Bigg Boss Telugu 4: మోనాల్ పిల్లలు ఎలా పుడుతారో చెప్పు.. చిలిపి ప్రశ్నలతో అభిజిత్ ఝలక్

బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో 94వ రోజున ఎంటర్‌టైన్‌మెంట్ పద్దతిలో మరో టాస్క్‌ను ఇంటి సభ్యులకు ఇచ్చారు. 30 నిమిషాల్లో కొన్ని పనులు చేయాలని సూచించారు. కూరగాయాలు తరమడం, బట్టలు మడతపట్టడం లాంటి పనులు 30 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఈ టాస్క్‌ సందర్భంగా కంటెస్టెంట్‌ ఏకాగ్రతను ఇంటి సభ్యులు ఎలా భంగం చేశారంటే..

మోనాల్‌ను విసిగించిన అభిజిత్

మోనాల్‌ను విసిగించిన అభిజిత్

ఏకాగ్రత టాస్క్‌లో మోనాల్ గజ్జర్ మొదట పాల్గొన్నది. బిగ్‌బాస్ చెబుతున్న టాస్క్‌లను చేస్తుండగా మోనాల్‌ను అభిజిత్ విసిగించాడు. పిల్లలు ఎలా పుడుతారు అంటూ అభిజిత్ ప్రశ్నను అడిగితే.. అమ్మ హాస్పిటల్‌కు వెళితే.. డాక్టర్లు హెల్ప్ చేస్తారు అంటూ సమాధానం ఇచ్చింది.

ఎవరెస్ట్ పర్వతం ఎక్కడ అంటూ

ఎవరెస్ట్ పర్వతం ఎక్కడ అంటూ

ఆ తర్వాత మోనాల్‌ ఏకాగ్రతను చెడగొట్టడానికి అభిజిత్ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎవరెస్ట్ పర్వతం ఎక్కడ ఉన్నది అంటూ అడిగిన ప్రశ్నకు మోనాల్ సమాధానం ఇస్తూ.. ఇండియా, చైనా బోర్డర్‌లో ఉంది అంటూ చెప్పగానే.. అభిజిత్ కిందపడిపోయాడు.

మాలో శివగామి ఎవరో చెప్పు

మాలో శివగామి ఎవరో చెప్పు

ఆ తర్వాత అభిజిత్ టాస్క్ ప్రారంభించగానే.. అందరూ ప్రశ్నలు సంధించారు. ఇంటిలో ఉన్న ముగ్గురిలో శివగామి ఎవరూ అని అడిగితే.. శివగామిలో అందం మోనాల్‌ది, పౌరుషం అరియానాది, ప్రేమ దేత్తడి హారికకు ఉంది అంటూ తెలివిగా అభిజిత్ సమాధానం చెప్పడంతో ముగ్గురు షాక్ తిన్నారు.

అభిజిత్‌కు బాహుబలి ప్రశ్న

అభిజిత్‌కు బాహుబలి ప్రశ్న

ఆ తర్వాత అభిజిత్ మరోసారి బాహుబలి పరీక్ష పెట్ారు. మాలో శివగామి, అనుష్క, తమన్నా ఎవరో ఒక్కరికి చెప్పమంటూ హారిక, అరియానా, మోనాల్ అడిగితే.. చెప్పడం కష్టం అంటూ అభిజిత్ స్పష్టం చేశాడు. ఆ తర్వాత ముగ్గురిలో శివగామి, తమన్నా, ఎవరంటే.. శివగామి అరియానా, తమన్నా హారిక, అనుష్క మోనాల్ అంటూ అభిజిత్ సమాధానం చెప్పారు.

విజేతగా అరియానా గ్లోరి

విజేతగా అరియానా గ్లోరి

30 నిమిషాల్లో ఏకాగ్రత అనే టాస్క్‌లో 30 నిమిషాలను అంచనా వేయడంలో అందరూ విఫలమయ్యారు. 50 నిమిషాలకుపైగా హారిక, 47 నిమిషాలకు పైగా సోహెల్, 42 నిమిషాలు అభిజిత్, 40 నిమిషాలకు పైగా మోనాల్ సమయం తీసుకొన్నారు. అయితే, 37 నిమిషాల్లో అరియానా అంచనా వేసినట్టు బిగ్‌బాస్ ప్రకటించారు. తక్కువగా టార్గెట్‌కు దగ్గరగా ఉన్నందున ఆరియానాను విజేతగా ప్రకటించారు.

Recommended Video

Chiranjeevi Helps His Fan Financially For His Daughter's Wedding
నన్ను ఆదరించండి అంటూ రెండోసారి అరియానా

నన్ను ఆదరించండి అంటూ రెండోసారి అరియానా

విజేతగా నిలిచిన అరియానా గ్లోరికి గోల్డెన్ మౌత్ పీస్ ఇచ్చి ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశాన్ని ఇచ్చారు. దాంతో రెండోసారి ప్రేక్షకులతో మాట్లాడుతూ.. తనకు ఓట్లు వేయమని అడిగారు. ఇప్పటి వరకు ఆదరించిన మీరు.. ఇక ముందు కూడా ఆదరించి నా లక్ష్యాన్ని చేరుకొనేందుకు ప్రయత్నించండి అంటూ అరియానా అభ్యర్థించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X