చావు నుంచి అలా బయటపడ్డాను.. మరణానికి దగ్గరగా వెళ్లి.. అరియానా జీవితంలో..
బిగ్‌బాస్ ఇంటిలో 67వ రోజు ఇంటి సభ్యుల మధ్య భావోద్వేగాలు కనిపించాయి. అయితే సీక్రెట్ రూమ్‌లో పెట్టిన అఖిల్‌ను ఇంటి సభ్యుల తీరును దగ్గరగా చూశాడు. అయితే ఇంటి సభ్యులు తన గురించి మాట్లాడుకోవడంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. అలాగే బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ ఆడుతూ కొన్ని నిర్ణయాలు తీసుకొన్నాడు. 67వ రోజున ఇంకా ఏం జరిగిందంటే..

అఖిల్‌పై అభిజిత్ అనుమానం
అఖిల్ చెప్పాపెట్టకుండా బయటకు వెళ్లిపోవడంపై అభిజిత్ అనుమానాన్ని వ్యక్తం చేశాడు. సోహైల్‌తో మాట్లాడుతూ.. పడవ టాస్క్ నుంచి దిగకుండా గేమ్ ఆడిన వ్యక్తి.. అలాగే కెప్టెన్సీ టాస్క్‌లో తనకే పదవి కావాలని పోటీపడిన వ్యక్తి.. తనను తాను డిఫెండ్ చేసుకొంటూ ఎలా వెళ్లిపోతాడు. అతడి చూస్తే ఏదో గూడుపుఠాణి నడుస్తున్నదనే అనుమానం కలుగుతుంది అని అభిజిత్ అన్నాడు.

ఆప్తుల నుంచి ఇంటి సభ్యులకు సందేశం
ఇక ఇంటి సభ్యులకు తమ జీవితంలో జరిగిన ఏదైనా విషయం ఎవరికి తెలియని సీక్రెట్ చెప్పాలని కోరాడు. అలా చెప్పితే మీ ఆప్తుల నుంచి సందేశం లభిస్తుంది అని చెప్పాడు. ఇక అఖిల్‌తో మాట్లాడుతూ.. ఇంటి సభ్యులక వచ్చే ఉత్తరాలను పంపించే అధికారం మీ చేతిలో ఉంది. అయితే వారు చెప్పిన విషయాలు సమంజసం అనిపిస్తే వారికి లెటర్లు పంపించు లేకపోతే మిషన్‌లో వేసి ముక్కలు చేయి అంటూ ఆదేశించాడు.

అరియానా తన సీక్రెట్ విషయాన్ని
ఇంటి సభ్యులు కన్ఫెషన్ రూమ్‌లోకి వచ్చి తమ సీక్రెట్స్‌ను చెప్పుకొన్నారు. అరియానా తన ఊరికి వెళ్తున్న సమయంలో జరిగిన యాక్సిడెంట్ గురించి ఎమోషనల్ అయ్యారు. ఆ రోజు జరిగిన ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది. ఆ రోజు చావుకు దగ్గరగా వెళ్లి వచ్చాను. లేకపోతే ఇప్పటికీ ఏడాది పూర్తి అయ్యేది అంటూ కంటతడి పెట్టుకొన్నారు.

అరియానా, అవినాష్‌కు అఖిల్ షాక్
ఇక ఇంటి సభ్యులు చెప్పిన విషయాలను విన్న తర్వాత అరియానా, అవినాష్‌కు తప్ప మిగితా వారందరికీ ఉత్తరాలు పంపించారు. అరియానా, అవినాష్ చెప్పిన విషయాలు సీక్రెట్స్ అనిపించలేదు. కాబట్టి పంపడం లేదని చెప్పాడు. మిగితా సభ్యులందరూ తమకు వచ్చిన లెటర్లు చదివి భావోద్వేగానికి లోనయ్యారు.


Click it and Unblock the Notifications











