క్వారంటైన్‌లో అఖిల్ సార్థక్.. బిగ్‌బాస్‌తో మొరపెట్టుకొని కంటతడి.. బయటకు ఎప్పుడంటే!

బిగ్‌బాస్ తెలుగు 4‌లో సీక్రెట్ టాస్క్‌లో భాగంగా క్వారంటైన్‌లో ఉన్న రకరకాల ఎమోషన్స్ పలికిస్తున్నాడు. ఇంటి సభ్యులు ఆడే గేమ్స్‌పై, వారు మాట్లాడుకొనే తీరుపై పలు రకాల కామెంట్స్ చేస్తున్నాడు. అలాగే ఒంటరిగా ఉండలేకపోతున్నాను అంటూ బిగ్‌బాస్‌కు మొరపెట్టుకొన్నాడు. ఈ క్రమంలో 68వ రోజున అఖిల్ ఎలా గేమ్ ఆడుతున్నారంటే...

గత రెండు రోజులగా గృహ నిర్బంధంలో

గత రెండు రోజులగా గృహ నిర్బంధంలో

గత రెండు రోజులుగా ఇంటిలో సీక్రెట్ రూమ్‌లో ఉంటున్న అఖిల్ బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లను పూర్తి చేస్తున్నాడు. తనపై ఇంట్లోని సభ్యులు చేస్తున్న కామెంట్లకు రెస్పాండ్ అవుతున్నారు. ఇంటి సభ్యుల టాస్క్‌లను పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి సమయంలో క్వారంటైన్‌లోని బాధలను బిగ్‌బాస్‌తో పంచుకొన్నారు.

గుండె బరువెక్కుతున్నదంటూ

గుండె బరువెక్కుతున్నదంటూ

సీక్రెట్ టాస్క్‌లో భాగంగా గృహ నిర్బంధంలో ఉన్న అఖిల్ సార్థక్‌‌తో బిగ్‌బాస్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎలా ఉన్నావు అని అడిగితే.. బాగాలేను. చాలా కష్టంగా ఉంది. ఒంటరిగా ఒక రూమ్‌లో ఉండలేకపోతున్నాను. గుండె బరువెక్కుతున్నది. మనసంత ఎలానో ఉంది అంటూ అఖిల్ చెప్పారు.

తల్లి పంపిన లెటర్ చదివి

తల్లి పంపిన లెటర్ చదివి


ఆ తర్వాత బిగ్‌బాస్ మాట్లాడుతూ.. ఇంటి సభ్యులకు లేఖలు అందించే టాస్క్‌లో మీరు విజయవంతమయ్యారు. మీకు ఇంటి సభ్యుల నుంచి వచ్చిన లేఖను అందిస్తున్నాం. అందుకోసం మీకు ఇచ్చిన డ్రస్‌ను వేసుకొని బిగ్‌బాస్‌లా వ్యవహరించడానికి మీరు సిద్ధంగా ఉండండి అంటూ అన్నారు.

బర్త్ డే విషెస్ అందించిన ఫ్యామిలీ

బర్త్ డే విషెస్ అందించిన ఫ్యామిలీ

తన తల్లి రాసిన లేఖను చూసిన అఖిల్ సార్థక్ ఎమోషనల్ అయ్యారు. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో మాటలు రావడం లేదు. నా బర్త్ డేకు విషెస్ అందించినందుకు చాలా థ్యాంక్స్ అంటూ అఖిల్ కంటతడి పెట్టుకొన్నారు. అయితే త్వరలోనే ఇంటి నుంచి హౌస్‌లోకి పంపే అవకాశం ఉంది.

Recommended Video

Chiranjeevi Tests Positive For COVID-19, Under Home Quarantine | Filmibeat Telugu
వారాంతంలో సీక్రెట్ రూం నుంచి బయటకు

వారాంతంలో సీక్రెట్ రూం నుంచి బయటకు


ఇక అఖిల్‌ సీక్రెట్ టాస్క్‌ను బిగ్‌బాస్ ముంగించే అవకాశం ఉంది. 10వ వారాంతంలో అఖిల్‌ను సీక్రెట్ రూం నుంచి ఇంట్లోకి పంపే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో హోస్ట్ నాగార్జున వచ్చే అవకాశం ఉంది కాబట్టి సీక్రెట్ నుంచి బయటకు తీయడానికి అవకాశం ఉంది. ఇక సీక్రెట్ రూమ్ నుంచి బయటకు వస్తే ఇక ఇంటి సభ్యులతో అఖిల్ తీరు ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X