నేను విలన్‌ను.. సోహైల్, నీవు ఎప్పటికీ హీరోవి కాలేవు అంటూ అరియానా షాక్
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 10వ వారం పూర్తి చేసుకొని 11వ వారంలోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధమైంది. ఇక ఇంటి నుంచి మరో సభ్యుడు బయటకు వెళ్లడానికి కొన్ని గంటలు మిగిలి ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇంటి సభ్యులు దీపావళీ సంబురాల్లోను, టాస్క్‌ల్లోనూ మునిగిపోయారు. ఈ సందర్భంగా అరియానా, సోహైల్ మధ్య సంభాషణ ఇలా జరిగింది..

నవ్వించే టాస్క్‌తో ఇంటి సభ్యులు
ఇంటి సభ్యులకు 68వ రోజున బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ప్రకారం ఇంటి సభ్యులు ఎవరూ నవ్వకూడదు. అయితే ఇంటి సభ్యుల్లోని ఒకరు వారిని నవ్వించడానికి ప్రయత్నం చేయాలి. అలాంటి టాస్క్‌లో ప్రతీ సభ్యుడు ఇతరులను నవ్వించేందుకు శాయశక్తులా ప్రయత్నించారు.

అవినాష్ ఒక్కరే సక్సెస్..
బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో అవినాష్ ఒక్కరే ఇతర సభ్యులను నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. అవినాష్ చేసిన కామెడీకి, పలకించిన హావభావాలకు ఇంటి సభ్యులు నవ్వు ఆపుకోలేకపోయారు. సోహైల్ అయితే నా వల్ల కావడం లేదు అంటూ కామెంట్ చేశాడు. అవినాష్ చేష్టలకు పడిపడి నవ్వాడు.

లాస్య కుళ్లు జోకులతో
ఇక లాస్క తనకు అవకాశం రావడంతో ఇంటి సభ్యులను నవ్విందుకు ప్రయత్నించారు. చీమ, ఏనుగు కథ చెప్పి నవ్వించేందుకు ప్రయత్నించారు. తాను చెప్పిన కుళ్లు జోక్‌కు ఎవరూ నవ్వలేదు. అయితే ఇంటి సభ్యులను పట్టుకొని నవ్వమంటూ రకరకాలుగా ప్రయత్నించినా ఆమె సఫలం కాలేకపోయింది.

అవినాష్‌తో అరియానా అలా
ఇక అరియానా వంతు రావడంతో అవినాష్‌ను నవ్వించేందుకు ప్రయత్నించింది. అయితే ముఖం చేతుల్లో దాచుకొని నవ్వకుండా ఉండటానికి ప్రయత్నించాడు. ఇక లాభం లేదనుకొంటూ అరియానా సోహైల్ వద్దకు వెళ్లింది. వీడిని చూస్తూ నాకే భయం వేస్తున్నది అంటూ కామెంట్ చేసింది. అంటూ ఏదో ప్రయత్నం చేసింది.
Recommended Video

అరియానాకు సోహెల్ సీరియస్ లుక్
ఇందాక ఏంట్రీ నవ్వుతానని ఓవర్ చేశావు. అప్పుడే కంట్రోల్ చేసుకొన్నావా? మనం తొలిసారి కలిసినప్పుడు అలా విష్ చేసుకోన్నాం కదా అంటే ఇప్పుడేంది అని అరియానా అంటే సోహైల్ సీరియస్‌గా లుక్ ఇచ్చాడు. అరే క్యూట్‌గా మాట్లాడురా.. అని అరియానా అంటే నేను మాట్లాడను.. నేను విలన్‌ను అంటూ సోహైల్ జవాబిచ్చాడు. దాంతో నువ్వు ఎప్పటికి విలన్‌వే హీరోవు కాలేవు అంటూ అరియానా కామెంట్ చేసింది.


Click it and Unblock the Notifications











