శారీరకంగా వేదనకు గురయ్యాం..ప్రతీ రోజు.. అంటూ అరియానా, హారిక కంటతడి

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో మరో ఆసక్తికరమైన ఎపిసోడ్‌కు తెరలేచింది. ఇంటిలోని సభ్యులకు బిగ్‌బాస్ మరో ట్విస్టు ఇచ్చాడు. ఇంటి సభ్యుల అర్హతను ప్రశ్నించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దాంతో ఇంటి సభ్యుల మధ్య మరోసారి భావోద్వేగం బయటపడింది. ఈ సందర్భంగా ఇంటి సభ్యులు ఎలా ఎమోషనల్ అయ్యారంటే..

పొజిషన్స్ ప్రకారం స్థానాలను ఎంచుకోమంటూ

పొజిషన్స్ ప్రకారం స్థానాలను ఎంచుకోమంటూ

బిగ్‌బాస్ తెలుగు 4 షోకు సంబంధించిన 89వ ఎపిసోడ్ ప్రోమో ప్రకారం.. ఇంటిలో మీ ఫెర్ఫార్మెన్స్ ప్రకారం ఏ పొజిషన్స్ ఎంచుకొంటారో.. దాని కోసం పోరాడాల్సి ఉంటుంది అని బిగ్‌బాస్ సూచించారు. దాంతో ఇంటి సభ్యులు బయటకు వచ్చి నంబర్ బోర్డుపై నిలచుకొన్నారు. ఈ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య బేధాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అఖిల్, సోహెల్ నంబర్ 1` స్థానం కోసం

అఖిల్, సోహెల్ నంబర్ 1` స్థానం కోసం

బిగ్‌బాస్ ఇంటిలోని లాన్‌లో ఏర్పాటు చేసిన నంబర్ బోర్డుపై కేటాయించిన 1 స్థానం కోసం అఖిల్, సోహెల్ పోటీ పడ్డారు. తాను నంబర్ వన్ అంటూ.. తాను అంటూ ఒకరి ముఖాల్లోకి ఒకరు చూసుకొన్నారు. అయితే ఈ సందర్భంగా అరియానా మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా గ్రిల్ అయిపోయాం అని ఆవేదన చెందారు.

బిగ్‌బాస్ అలసిపోయాం అంటూ హారిక

బిగ్‌బాస్ అలసిపోయాం అంటూ హారిక

ఇక హారిక దేత్తడి మాట్లాడుతూ.. ప్రతీ నిమిషం టాస్కులు చేసి అలసిపోయాం. కొంచెం బాధగా ఉంది అంటూ హారిక కంటతడి పెట్టుకొన్నారు. బిగ్‌బాస్ ఇప్పుడే మేమందరం కలిసి కౌగిలించుకొన్నాం అంటూ సయ్యద్ సోహెల్ ర్యాన్ అన్నారు. ఇలా అందరి ముఖాల్లో విషాదం, బాధ కనిపించింది.

6వ స్థానంలో అభిజిత్

6వ స్థానంలో అభిజిత్

అయితే ప్రతీవారం భారీ ఓటింగ్ సాధిస్తున్న అభిజిత్ మాత్రం 6వ నంబర్ స్థానంలో నిలబడి కనిపించారు. ఇప్పటి వరకు 13వ వారాల్లో అభిజిత్ 11 సార్లు నామినేట్ అయి.. భారీ ఓటింగ్‌తో ఎలిమినేషన్ నుంచి తప్పించుకొన్నారు. అయితే ఈ వారం కూడా మరోసారి అగ్ని పరీక్షను అభిజిత్ ఎదుర్కోబోతున్నాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Controversial Post On Bigg Boss Contestants

అభిజిత్‌కు బిగ్‌బాస్ జైలుశిక్ష

అయితే ఇంటిలో ఇంగ్లీష్ భాషను ఎక్కువగా ఉపయోగించడం, అలాగే నంబర్ 6 స్థానాన్ని ఎంచుకోవడంపై బిగ్‌బాస్ కన్నెర్ర చేసినట్టు తెలుస్తున్నది. 89వ ఎపిసోడ్‌లో అభిజిత్‌ను జైలుకు పంపించినట్టు సమాచారం. ఇంకా శుక్రవారం రాత్రి జరిగే ఎపిసోడ్‌లో వివరంగా అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X