twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆయన ఎవడికి కెప్టెన్.. నీవు ఎలా కెప్టెన్ అయ్యావో తెలుసు.. అమ్మా రాజశేఖర్‌పై హారిక, అభిజిత్ ఫైర్

    |

    బిగ్‌బాస్ తెలుగు ఇంటిలో 9వ వారానికి కెప్టెన్ ఎంపిక, ఇంటి సభ్యులకు పనుల కేటాయింపు విషయంలో గందరగోళం నెలకొన్నది. ఇంటి సభ్యుల మధ్య మనస్పర్థలకు దారి తీశాయి. కెప్టెన్‌గా ఎంపికైన అమ్మా రాజశేఖర్ కేటాయించిన పనులపై సభ్యుల్లో కొందరు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాంట పరిస్థితుల్లో ఇంట్లో ఏం జరిగిందంటే..

    కెప్టెన్సీ ఎంపిక కోసం హరిక, అరియానా, అమ్మా..

    కెప్టెన్సీ ఎంపిక కోసం హరిక, అరియానా, అమ్మా..

    కెప్టెన్సీ ఎంపిక కోసం అమ్మా రాజశేఖర్, అరియానా గ్లోరి, హారిక దేత్తడి మధ్య టాస్క్‌ను నిర్వహించాడు. కళ్లకు గంతలు కట్టి చేతులు రంగులో ముంచాలన్నారు. బ్లైండ్ ఫోల్డ్‌తో ఎవరి వైట్ టీ షర్ట్‌పై ఎక్కువ రంగు రుద్దాలి. బజర్ మోగే సమయానికి ఎవరి టీషర్ట్‌కు తక్కువ రంగు ఉంటే వారు కెప్టెన్ అవుతారని గేమ్ రూల్ చెప్పాడు.

    కెప్టెన్‌గా అమ్మా రాజశేఖర్

    కెప్టెన్‌గా అమ్మా రాజశేఖర్

    ఒక రింగ్‌లో ముగ్గురి వదిలి గేమ్‌ను ప్రారంభించారు. హారిక, అరియానా, మాస్టర్ ఒకరిపై మరొకరిపై రంగు పూయాలని ప్రయత్నించారు. గేమ్‌లో కింద మీద పడి రంగు పూసుకునే ప్రయత్నం చేశారు. చివరకు బజర్ మోగే సమయానికి అమ్మా రాజశేఖర్ టీ షర్ట్‌పై రంగు తక్కువగా ఉన్నందున్న ఆయనను కెప్టెన్‌గా సోహైల్ ప్రకటించారు.

    ఇంటి పనుల కేటాయింపుపై అసంతృప్తి

    ఇంటి పనుల కేటాయింపుపై అసంతృప్తి

    అయితే ఇంటి పనులు కేటాయింపులపై అమ్మా రాజశేఖర్‌పై ఇంటి సభ్యుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అవినాష్, సోహైల్‌కు తేలిక పనులు అప్పగించారనే ఆరోపణలపై హారిక భగ్గుమన్నది. ఓ దశలో ఆయన ఎవడికి కెప్టెన్ అనే విధంగా అవినాష్, అరియానా ముందుగా ఘాటుగా స్పందించింది. ఒక సందర్భంలో నీవు కెప్టెన్ ఎట్లా అయ్యావో అందరికి తెలుసు అంటూ అభిజిత్ కామెంట్ చేశాడు.

    ఇంగ్లీష్ మాట్లాడిన అభిజిత్‌కు శిక్ష

    ఇంగ్లీష్ మాట్లాడిన అభిజిత్‌కు శిక్ష

    ఇంటిలో తెలుగు కాకుండా ఇంగ్లీష్ భాష మాట్లాడకూడదనే నియమాన్ని అమలు చేశాడు. ఓ దశలో అభిజిత్ ఇంగ్లీష్ మాట్లాడటంతో బిగ్‌బాస్ హెచ్చరించాడు. దాంతో అమ్మా రాజశేఖర్ పనిష్‌మెంట్ అనుభవించాలని సూచించాడు. దాంతో కొద్ది నిమిషాలపాటు అభిజిత్‌ను ఒక చోట నిలబెట్టాడు. ఈ సందర్భంగా గతంలో కెప్టెన్ అయ్యాక ఇలాంటి గొడవలు జరుగలేదు అంటూ హారిక.. ఇంట్లో ఏం జరుగుతుందో తెలియడం లేదంటూ హారిక అనడం కనిపించింది.

    English summary
    Bigg Boss Telugu 4s 61th day update:Bigg Boss Telug new captain is Amma Rajashekhar. Abijeet, Harika disobey Mastar's order makes house in confusion state. Abijeet, Harika dettadi fires on Amma Rajashekhar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X