బుర్రలోది బయటపెట్టు.. నాన్సెన్స్.. అరియానాపై అరిచిన అభిజిత్.. మోనాల్‌పై అమ్మా రాజశేఖర్..

బిగ్‌బాస్ ఇంటిలో 59, 60వ రోజు ఇంటి సభ్యుల మధ్య గొడవలు జోరందుకొన్నాయి. టాస్క్ చివరి దశకు చేరుకొంటున్న సమయంలో కంటెస్టెంట్ల మధ్య అవేశాలు బయటపడ్డాయి. ఫుడ్ విషయంలో అభిజిత్‌కు, అరియానా, అమ్మా రాజశేఖర్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ సందర్బంగా ఆ ముగ్గురి మధ్య భారీగా వాగ్వాదం ఎలా చోటుచేసుకొన్నదంటే...

 అరియానాతో అభిజిత్ గొడవ

అరియానాతో అభిజిత్ గొడవ

పల్లెకు పోదాం ఛలో ఛలో టాస్క్ సందర్భంగా హోటల్‌ను నడుపుతున్న అభిజిత్, మోనాల్‌ ఇంటి సభ్యులకు ఆహారాన్ని సరఫరా చేయాలి. అయితే సరిగా ఆహారం సరఫరా చేయడం లేదని అభిజిత్‌తో అరియానా గొడవ పడింది. ఏ వస్తువు అడిగినా గానీ.. సప్లై చేయడం లేదు. పప్పు అడిగినా.. ఇంకా బియ్యం కావాలని అడుగుతున్నాడు అని అరియానా అరిచింది.

 సోహైల్‌తో బాధలు చెప్పుకొని హారిక

సోహైల్‌తో బాధలు చెప్పుకొని హారిక

అభిజిత్‌తో గొడవ తర్వాత అరియానా తన తండ్రిగా నటిస్తున్న గ్రామ పెద్ద సోహైల్‌కు తన బాధలు చెప్పుకొన్నది. హోటల్ సిబ్బంది ఫుడ్ విషయంలో ఇంటి సభ్యులు ప్రతీ సారి గొడవ చేస్తున్నాడు. ఇది నా మనసులో ఉన్న మాటను చెప్పుకొంటున్నాను. ప్రతీసారి ఫుడ్ సమస్య ఉందని చెబుతున్నారు అని సోహైల్‌తో అరియానా చెప్పుకొన్నారు.

బిగ్‌బాస్ ఆదేశాల ప్రకారమే..

బిగ్‌బాస్ ఆదేశాల ప్రకారమే..

అయితే ఫుడ్ విషయాన్ని ఎప్పుడూ సమస్యగా మార్చడం సరిగా లేదు. బిగ్‌బాస్ ఆదేశాల ప్రకారమే.. మేము ఫుడ్‌ సప్లై చేస్తున్నాం. మీరు మనసులో ఉన్న మాట చెప్పినా.. బుర్రలో ఉన్న మాట చెప్పినా మా రూల్స్ ప్రకారమే నడుచుకొంటున్నాం. మీకు మాకు చెప్పాల్సిన పనిలేదు అంటూ అభిజిత్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.

రెండు దోసిలి బియ్యం ఇస్తే...

రెండు దోసిలి బియ్యం ఇస్తే...

ఇక అమ్మా రాజశేఖర్ రెండు దోసిళ్ల బియ్యం ఇచ్చి ఫుడ్ కోసం అడిగితే అభిజిత్, మోనాల్ మధ్య వివాదంగా మారింది. దోసిలి బియ్యానికి అన్నం, కూర ఇస్తున్నారు. ఆమ్లెట్ కోసం మరో దోసిలి బియ్యం ఇచ్చాను అని అమ్మా రాజశేఖర్ అంటే.. ఒక దోసిలికి ఆమ్లేట్ రాదు అని అభిజిత్ నిక్కచ్చిగా చెప్పడంతో వారిద్దర మధ్య గొడవ తారాస్థాయికి చేరింది.

మోనాల్ ప్లేట్‌పై కొట్టిన అమ్మా రాజశేఖర్

మోనాల్ ప్లేట్‌పై కొట్టిన అమ్మా రాజశేఖర్

అంతలోనే ఫుడ్‌ను ప్లేట్ తీసుకొని అక్కడకు మోనాల్ వచ్చింది. అయితే ఒక దోసిలికి అన్నం, పప్పు ఇచ్చినప్పుడు.. ఒక దోసిలికి ఆమ్లెట్ ఇవ్వరా? అంటూ అమ్మా రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బియ్యం తీసుకొని వెళ్తూ.. నాకు అన్నం వద్దు అంటూ ప్లేట్‌పై చేతితో కొట్టాడు.. ఇష్టంగా తినే అన్నం ప్లేట్ కొట్టడం తప్పు అంటూ అభిజిత్ ఫైర్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X