twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్వలింగ సంపర్కుడితో అలాంటి అనుభవం.. ‘అమెరికా’ సీక్రెట్ చెప్పిన అభిజిత్

    |

    దీపావళి సందర్భంగా ఇంటి సభ్యులకు సంతోషకరమైన వార్తను బిగ్‌బాస్ వినిపించాడు. బిగ్‌బాస్ రియాలిటీ షోలో 67వ రోజున ఇంటి సభ్యులకు ఓ టాస్ ఇవ్వడం జరిగింది. తమ జీవితంలో ఎవరికి చెప్పని ఓ విషయాన్ని బిగ్‌బాస్ వేదికగా పంచుకోవాలి. ఇంటి సభ్యులు అలా చేస్తే వారికి తమ ఆప్తుల నుంచి సందేశాన్ని అందుకొంటారు. ఈ టాస్క్‌లో భాగంగా అభిజిత్ తన జీవితంలో ఎదురైన ఓ ఘటనను చెప్పుకొంటూ..

    న్యూయార్క్‌లో ఓ వ్యక్తితో పరిచయం

    న్యూయార్క్‌లో ఓ వ్యక్తితో పరిచయం

    ఫస్ట్‌ టైమ్ అమెరికాకు వెళ్లినప్పుడు ఓ సంఘటన జరిగింది. న్యూయార్క్‌ బార్ అండ్ రెస్టారెంట్‌లో జరిగిన ఆ సంఘటనను చెప్పాలనుకొంటున్నాను. ఓ రెస్టారెంట్‌ కనిపిస్తే.. అందులోకి వెళ్లి కూర్చొన్నాను. అక్కడే ఉండి అటూ ఇటూ చూస్తుంటే ఒక వ్యక్తి వచ్చి పరిచయం చేసుకొన్నాడు అని అభిజిత్ తెలిపారు.

    నాకు డ్రింక్ ఆఫర్ చేయడంతో

    నాకు డ్రింక్ ఆఫర్ చేయడంతో

    నేను రెస్టారెంట్‌లో అటు ఇటూ చూస్తున్న సమయంలో ఓ వ్యక్తి వచ్చి పరిచయం చేసుకొని క్లోజ్‌గా మూవ్ అయ్యాడు. నీ కోసం ఓ డ్రింక్ తీసుకురావాలా? అని అడిగితే.. ఎప్పుడు నేనే తెచ్చుకోవాలా? మన కోసం ఒకరు ఆఫర్ చేస్తున్నాడని హ్యాపీగా ఫీలయ్యాను. మనల్ని కూడా అడిగి ఫ్రీగా డ్రింక్ ఇచ్చేవాళ్లు ఉన్నారని సంతోషపడ్డాను అని అభిజిత్ చెప్పాడు.

    నన్ను మొబైల్ నంబర్ అడిగితే..

    నన్ను మొబైల్ నంబర్ అడిగితే..

    అయితే అతడు నాతో మాటలు కలిపి.. నీవు ఈ సిటీకి రావడం కొత్తనా అంటే అవును అని సమాధానం చెప్పాను. ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నాను. కొత్త ప్రదేశాల్లో తిరుగుతున్నానని చెప్పాను. అలా మాట్లాడుతున్నప్పుడు నా గురించి అంతా చెప్పాను. అతడి గురించి తెలుసుకున్నాను. ఆ తర్వాత నేను ఇక్కడే ఉంటాను. మీ మొబైల్ నంబర్ ఇవ్వండి అని అడిగితే మొహమాట పడ్డాను అని అభిజిత్ పేర్కొన్నాడు.

    గే బార్‌ అని అప్పుడు తెలిసిందంటూ

    గే బార్‌ అని అప్పుడు తెలిసిందంటూ

    కొత్తవాడికి మొబైల్ నంబర్ ఇవ్వడంపై సందేహిస్తున్న సమయంలో నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. క్లోజ్‌గా మూవ్ అవ్వడంతో కంగారు పడ్డాను. అంతలోనే ఏం చేస్తున్నావు అంటూ పక్కకు నెట్టాను. ఏం జరుగుతుంది? ఏం చేయబోతున్నావు అని అడిగితే.. ఇది గే బార్ అని చెప్పాడు. ఆ తర్వాత బయటకు వచ్చి చూస్తే.. అది స్వలింగ సంపర్కులకు సంబంధించిన బార్ అని రాసిపెట్టి ఉంది. ఇది ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు. ఇప్పుడే చెప్పాను అని అభిజిత్ తన సీక్రెట్‌ను చెప్పడం ముగించాడు.

    అభిజిత్ చెప్పిన సీక్రెట్‌కు అఖిల్...

    అభిజిత్ చెప్పిన సీక్రెట్‌కు అఖిల్...

    అభిజిత్ చెప్పిన సీక్రెట్‌కు అఖిల్ సార్థక్ హ్యపీ అయ్యాడు. ఆయనకు లెటర్ పంపిస్తున్నాను అని చెప్పి లెటర్‌ను పోస్టు డబ్బాలో వేశాడు. తనకు వచ్చిన లెటర్‌ను చూసి హ్యాపీగా ఫీలయ్యాడు. తన తల్లి రాసిన ఉత్తరం చదివి వినిపియ్యడంతో ఇంటి సభ్యులు కూడా ఎమోషనల్ అయ్యారు.

    English summary
    Bigg Boss Telugu 4 captaincy task update: Akhil, Avinash romance with Monal gajjar and Harika dettadi. Avinash sings a song for Monal in the house and Harika Dettadi is doing Head massage and warns no captian for 10 week. Akhil Sarthak into Secret Room 67th day. Abijeet Duddala reveals Experience with Gay in New York city
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X