నీ క్రూరత్వం అందరికి తెలుసు.. అవినాష్‌ను వేధించావు.. సిగ్గులేదా? అరియానాపై నోరుపారేసుకొన్న సోహెల్
బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో 93వ రోజున ఇంటిలో ఎమోషనల్ ఎటాక్స్, వాగ్వాదాలు ఇంటి సభ్యుల మధ్య చోటుచేసుకొన్నాయి. ముఖ్యంగా రోబో టాస్క్ సందర్భంగా చోటుచేసుకొన్న సంఘటనలపై సోహెల్, అరియానా మధ్య భారీగా మాటల యుద్ధం చోటుచేసుకొన్నది. 93వ రోజు ఏం జరిగిందంటే..

నాకు బొమ్మ ఎంత ఇష్టమో
రోబో టాస్క్ సందర్భంగా అరియానా బొమ్మను నీళ్లలో పడేయటం అరియానా ఘాటుగా స్పందించింది. నాకు బొమ్మ ఎంత ఇష్టమో నీకు తెలుసు. బొమ్మ నాకు ఎమోషన్ అని తెలుసు. అలాంటిది నా బొమ్మను ఎలా స్విమ్మింగ్ పూల్‌లో వేయడం సరైనదా అంటూ అరియానా ప్రశ్నించింది.

నీపైన రివెంజ్ తీసుకోవాలని
ఆ తర్వాత రోబో టాస్క్‌లో సోహెల్‌ను అందరూ రెచ్చగొట్టినా ఎలాంటి ఎమోషన్స్ కనిపించకుండా కామ్‌గా ఉన్నాడు. ఆ తర్వాత 0 పాయింట్లతో టాప్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా సోహెల్ కదిలాడు అంటూ అరియానా కంప్లయింట్స్ చేసింది. దాంతో అవును నేను నీపైనే రివేంజ్ తీసుకోవాలనుకొన్నాను. కొన్ని టాస్కుల్లో నాపై దారుణంగా వ్యవహారించావు. కాబట్టి ఇప్పుడు నేను రివేంజ్ తీసుకొన్నాను అంటూ సోహెల్ చెప్పాడు.

అరియానాతో సోహెల్ వాగ్వాదం
ఆ తర్వాత అరియానాతో నన్ను రెచ్చగొడుతావా? అంటూ సోహెల్ వాగ్వాదం పెట్టుకొన్నాడు. దాంతో అరియానా మధ్య మాటలు యుద్ధం చోటుచేసుకొన్నది. నీపై నాకు రివెంజ్ తీసుకోవాలనుకొన్నాను అంటూ సోహెల్ ఆమె మీదకు వెళ్లాడు. దాంతో మీదకు వస్తున్నావు.. ఏం చేస్తావు అంటూ అరియానా కామెంట్ చేసింది.

నీకు ఒకరి ఎమోషన్ గురించి తెలియదు
సోహెల్, అరియానా మధ్య అవినాష్ విషయం చర్చకు వచ్చింది. నీకు ఒకరి ఎమోషన్ గురించి తెలియదు అంటే.. నీకు అవినాష్ ఎమోషన్స్ గురించి తెలుసా? నీవు ఆయనను ఎన్ని రకాలుగా వేధించావు అంటూ సోహెల్ అరుపులు మొదలుపెట్టాడు. నీ క్రూరత్వం ఎవరికి తెలియదు. సిగ్గులేదా అంటూ సోహెల్ అన్నాడు.
Recommended Video

నాతో క్రూరంగా వ్యవహరించావు
దాంతో అరియానా ఎమోషనల్ అయింది. భోరున ఏడుస్తూ కిందపడి ఫోయింది. నీవు బేబి కేర్, రాక్షసుల టాస్క్ సందర్భంగా నాతో క్రూరంగా వ్యవహరించావు అని సోహెల్ అంటే.. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ మాత్రమే ఆడాను అంటూ అరియానా వాదించింది. ఇలా వారిద్దరి మధ్య గొడవ ఇంటిలో పెద్ద గొడవ జరిగింది.


Click it and Unblock the Notifications











