డ్రంక్ డ్రైవ్‌లో పట్టుబడిన బిగ్‌బాస్ కంటెస్టెంట్.. కోర్టులో నరకం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
బిగ్‌బాస్ రియాలిటీ షోలో 67వ రోజున ఇంటి సభ్యులకు ఓ టాస్ ఇవ్వడం జరిగింది. తమ జీవితంలో ఎవరికి చెప్పని ఓ విషయాన్ని బిగ్‌బాస్ వేదికగా పంచుకోవాలి. ఇంటి సభ్యులు అలా చేస్తే వారికి తమ ఆప్తుల నుంచి సందేశాన్ని అందుకొంటారు అని బిగ్‌బాస్ తెలియజేశారు. దాంతో ఇంటి సభ్యులందరూ తమ జీవితంలో పంచుకొని ఓ విషయాన్ని ఈ సందర్భంగా చెప్పుకొన్నారు. ఈ నేపథ్యంలో సోహైల్ చెప్పిన సీక్రెట్ ఇలా..

మద్యం సేవించి కారులో
టోలీచౌక్‌లో ఓ అర్ధరాత్రి నేను మద్యం సేవించి కారు నడుపుకొంటూ వెళ్తున్నాను. ఆ సమయంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే నా కారును ఆపి వాళ్లు నాకు మద్యం పరీక్ష నిర్వహించడంతో నేను పట్టుబడ్డాను. రీడింగ్ 102 వచ్చింది అంటూ సోహైల్ తన జీవితంలో జరిగిన విషయాన్ని బయటపెట్టాడు.

డ్రంక్ డ్రైవ్‌లో పట్టుబడిన తర్వాత
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన తర్వాత నా కారును పోలీసులు తీసుకెళ్లారు. కోర్టుకు వచ్చి ఫైన్ కట్టి కారును తీసుకెళ్లమని చెప్పారు. దాంతో నేను ఉదయాన్ని కోర్టుకు వెళ్లి స్లాట్ బుక్ చేసుకొన్నాను. అయితే వాళ్లు కౌన్సిలింగ్‌కు నా తల్లిదండ్రులను తీసుకురమ్మని ఒత్తిడి చేశారు. అక్కడ అసలు విషయం మొదలైంది అంటూ సోహైల్ తన బాధను చెప్పుకొన్నాడు.

నకిలీ తల్లిదండ్రులతో ప్లాన్
ఇంట్లో చెబితే కోపగించుకొంటారని చెప్పి నా ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి డుప్లికేట్ పేరెంట్స్ రెడీ చేయమని చెప్పాను. కానీ వాళ్లు వారి ఐడెంటీటి కార్డులు తీసుకు రమ్మడంతో ఇరుక్కు పోయాం. దాంతో నాకు ఏది అర్థం కాలేదు అని సోహైల్ పేర్కొన్నారు. అయితే ఆ ప్లాన్ వర్కవుట్ కాలేదన్నారు.

కోర్టులో నరకం అనుభవించా
కోర్టుకు వెళ్లిన తర్వాత పొద్దున నుంచి సాయంత్రం వరకు నరకం అనుభవించాను. అందరూ వచ్చి నీకు ఎంత రీడింగ్ వచ్చిందంటూ అడుగుతూ కనిపించారు. అదేదో 10th, ఇంటర్ మార్కుల మాదిరిగా ఫీలవుతున్నట్టు కనిపించారు. ఆ తర్వాత నా బ్రదర్‌కు చెప్పి ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేశాను. అలాంటి అనుభవం ఇప్పటికీ నేను ఎవరికీ షేర్ చేసుకోలేదని తన సీక్రెట్‌ను చెప్పాడు.
Recommended Video

ఇంటి నుంచి తండ్రి లేఖ రావడంతో
సోహైల్ చెప్పిన విషయంతో అఖిల్ సంతృప్తి చెంది.. ఇంటి నుంచి వచ్చిన సందేశాన్ని అతడికి పంపించాడు. ఉత్తరాన్నిఅందుకొన్న సోహైల్ డ్యాన్స్ చేస్తూ ఆనందంలో గడిపాడు. తన తండ్రి రాసిన లెటర్ చూసి హ్యాపీగా ఫీలయ్యారు. నీకు మంచి సంబంధాలు వస్తున్నాయంటూ లెటర్‌లో పేర్కొనడంతో ఇంటి సభ్యులు లొల్లి చేశారు.


Click it and Unblock the Notifications











