Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ఆయన ఎవడికి కెప్టెన్.. నీవు ఎలా కెప్టెన్ అయ్యావో తెలుసు.. అమ్మా రాజశేఖర్‌పై హారిక, అభిజిత్ ఫైర్
బిగ్‌బాస్ తెలుగు ఇంటిలో 9వ వారానికి కెప్టెన్ ఎంపిక, ఇంటి సభ్యులకు పనుల కేటాయింపు విషయంలో గందరగోళం నెలకొన్నది. ఇంటి సభ్యుల మధ్య మనస్పర్థలకు దారి తీశాయి. కెప్టెన్‌గా ఎంపికైన అమ్మా రాజశేఖర్ కేటాయించిన పనులపై సభ్యుల్లో కొందరు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాంట పరిస్థితుల్లో ఇంట్లో ఏం జరిగిందంటే..
కెప్టెన్సీ ఎంపిక కోసం హరిక, అరియానా, అమ్మా..
కెప్టెన్సీ ఎంపిక కోసం అమ్మా రాజశేఖర్, అరియానా గ్లోరి, హారిక దేత్తడి మధ్య టాస్క్‌ను నిర్వహించాడు. కళ్లకు గంతలు కట్టి చేతులు రంగులో ముంచాలన్నారు. బ్లైండ్ ఫోల్డ్‌తో ఎవరి వైట్ టీ షర్ట్‌పై ఎక్కువ రంగు రుద్దాలి. బజర్ మోగే సమయానికి ఎవరి టీషర్ట్‌కు తక్కువ రంగు ఉంటే వారు కెప్టెన్ అవుతారని గేమ్ రూల్ చెప్పాడు.
కెప్టెన్‌గా అమ్మా రాజశేఖర్
ఒక రింగ్‌లో ముగ్గురి వదిలి గేమ్‌ను ప్రారంభించారు. హారిక, అరియానా, మాస్టర్ ఒకరిపై మరొకరిపై రంగు పూయాలని ప్రయత్నించారు. గేమ్‌లో కింద మీద పడి రంగు పూసుకునే ప్రయత్నం చేశారు. చివరకు బజర్ మోగే సమయానికి అమ్మా రాజశేఖర్ టీ షర్ట్‌పై రంగు తక్కువగా ఉన్నందున్న ఆయనను కెప్టెన్‌గా సోహైల్ ప్రకటించారు.
ఇంటి పనుల కేటాయింపుపై అసంతృప్తి
అయితే ఇంటి పనులు కేటాయింపులపై అమ్మా రాజశేఖర్‌పై ఇంటి సభ్యుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అవినాష్, సోహైల్‌కు తేలిక పనులు అప్పగించారనే ఆరోపణలపై హారిక భగ్గుమన్నది. ఓ దశలో ఆయన ఎవడికి కెప్టెన్ అనే విధంగా అవినాష్, అరియానా ముందుగా ఘాటుగా స్పందించింది. ఒక సందర్భంలో నీవు కెప్టెన్ ఎట్లా అయ్యావో అందరికి తెలుసు అంటూ అభిజిత్ కామెంట్ చేశాడు.
ఇంగ్లీష్ మాట్లాడిన అభిజిత్‌కు శిక్ష
ఇంటిలో తెలుగు కాకుండా ఇంగ్లీష్ భాష మాట్లాడకూడదనే నియమాన్ని అమలు చేశాడు. ఓ దశలో అభిజిత్ ఇంగ్లీష్ మాట్లాడటంతో బిగ్‌బాస్ హెచ్చరించాడు. దాంతో అమ్మా రాజశేఖర్ పనిష్మెంట్ అనుభవించాలని సూచించాడు. దాంతో కొద్ది నిమిషాలపాటు అభిజిత్‌ను ఒక చోట నిలబెట్టాడు. ఈ సందర్భంగా గతంలో కెప్టెన్ అయ్యాక ఇలాంటి గొడవలు జరుగలేదు అంటూ హారిక.. ఇంట్లో ఏం జరుగుతుందో తెలియడం లేదంటూ హారిక అనడం కనిపించింది.