ తన గ్రామపెద్ద సోహైల్‌కు తెలియజేయడంతో గొడవ జరుగుతుంది. తన ప్రేమను వ్యక్తం చేస్తూ సోహైల్ కాళ్లను అవినాష్ పట్టుకొంటాడు. మెహబూబ్ అన్న ప్రేమకు అండగా ఊరిలో దాదా గిరి చేస్తుంటాడు.

    అమ్మా రాజశేఖర్‌పై హారిక కాఫీ పోసి.

    అమ్మా రాజశేఖర్‌పై హారిక కాఫీ పోసి.

    ఇక పాన్ డబ్బా వద్ద జరిగిన గొడవలో అమ్మా రాజశేఖర్ మీద కాఫీ పోసి అతడిని చంపేసే సీక్రెట్ టాస్క్‌ను పూర్తి చేసింది. ఇక అవినాష్‌కు కోపం తెప్పించే టాస్క్ మిగిలి ఉంది. ఇదిలా ఉండగా.. ఇంటిలోని హోమం మంటను ఆర్పేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో అమ్మా రాజశేఖర్‌కు మోహబూబ్‌కు గొడవ జరిగింది. ఇంటి పెద్ద సోహైల్ కూడా మెహబూబ్‌తో ఫైర్ అయ్యాడు.

    కట్టెల కోసం కొట్లాట

    కట్టెల కోసం కొట్లాట

    ఇంటి పెద్ద సోహైల్‌ను ఎదిరిస్తూ.. ఊరికి ప్రతిష్టగా మారిన హోమాన్ని ఆర్పేందుకు ప్రయత్నించే పనిలో భాగంగా హోమం కట్టెలను ఎత్తుకెళ్లాడు. వాటిని అఖిల్, సోహైల్ వాటిని బలవంతంగా లాగేసుకొని వచ్చాడు. ఇలా ఆటపాటలతోపాటు ఎప్పటిలానే ఇంటిలో గొడవలు, చిలిపి పనులతో 59వ రోజు ఎపిసోడ్ ముగిసింది.

    English summary
    Bigg Boss Telugu 4s 59th day update: Race started for Captaincy Task between in contestants. Palle ku podam Chalo Chalo game started in the house. Sohel and Mahaboob fight in this task.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X