మోనాల్ గజ్జర్‌కు భారీ షాక్.. ఆశలు ఆడియాలు.. మైక్ పక్కన పడేసి భోరున ఏడుస్తూ..
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 11వ వారంలోకి ప్రవేశించింది. గత 70వ రోజులకుపైగా కంటెస్టెంట్లు ప్రేక్షకులను రంజింప చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కష్టతరమైన టాస్కులను కూడా పూర్తి చేస్తూ షోను ముందుకు తీసుకెళ్తున్నది. ఈ క్రమంలో ఇంటి సభ్యులకు మరింత జోష్‌ను కలిగించేందుకు వారి పేరెంట్స్‌ను ఇంట్లోకి తీసుకొచ్చారు. అయితే కోవిడ్ పరిస్థితులు కొనసాగుతున్నందున గ్లాస్ హౌస్‌ను ఏర్పాటు చేసి అందులో పేరెంట్స్‌ను ఉంచి ఇంటి సభ్యులతో మాట్లాడిస్తున్నారు. ఈ క్రమంలో

మోనాల్ తల్లి, చెల్లెలు రాకపోవడంతో
కమాండెంట్ టాస్క్ నేపథ్యంలో అభిజిత్, అఖిల్, సోహైల్, అవినాష్, సోహెల్, లాస్య, అరియానా తల్లిదండ్రులు ఇంట్లోకి వచ్చారు. అయితే ఈ విషయంలో మోనాల్‌కు తగిన సహాకారం అందించలేకపోయారు. మోనాల్ తల్లిదండ్రులు రాలేకపోవడం ఆమెకు షాక్ తగిలినంత పనైంది.

తల్లి కోసం ఆతృతగా ఎదురుచూపులు...
ఇంటిలోకి 74వ రోజు సోహెల్, అరియానా, లాస్యకు సంబంధించిన వారు రాగా.. మోనాల్ తన ఇంటి సభ్యుల గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆ సమయంలోనే మోనాల్ బేటా అంటూ ఆమె తల్లి గొంతు వినిపించడంతో పరుగులు పెడుతూ అటు ఇటూ చూసింది. అయితే ఎక్కడ కనిపించకపోవడంతో ఆమెలో ఆతృత పెరిగింది.

హైదరాబాద్‌కు రాలేకపోయాం
అయితే మోనాల్ బేటా ఎలా ఉన్నావు. బాగా ఆడుతున్నావు అంటూ మోనాల్ తల్లి పలకరించగానే.. అమ్మా అంటూ కంటతడి పెట్టుకొన్నది. నిన్ను చూడటానికి మేము హైదరాబాద్ రావాలనుకొన్నాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము రాలేకపోయాం అని తల్లి చెప్పగానే మోనాల్ భోరున విలపించింది. అలా ఏడుస్తున్న మోనాల్‌ను అఖిల్, సోహైల్ ఊరడించారు. అభిజిత్, లాస్య ఇతర ఇంటి సభ్యులందరూ కూడా ఎమోషనల్ అయ్యారు.
Recommended Video

భోరున ఏడుస్తూ బాత్రూంలోకి
ఇక తల్లి రాలేదనే విషయంతో మోనాల్ ఒక్కసారిగా కుంగిపోయింది. భోరున ఏడుస్తూ బాత్రూంలోకి వెళ్లి భోరున ఏడుస్తూ ప్రోమోల కనిపించింది. తల్లి, చెల్లెలు వస్తారని అనుకొని వేచి చూస్తున్న సమయంలో వారు రాకపోవడంతో ఆమె ఆశలు అడియాసలు అయ్యాయి. దాంతో బాధలో ఉన్న మోనాల్‌ను ఓదార్చడం ఎవరి తరం కాలేదనే విషయం ప్రోమోలో స్పష్టంగా కనిపించింది.


Click it and Unblock the Notifications











