అవినాష్‌ నోర్మూయరా అంటూ పెద రాయుడిలా గర్జించిన సోహైల్.. ఆ మూడు హత్యలు చేసింది అంటూ..

బిగ్‌బాస్ తెలుగు షోలో 60వ రోజున గ్రామ పెద్ద సయ్యద్ సోహైల్ ర్యాన్ పెద్ద రాయుడిగా మారారు. తన కూతురు అరియానా, పాన్ షాఫ్ ఓనర్ అవినాష్ ప్రేమ వ్యవహారంపై పంచాయితీ రచ్చబండ వద్దకు వచ్చింది. ఈ సందర్భంగా సోహైల్ ఇచ్చిన తీర్పులు హైలెట్‌గా మారాయి. అలాగే సీక్రెట్ టాస్క్ విషయంలో ఇచ్చిన జడ్జిమెంట్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ తీర్పు విషయంలోకి వెళితే...

 ప్రజాకోర్టులో అరియానా, అవినాష్

ప్రజాకోర్టులో అరియానా, అవినాష్

ప్రజా కోర్టులో అవినాష్ వల్ల తనకు జరిగిన వ్యవహారాన్ని అరియానా చెప్పుకొన్నది. నన్ను ఇంటిలో గారాబంగా పెంచారు. రౌడిగా పెంచారు. తనను వెంటపడుతున్నారని.. అంతేకాకుండా తనను చేతితో నెట్టి వేశాడు అంటూ అవినాష్‌పై ఫిర్యాదు చేసింది. అరియానా ఫిర్యాదులు వింటున్న సమయంలో తన బావమరిది మధ్య మధ్యలో రెచ్చిపోయాడు. మన ఇంటి ఆడపడుచుపై చేయి వేసుకోవడం అతి దారుణం. కాబట్టి పాన్ షాప్ ఓనర్‌ను కఠినంగా శిక్షించాలి అంటూ అఖిల్ తన అభిప్రాయాన్ని చెప్పారు.

అఖిల్‌కు వార్నింగ్

అఖిల్‌కు వార్నింగ్

న్యాయమూర్తి స్థానంలో ఉన్న తనకు అడ్డుపడుతున్న అఖిల్‌ను సోహైల్ మందలించారు. గ్రామ పెద్దగా ఇద్దరి వాదనలు వింటున్నాను. మధ్యలో అడ్డుపడకు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అలా తన కూతురుకి జరిగిన అన్యాయాన్ని విన్న తర్వాత ముద్దాయిగా నిలబడిన అవినాష్ వైపు తన వాదనను చెప్పుకోవాలని సూచించాడు. దాంతో అవినాష్ తన వాదనను వినిపించడం ప్రారంభించాడు.

అరియానా పిచ్చి పిచ్చిగా

అరియానా పిచ్చి పిచ్చిగా

నాకు మల్లి (అరియానా) అంటే ఇష్టం. నేను ప్రేమిస్తున్నాను. మీరు అనుమతిస్తే పెళ్లి చేసుకొంటాను. కొన్ని సార్లు పిచ్చి పిచ్చిగా చేస్తుంది. ఈ అమ్మాయి వల్ల ఒకటే సమస్య. నన్ను ప్రేమించడం లేదు అంటూ అవినాష్ చెబుతుండగా.. పెదరాయుడి స్టయిల్‌లో నోర్మూయరా అంటూ సోహైల్ గద్దించాడు. పక్కనే ఉన్న గ్రామ సేవకుడు అమ్మా రాజశేఖర్ నోర్మూయరా అంటూ రీసైండ్ ఇవ్వడంతో రచ్చబండ వద్ద ఉన్న వారంతా నవ్వుకొన్నారు. అలా సోహైల్ పెదరాయుడు పాత్ర కామెడీగా మారిపోయింది.

పెద రాయుడిలా సోహైల్ తీర్పు

పెద రాయుడిలా సోహైల్ తీర్పు

అనంతరం పెద రాయుడి హోదాలో సీక్రెట్ టాస్క్‌లో హత్యలు చేసింది ఎవరో అనే విషయాన్ని వెల్లడించారు. ఇంటి సభ్యుల ఓటింగ్ ప్రకారం మెజారిటీ సభ్యులు నిర్ణయించిన ప్రకారం హారిక హంతకురాలు అంటూ సోహైల్ తీర్పు నిచ్చారు. సోహైల్ తీర్పుపై బిగ్‌బాస్ స్పందిస్తూ.. హంతకురాలిని నిర్ణయించేది నీవు కాదు.. సమయం వచ్చినప్పుడు ఇంటి సభ్యులుకు బిగ్‌బాస్ స్వయంగా సూచిస్తాడు. అంతేకాకుండా పల్లెకు పోదాం ఛలో ఛలో టాస్క్ ముగిసింది అని అన్నారు.

మూడు హత్యలు చేసింది...

మూడు హత్యలు చేసింది...

ఇక పల్లెకు పోదాం ఛలో ఛలో టాస్క్‌లో మూడు హత్యలు చేసింది హారికనే. అవినాష్‌ను, అమ్మా రాజశేఖర్‌ను మర్డర్ చేసింది. అలాగే అద్దంపై మెహబూబ్‌ మర్డర్ చేశాను అంటూ రాసింది. ఆమెకు ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేసింది అంటూ బిగ్‌బాస్ చెప్పారు. అలాగే ఇప్పటికే కెప్టెన్ రేసులో అమ్మా రాజశేఖర్ ఉన్నారు. సీక్రెట్ టాస్క్ పూర్తి చేసిన హారిక కెప్టెన్ రేసులో ఉంటారు. అలాగే గత వారంలో బెస్ట్ ఫెర్ఫార్మర్‌ను ఎంపిక చేసుకోమని కెప్టెన్ అరియానాకు చెప్పగా.. తనకు తాను కెప్టెన్‌గా ప్రకటించుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X