బిగ్‌బాస్ నుంచి అమ్మా రాజశేఖర్ అవుట్.. అయితే కెప్టెన్ ఎవరు?
బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో తొమ్మిదో వారంలో ఎలిమినేషన్ ప్రక్రియ అంతా రంగం సిద్ధమైంది. అయితే తాజా సమాచారం ప్రకారం అమ్మా రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యారనే సమాచారం బయటకు వచ్చింది. దాదాపు ఆదివారానికి సంబంధించిన షూట్ కూడా పూర్తి కావడంతో ఎలిమినేషన్ లీక్ బయటపడింది. అయితే అమ్మా రాజశేఖర్ ఇంటి నుంచి వెళ్లిపోతాడనే విషయం ప్రేక్షకుల్లో ఎప్పటి నుంచో ఉంది. అయితే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అమ్మా రాజశేఖర్ బయటకు వెళ్తే కెప్టెన్ ఎవరనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...

గతవారమే బతికిపోయిన అమ్మా రాజశేఖర్
ప్రేక్షకుల ఓట్ల ప్రకారం అమ్మా రాజశేఖర్ గతవారమే ఎలిమినేట్ అయ్యారు. నోయల్ సీన్ బయటకు వెళ్లారనే ఓకే కారణంతో అమ్మా రాజశేఖర్ ఎలిమినేషన్ నుంచి బతికిపోయాడు. ఇక తొమ్మిదో వారంలో బలమైన కంటెస్టెంట్లు ఉండటం, అమ్మా రాజశేఖర్ బలహీన అభ్యర్థిగా అనిపించడంతో అతడు ఎలిమినేట్ అవుతాడనే అభిప్రాయం అందరిలో నెలకొని ఉంది.

ఏది జరిగినా హ్యాపీనే.. మాస్టర్
ఇలాంటి పరిస్థితుల్లో ఎలిమినేషన్ గురించి నాగార్జున ప్రస్తావించగా.. బిగ్‌బాస్ ఇంటిలో ఉన్నా హ్యాపీనే.. బయటకు వెళ్లినా హ్యాపినే. ఎలిమినేషన్‌లో ఏది జరిగినా సంతోషంగా ఉంటానని అమ్మా రాజశేఖర్ చెప్పడం తెలిసిందే. అదేంటి అని నాగార్జున ప్రశ్నిస్తే.. హ్యాపీగా ఉండటం ముఖ్యం. ఎక్కడ ఉన్నామనే విషయం కాదు అని తనదైన శైలిలో మాస్టర్ సమాధానం ఇచ్చారు.

బిగ్‌బాస్ చరిత్రలో కొత్త సంప్రదాయం
అమ్మా రాజశేఖర్ బిగ్‌బాస్ నుంచి అవుట్ అయితే గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓ రికార్డుగా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కెప్టెన్‌గా ఉన్న వ్యక్తి ఎన్నడూ ఎలిమినేట్ కాలేదు. అయితే బిగ్‌బాస్ తెలుగు 4 ఎలిమినేషన్ విషయంలో కొత్త ఒరవడిని, సంప్రదాయాన్ని మొదలుపెట్టిందనే చెప్పవచ్చు. గతంలో కెప్టెన్‌గా ఉన్న సెలబ్రిటీలు ఎలిమినేట్ అయినా వారిని సీక్రెట్ రూమ్‌లోకి తీసుకెళ్లి వారిని మళ్లీ ఇంటిలోకి తీసుకు వచ్చి బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

కెప్టెన్ ఎవరనే ప్రశ్న ఇంటి సభ్యుల ముందుకు
అయితే సాధారణ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ కెప్టెన్‌గా ఉన్న వ్యక్తి ఎలిమినేట్ అయితేనే ఓ సమస్య వచ్చి పడుతుంది. ఇంటి వ్యవహారాలను చక్కదిద్దే అవకాశం ఎవరికో ఇవ్వాల్సిన పరిసథితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో అమ్మా రాజశేఖర్ ఎలిమినేషన్‌లో ఎలాంటి ట్విస్టులు లేకపోతే కెప్టెన్ ఎవరనే విషయంపై కచ్చితంగా ఓ ప్రశ్న ఎదురు కావడం తథ్యం.

కెప్టెన్సీ కోసం ఏం చేస్తారంటే..
ఇలాంటి పరిస్థితుల్లో అమ్మా రాజశేఖర్ స్షానంలో కెప్టెన్‌గా నియమించేందుకు మళ్లీ గేమ్ ఆడిస్తారా? లేక కెప్టెన్‌కు అసిస్టెంట్‌గా ఉన్న అరియానాకు ఆ బాధ్యతలను అప్పగిస్తారా అనే విషయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. లేక రేషన్ మేనేజర్‌నే కెప్టెన్ చేస్తారా అనేది కొద్ది గంటలు ఆగితే తెలిసిపోతుంది.

అందరూ వ్యతిరేకించిన అరియానానే...
అమ్మా రాజశేఖర్ ఎలిమినేట్ అవుతాడనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అరియానా కెప్టెన్సీ ఫెర్ఫార్మెన్స్‌పై ఇంటి సభ్యులతో సర్వే చేయించాడనే విషయం అర్ధమవుతున్నది. అయితే ఇంటి సభ్యులందరూ అరియానా కెప్టెన్సీని వ్యతిరేకిస్తూ ఓట్లు వేశారు. అయితే ట్విస్టులు ఇవ్వడం బిగ్‌బాస్‌లో కాబట్టి.. అమ్మా రాజశేఖర్ నిజంగా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లయితే.. అందరూ వ్యతిరేకించిన అరియానానే ఇంటి కెప్టెన్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











