అనాథగా మారిన సమయంలో అతడే నాకు అండగా.. ఐ లవ్ యూ వినయ్.. అరియానా గ్లోరి కంటతడి
బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షోలోకి అనామకురాలిగా అడుగుపెట్టిన అరియానా కొద్ది వారాల్లో తన యాటిట్యూడ్, ఆటతీరుతో ఎంతో మంది అభిమానులను, ఫాలోవర్స్‌ను కూడగట్టుకొన్నారు. బిగ్‌బాస్‌లోకి వచ్చిన సెలబ్రిటీలకు ధీటుగా పాపులారిటీని సొంతం చేసుకొన్నారు. అయితే 74వ రోజున తన జీవితంలో కీలక పాత్ర పోషించిన వినయ్‌ను చూసి ఎమోషనల్ అయ్యారు. బిగ్‌బాస్ ఇంటిలో ఆమె చెప్పిన మాటలు.. వినయ్‌ను స్పందించిన తీరు ఎలా ఉందంటే..

అవినాష్‌తో అరియానా కెమిస్ట్రీ
బిగ్‌బాస్ ఇంటిలోకి అవినాష్ ప్రవేశించిన తర్వాత ఆయనకు అరియానా దగ్గరయ్యారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది. దాంతో నాగార్జునతో సహా అందరూ వారిద్దరి రిలేషన్‌పై కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అరియానాను ఉద్దేశించి సోఫాపై చేతితో కూల్ అని రాయడం ఎపిసోడ్‌లో హైలెట్‌గా మారింది.

అరియానా నాకు ఫ్రెండ్ మాత్రమే
అరియానా, అవినాష్ మధ్య సున్నితమైన రొమాన్స్ హైలెట్‌గా మారడం చర్చనీయాంశమైంది. అవినాష్ ఆమెతో ఉన్న రిలేషన్‌పై స్పందిస్తూ.. నాకు ఫ్రెండ్ మాత్రమే. అంతకు మంది ఏమిలేదు అని.. అంటే.. అరియానా కూడా మా మధ్య ఉన్న ఆరోగ్యకరమైన స్నేహబంధం అంటూ క్లారిటీ ఇచ్చింది. నాకు అవినాష్ బాయ్‌ఫ్రెండ్ కాదు.. వినయ్ నాకు బాయ్‌ఫ్రెండ్ అంటూ చెప్పింది.

వినయ్‌ను చూసి కంటతడి
ఇక బిగ్‌బాస్ ఇంటిని కంటెస్టెంట్ల పేరెంట్స్ సందర్శిస్తున్న సమయంలో వినయ్ హౌస్‌లోకి ప్రవేశించాడు. వినయ్‌ను చూడగానే అరియానా టాస్క్‌ను కూడా వదిలేసి పరుగెత్తుకెంటూ వెళ్లింది. వినయ్.. వినయ్ అంటూ కంట తడి పెట్టుకొంది. అద్దం మధ్యలో ఉండగా వినయ్ చూస్తూ భావోద్వేగానికి లోనైంది.

అందరూ దూరమైన సమయంలో వినయ్
ఇక వినయ్ గురించి చెబుతూ అమ్మా, చెల్లి నాకు దూరమైన సమయంలో అన్ని తానై నాకు అండగా నిలిచాడు అంటూ అరియానా ఎమోషనల్ అయ్యారు. ఇక వినయ్ ఐ లవ్ యూ అంటూ ఇంటి సభ్యుల ముందు ప్రపోజ్ చేసింది. దాంతో ఇంటి సభ్యులందరూ క్లాప్స్ కొడుతూ ప్రోమోలో కనిపించారు.
Recommended Video

వినయ్ ముందు అరియానా కోరికల చిట్టా
వినయ్‌తో మాట్లాడుతూ.. నాకు చెప్పులు లేవు.. బట్టలు లేవు. వాటిని వెంటనే పంపించండి అంటూ అరియానా తన కోరికల చిట్టాను బయటపెట్టింది. అయితే పక్కనే ఉన్న అవినాష్ కౌంటర్ ఇస్తూ.. ఫోన్ పంపించండి.. మాట్లాకోవడానికి బాగుంటుంది అని అన్నాడు.


Click it and Unblock the Notifications











