నన్ను శిక్షించడానికి నోయల్ ఎవడు.. వాడు కొట్టాడు.. నువ్వు కొడుతావా? అభిజిత్‌పై మాస్టర్ ఆగ్రహం
బిగ్‌బాస్ ఇంటిలో అభిజిత్, అమ్మా రాజశేఖర్ మద్య వాడివేడిగా వాగ్వాదం జరిగింది. నామినేషన్ల ప్రక్రియ మధ్య నోయల్ ప్రస్తావన రావడంతో అప్పటికే కోపంతో ఉన్న అమ్మా రాజశేఖర్ మరింత ఆగ్రహంతో ఊగిపోయాడు. నన్ను నామినేట్ చేయడానికి ఒకరు పేరు ప్రస్తావించవద్దని ఘాటుగా స్పందించాడు. ఈ క్రమంలో ఆ ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం ఇలా..

అందుకే నామినేట్ చేస్తున్నా
బిగ్‌బాస్ నుంచి వెళ్లిపోతూ నోయల్ సీన్ చెప్పిన విషయాలను నీవు సరిగా తీసుకోలేదు. మీరు ఒకరు చెబితే వినరు. మీరు చెప్పిందే వినాలని అనుకొంటారు. అది తప్పు. అందుకే నిన్ను నామినేట్ చేయాలని అనుకొన్నాను అని అభిజిత్ తెలిపారు. అయితే అభిజిత్ మాటలకు అడ్డుపడి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నోయల్ నన్ను చిల్లర కామెడీ అంటాడా?
నోయల్ ఎవడు నాకు పనిష్‌మెంట్ ఇవ్వడానికి.. వాడు చిల్లర కామెడీ అంటూ నన్ను కామెంట్ చేస్తాడా? అలాంటి వాడి మాటలు నా వద్ద ప్రస్తావించకు. నీవు ఎలాంటి కారణంతోనైనా నన్ను నామినేట్ చేస్తే సరి. లేదంటూ వాడి మాట నా వద్ద తీసుకురాకు. వాడు వెళ్లిపోతూ ఒకరిని బ్యాడ్‌గా చేసే వాడి గురించి నాకు చెబుతావా అంటూ గట్టిగా అమ్మా రాజశేఖర్ అరిచేశాడు.

ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లేటప్పుడు
నోయల్ ఏదైనా చెప్పాలనుకొంటే.. లేదా వాడికి మా వల్ల ఏదైనా ఇబ్బంది కలిగితే ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోతూ మాపై చెడుగా ప్రచారం చేయాలనుకొన్నాడు. వాడు అవినాష్‌ను టార్గెట్ చేయడం తప్పు. వాడు ఇంట్లో ఉన్నప్పుడు మా కామెడికి నవ్వినప్పుడు ఇప్పుడు వాడికి ఎందుకు కష్టమైంది అని అమ్మా రాజశేఖర్ ప్రశ్నించాడు.

బిగ్‌బాస్ రూల్స్‌కు వ్యతిరేకంగా కొట్టాడు..
నోయల్ సీన్ నన్ను తలపై గట్టిగా కొట్టాడు. బిగ్‌బాస్ నిబంధనల ప్రకారం ఒకరిపై చేయి చేసుకోవడం, కొట్టడం లాంటివి వ్యతిరేకం. అయినా నేను వాడు చేసిన పనిని ఓర్చుకొన్నాను. బండోడా.. గుండోడా అంటూ నన్ను కొడితే ఊరుకొన్నాను. వాడు కొట్టడం వల్ల నేను ఎంత బాధపడ్డానో తెలుసా? అంటూ అభిజిత్‌ను అమ్మా రాజశేఖర్ దుమ్ము దులిపాడు.

నీవు నాకు శత్రువు కాదు
ఇక అభిజిత్‌ను అమ్మా రాజశేఖర్ నామినేట్ చేశాడు. నీవు నాకు ఇంటిలో శత్రువు కాదు. ఇక ముందు నోయల్ సీన్ విషయం ఎత్తవద్దు. వాడి పేరు ఎత్తకుండా నాతో మాట్లాడు. అంతేగానీ ఇంట్లో లేని వాడి గురించి చెబుతూ నన్ను ఇబ్బంది పెట్టకు. ఇంకోసారి నన్ను ఇలాంటి విషయాలతో బాధపెట్టకు అని అభిజిత్‌తో అమ్మా రాజశేఖర్ అన్నారు.

తలపై నీ చేతులతో ఆశీర్వాదం
తన తలపై కొడిగుడ్డు కొట్టబోతుండగా.. మీరు తలపై చేయిపెట్టి ఆశీర్వదిస్తున్నారు. అది చాలూ అంటూ అభిజిత్ అంటే.. నా ఆశీర్వాదం ఎప్పటికి నీ మీద ఉండదు. నాకు అలాంటి అభిప్రాయం ఉండదు అంటూ అమ్మా రాజశేఖర్ అన్నాడు. నోయల్ సీన్ గురించి వారిద్దరి మధ్య భారీగా గొడవ జరగడంతో ఇంటి సభ్యులు షాక్ తిన్నారు. ఇద్దరిని ఆపేందుకు సోహైల్ ప్రయత్నించాడు.


Click it and Unblock the Notifications











