బూతులు తిట్టుకొన్న అఖిల్, సోహైల్.. టాస్క్‌లో ఫైటింగ్.. దారుణంగా కంటెస్టెంట్లను హింసిస్తూ..
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో నామినేషన్ల ప్రక్రియ మరింత టెన్షన్‌గా కనిపించింది. ఇంటి సభ్యులకు ఇచ్చిన టాస్క్ దారుణంగా, కష్టతరంగా ఉండటంతో కంటెస్టెంట్లు విపరీతమైన బాధకు లోనయ్యారనే విషయం కనిపించింది. దానికి తోడు సోహైల్, అఖిల్ మధ్య గొడవ మరింత ఉద్రిక్తతలు పెంచింది. ఇక తాజా ప్రోమోలో వెల్లడించిన ప్రకారం...

కెప్టెన్సీ టాస్క్ కోసం
ఇంటిలో కెప్టెన్సీ టాస్క్ కోసం ఇంటి సభ్యుల మధ్య టాస్క్ జరిగింది. ఈ టాస్క్‌లో అభిజిత్, అమ్మా రాజశేఖర్, అవినాష్, మోనాల్, హారిక పాల్గొన్నారు. ఈ టాస్క్ ప్రకారం ఓ చెక్కపై తల పెట్టి పోటీదారులు నిలుచుంటే వారిని తమకు తోచినట్టుగా వారిని అక్కడి నుంచి తప్పుకొనేలా చేయాలి. ఎవరైతే తప్పుకొంటారో వారు కెప్టెన్సీ టాస్క్‌కు అనర్హులు అని గేమ్ రూల్స్ చెప్పారు.

నీళ్లు, గడ్డి, ఇసుక, మట్టితో
టాస్క్‌లో భాగంగా చెక్కపై తల పెట్టిన కంటెస్టెంట్లపై నీళ్లు, గడ్డి, ఇసుక, మట్టి పోశారు. అయినా వారి చేష్టలను తట్టుకొని కెప్టెన్సీ పోరులో నిలిచారు. ఓ దశలో మోనాల్, హారికలో ఏడుస్తూ, మూలుగుతూ కనిపించారు. అయితే అమ్మా రాజశేఖర్ తలపై పోయడం లేదంటూ అఖిల్ గొడవ చేశాడు. దాంతో ఇంటి సభ్యుల మధ్య టెన్షన్ వాతావరణం పెరిగింది.

అఖిల్ నేలను కాలితో తన్ని రచ్చ
టాస్క్ ఆడుతున్న తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అఖిల్ సార్థక్ నానా గొడవ చేశాడు. కాలితో నేలను తన్ని ఎలా ఆడుతారో చూస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు. అఖిల్ మాటలకు ధీటుగా సమాధానం ఇస్తూ సోహైల్ కనిపించారు. ఇదంతా ఇంటి సభ్యుల్లో ఆందోళన కలుగజేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సోహైల్, అఖిల్ మాటలు రువ్వుకొన్నారు.

ఎవడు స్టార్ట్ చేసిండు బే అంటూ అఖిల్
టాస్క్ సందర్భంగా చోటుచేసుకొన్న గొడవలకు నీవే కారణం.. మేము కాదు అంటూ సోహైల్ చేతిలో ఉన్న వస్తువును నేలకేసి కొట్టాడు. దానిపై అఖిల్ రియాక్ట్ అవుతూ .. ఎవడు స్టార్ట్ చేసిండు బే అంటూ నోరు జారాడు. నువ్వే.. నువ్వే అంటూ ఇద్దరు రెచ్చిపోయారు. ఓ దశలో బే అని నోరు జారకు అని అఖిల్‌కు సోహైల్ వార్నింగ్ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











