నీవు వాడికి సిస్టర్‌వి..అఖిల్ తల్లి షాకింగ్ కామెంట్స్.. డ్యాన్స్ చేసిన అవినాష్ మదర్

బిగ్‌బాస్ ఇంటిలో 73వ రోజు కమాండెంట్ టాస్క్‌ కొనసాగింది. దాంతో ఇంటి సభ్యుల పేరెంట్స్ రావడం భావోద్వేగాలు ఎక్కువ మోతాదులో కనిపించాయి. నవ్వులు, బాధలు, ఆనందబాష్పాలు కనిపించాయి. ఇంకా ఇంటిలో ఏం జరిగిందంటే..

అవినాష్‌ను ఏడిపించిన సోహైల్

అవినాష్‌ను ఏడిపించిన సోహైల్

ముక్కు అవినాష్‌‌పై బిగ్‌బాంబు కొనసాగుతుండటంతో మటన్‌ తినకుండా ఆంక్షలు కొనసాగుతుండటంతో ఇంటి సభ్యులు అతడిని ఏడిపించారు. సోహైల్ మటన్ తింటూ అవినాష్ ముఖం వద్ద అన్నం ప్లేట్ పెట్టి ముక్కలను చూపిస్తూ ఊరడించారు. ఇలా సరదాగా సాగుతున్న సమయంలో కమాండెంట్‌ టాస్క్‌ను ఆడమంటూ ఆదేశించారు. ఆ సమయంలో ఇంటిలోకి అఖిల్ తల్లి దుర్గ ప్రవేశించారు. ఇంటి సభ్యులతో హ్యాపీగా కాసేపు గడిపారు. ఇంటి సభ్యుల ప్రదర్శనను మెచ్చుకొన్నారు. లాస్యను ఉద్దేశించి నా పెద్ద కూతురు లాంటి దానివి. అఖిల్‌కు అక్కయ్యవు నీవు అంటూ ఆనందంలో పొంగిపోయారు.

హారిక. అభిజిత్ తల్లి రావడంతో

హారిక. అభిజిత్ తల్లి రావడంతో

కమాండోస్ గేమ్ ఆడుతుండగానే ఇంటిలోకి హారిక తల్లి, అలాగే అభిజిత్ మదర్ కూడా ఎంట్రీ ఇచ్చారు. తల్లిని చూసిన హారిక ఆనందభాష్పాలు కార్చింది. తల్లితో కలిసి కాసేపు ముచ్చటించింది. ఇంటి సభ్యులు అన్‌ఫ్రిజ్ అయిన తర్వాత అందరూ కలిసి హారిక తల్లితో ముచ్చటించారు. ఆ తర్వాత అభిజిత్ తల్లి ఇంట్లోకి వచ్చారు. ఇంటి సభ్యులు గొడవ పడటంలో ఇబ్బంది ఏమీలేదు. కావాలంటే కొట్టుకోండి. అప్పుడే మజా వస్తుందని అభిజిత్ తల్లి లక్ష్మి చెప్పింది.

అవినాష్ తల్లి హుషారుగా

అవినాష్ తల్లి హుషారుగా

అవినాష్ తల్లి మాట్లాడిన తీరు ఆకట్టుకొన్నది. అవినాష్ తల్లి చాలా హుషారుగా మాట్లాడారు. అవినాష్‌కే ధైర్యం చెబుతూ ఇంటి సభ్యులను ఆకట్టుకొన్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తాను అంటూ చెప్పారు. నాకొడుకు చాలా కష్టపడ్డారు. అందుకే నాకు చాలా ఇష్టం నువ్వు. నీ పేరు చెప్పి అందరూ నాతో ఫోటో దిగుతున్నారు అంటూ విషయాలు చెప్పారు. అలాగే అవినాష్‌తో కలిసి డ్యాన్స్ చేసి ఆలరించారు.

Recommended Video

Prabhas, Saif Ali Khan-Starrer 'Adipurush' To Release In August 2022
విచారంలో అరియానా గ్లోరి

విచారంలో అరియానా గ్లోరి

ఇక అఖిల్, అభిజిత్, అవినాష్, హారిక మదర్స్ రావడంతో వారంతా హ్యాపీగా ఫీలయ్యారు. అయితే తన ఇంటి నుంచి ఎవరూ రాలేదని అరియానా బెంగపడింది. లెటర్ కూడా ఇవ్వకుండా చేశాడు. ఇప్పుడు నా ఫ్యామిలీని రానియ్యకుండా బిగ్‌బాస్ చేస్తాడేమో అంటూ కంగారు పడిపోతే.. ఒక్క రాత్రి ఆగితే రేపు వస్తారు అంటూ అవినాష్ ఊరడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X