నిన్ను చంపుతానురా.. అనవసరంగా మోసపోతున్నావు.. కోపంతో సోహెల్.. అడ్డుకొన్న మోనాల్ గజ్జర్
బిగ్‌బాస్ ఇంటిలో అరియానాపై కోపాన్ని 94వ రోజు కూడా సోహెల్ సయ్యద్ కొనసాగించినట్టు కనిపించింది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో సయ్యద్ తన కసిని అరియానా బొమ్మపై చూపించాడు. బాత్రూంలో ఉన్న అరియానా బొమ్మ చింటూను ఉద్దేశించి కసిగా బిహేవ్ చేశాడు. ఇలా సరదాగా సోహెల్ చేసిన ప్రయత్నం ఫన్ క్రియేట్ చేసింది. ఇంతకు ఇంటిలో ఏం జరిగిందంటే..

నీవు ఎమోషనల్ ఫూల్‌వి
చింటూ బొమ్మను ఉద్దేశించి.. అరియానా డ్రస్ చేసుకొని వెళ్లింది కద.. నిన్ను తీసుకు వెళ్లలేదా? నీవు ఎమోషనల్ ఫూల్‌వి. నిన్ను పట్టించుకోవడం లేదు. ఒట్టిగా నీవు మోసపోతున్నావు అది తెలుసుకో అంటూ సోహెల్ కామెంట్ చేశాడు. అయితే తిడుతున్న సోహెల్‌ను మోనాల్ గుంజుకెళ్లింది. చింటూను కొట్టేందుకు సోహెల్ ప్రయత్నం మరింత ఆకట్టుకొన్నది. కాస్త వినోదాన్ని కూడా క్రియేట్ చేసింది.

గొడుగుతొ కొట్టేందుకు ప్రయత్నం
బాత్రూమ్ నుంచి బయటకు వెళ్లిన సోహెల్ మళ్లీ లోపలికి పరుగెత్తుకొంటూ వచ్చి గొడుగుతో అరెయ్ చింటూ నిన్ను చంపుతాను రా.. నిన్ను చంపుతా.. నీయమ్మ అంటూ చింటూపైకి వెళ్లాడు. అయితే గొడుగుతో కొట్టేందుకు ప్రయత్నిస్తున్న సోహెల్‌ను మోనాల్ లాగుతూ తీసుకెళ్లింది.

కొతి బొమ్మను చింపేందుకు సొహెల్
ఇదిలా ఉండగా.. 93వ రోజు టాస్క్ సందర్భంగా కోతి బొమ్మ చింటూను చింపేందుకు ప్రయత్నంగా అరియానా, సోహెల్ మధ్య గొడవ జరిగింది. చింటూ బొమ్మ తనకు ఎమోషనల్ అంటూ అరియానా ఏడ్చి గోల పెట్టిన సంగతి తెలిసిందే.
Recommended Video

అరియానా, సోహెల్ మధ్య గొడవతో
అరియానా, సోహెల్ మధ్య జరిగిన వాగ్వాదం ఇంటిలో ప్రకంపనాలు సృష్టించాయి. అరియానా ఏడుస్తూ తన బాధను బిగ్‌బాస్‌కు చెప్పుకొన్నది. ఆ తర్వాత ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ... సోహెల్ కూడా అరియానాతో జరిగిన గొడవపై పశ్చాత్తాపం చెందారు. ఈ గొడవను ఇంతటితో వదిలేయాలని, అరియానాను తాను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయలేదని చెప్పాడు.


Click it and Unblock the Notifications











