రెచ్చిపోకు.. అవినాష్‌ను ఎంత టార్చర్ పెట్టావో తెలుసు.. అరియానా, సోహెల్ మధ్య చిచ్చుపెట్టిన మోనాల్ గజ్జర్

బిగ్‌బాస్ ఇంటిలో సాగిన రోబో టాస్క్‌లో భాగంగా మోనాల్‌ను టార్గెట్ చేసుకొని అరియానా గేమ్ ఆడటంపై సోహెల్ సయ్యద్ ర్యాన్ భగ్గుమన్నాడు. టీ స్టాండ్, రాక్షసులు ఇతర టాస్క్‌లో ఆడిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా అరియానా, సయ్యద్ సోహెల్ ఒకరిపై ఒకరు మాటలు విసురుకొన్నారు. వారి మధ్య జరిగిన గొడవలో..

అవినాష్‌ను అలా వేధించావు

అవినాష్‌ను అలా వేధించావు

తొక్కలో బొమ్మను నీళ్లలో పడేస్తే నువ్వు రెచ్చిపోతున్నావు. బొమ్మ కోసం నీవు అవినాష్‌ను వేధించావు. కేవలం బొమ్మ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోమన్నావు. నీకు జ్వరం వస్తే అవినాష్ ఎన్ని పనులు చేసిండు. అలాంటి వ్యక్తికి గౌరవం ఇవ్వలేదు. ఆయన అభిజిత్‌కు, నాకు చెప్పుకొని బాధపడ్డారు అని సోహెల్ అన్నారు.

మోనాల్ ముఖంపై గుడ్డుకొట్టావు

మోనాల్ ముఖంపై గుడ్డుకొట్టావు

అలాగే టీస్టాండ్ టాస్క్ సందర్భంగా మోనాల్‌తో కూడా దారుణంగా బిహేవ్ చేసావో నాకు తెలుసు. ఆమెకు గుడ్డు పడదని చెప్పినా.. ఆమె ముఖం వద్ద గుడ్డుకొట్టావు అని సోహెల్ అంటే.. నేను గేమ్ కోసమే ఆడాను. ఎవరిపై నాకు ఎలాంటి పగ లేదు. కానీ నీవు ఎమోషన్స్‌తో ఆడుకొంటున్నావు అని సోహెల్‌ను ఉద్దేశించి అరియానా మండిపడింది.

బేబీ కేర్ టాస్క్‌లో దారుణంగా

బేబీ కేర్ టాస్క్‌లో దారుణంగా

అవినాష్ విషయం ఎప్పటిదో.. అది నాగ్ సార్ ముందు మాట్లాడుకొన్నావు. ఇప్పుడు నీవు ఆ పాయింట్‌ను లేవనెత్తడం సరికాదు అంటే.. ప్రతీ టాస్క్‌లో భాగంగానే చేశాను. అంటే నా షూస్‌ కూడా పడేశావు. బేబీ కేర్ టాస్క్ అప్పుడు నన్ను ఎంత టార్చర్ చేశావు. అందుకే నీ బట్టలు, బొమ్మను నీళ్లలో పడేశాను అంటూ సోహెల్ అన్నాడు.

క్రూరంగా ఆడావు అంటూ

క్రూరంగా ఆడావు అంటూ

ఇంటిలో నేను ఏది చేసినా గేమ్ కోసమే ఆడాను అంటే.. నీవు ఇంటి సభ్యులతో చెడుగా ప్రవర్తించావు. క్రూరంగా ఆడావు అంటూ సోహెల్ ఊగిపోయాడు. వేస్ట్ మాటలు మాట్లాడకురా అంటూ సోహెల్‌కు అరియానా ధీటుగా సమాధానం ఇచ్చింది. నీది క్రూరమైన హృదయం అంటూ సోహెల్ రెచ్చిపోయాడు. దాంతో పోరా పో అంటూ అరియానా ధీటుగా స్పందించింది.

బిగ్‌బాస్ కోసమే గేమ్ ఆడుతున్నా

బిగ్‌బాస్ కోసమే గేమ్ ఆడుతున్నా

నీది క్రూరమైన హృదయం అని సోహెల్ అంటే.. నేను బిగ్‌బాస్ కోసం గేమ్ ఆడుతున్నాను అంటూ అరియానా సమాధానం ఇచ్చింది. దాంతో ఆవేశంతో ఊగిపోయిన సోహెల్.. అరియానా బొమ్మను చింపేందుకు ప్రయత్నించాడు. దాంతో మోనాల్, అఖిల్ అడ్డుకొన్నారు.

మోనాల్‌తో వాగ్వాదం

మోనాల్‌తో వాగ్వాదం

అరియానా తన వాదన బయటపెడుతుండగా మోనాల్ జోక్యం చేసుకొన్నది. అరియానాను ఊరడించే ప్రయత్నం చేస్తే.. నేను గేమ్ మాత్రమే ఆడాను అంటూ మోనాల్‌కు సర్ది చెప్పింది. దాంతో ఇద్దరం గేమ్ కోసమే ఆడాం అంటూ ఒకరికొకరు సర్ది చెప్పుకొన్నారు.

Recommended Video

Nagarjuna Akkineni To Fans On Apple Products
నచ్చ చెప్పేందుకు ప్రయత్నాలు

నచ్చ చెప్పేందుకు ప్రయత్నాలు

ఇలా సోహెల్, అరియానా మధ్య గొడవ జరుగుతుంటే అఖిల్, మోనాల్, అభిజిత్ జోక్యం చేసుకొన్నారు. సోహెల్‌ను పట్టుకొని బాత్రూంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత అక్కడ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో లాన్‌లో అరియానా దారుణంగా ఏడుస్తూ బిగ్‌బాస్‌తో మొరపెట్టుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X