సూసైడ్ చేసుకొనే పరిస్థితి.. నోయల్ ఎవడు? పొట్టమీద కొట్టకు.. అభిజిత్‌పై అమ్మా రాజశేఖర్ ఫైర్

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోను వదిలి వెళ్తూ కంటెస్టెంట్ నోయల్ సీన్ పెట్టిన చిచ్చు రావణ కాష్టంలా మారుతున్నది. అలాగే హోస్ట్ నాగార్జున చూపించిన వీడియోలతో ఇంటి సభ్యుల మధ్య దూరం మరింత పెరిగింది. 9వ వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియ సందర్భంగా మరోసారి ఇంటి సభ్యుల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. 58వ రోజు ఇంటిలో ఏం జరిగిందంటే..

అభిజిత్ నామినేట్ చేయబోగా..

అభిజిత్ నామినేట్ చేయబోగా..

అమ్మా రాజశేఖర్‌ను అభిజిత్ నామినేట్ చేయడంతో ఇంట్లో లొల్లి మొదలైంది. నోయల్ సీన్ చేసిన కామెంట్లను అంటూ అభిజిత్ తన అభిప్రాయాన్ని చెప్పడానికి ప్రయత్నించగానే.. అమ్మా రాజశేఖర్ అడ్డుకొన్నాడు. వాడేవడూ నన్ను కామెంట్ చేయడానికి అంటూ నోయల్‌పై మండిపడ్డాడు. వాడి విషయం ఎత్తకు అంటూ గరం అయ్యాడు.

పొట్ట మీద కాదు.. వీపు మీద కొట్టు

పొట్ట మీద కాదు.. వీపు మీద కొట్టు

ఇక మీరు చాలా కింది స్థాయి నుంచి పైకి వచ్చారు. గ్రూప్ డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్‌గా అంటూ ఏదో అభిజిత్ చెప్పబోగా అమ్మా రాజశేఖర్ నా వ్యక్తిగత విషయం నా ముందుకు ఎత్తొద్దు. నా కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. నా పొట్టమీద కొట్టకు. కావాలంటే వీపు మీద కొట్టు అంటూ అమ్మా రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కష్టమంటే నీకు తెలుసా?

కష్టమంటే నీకు తెలుసా?

నేను ఎలా కష్టపడ్డానో మీకు ఏం తెలుసు అంటే అందరూ కష్టపడే వస్తారు అంటూ అభిజిత్ సమాధానం ఇచ్చాడు. అయితే నీవు కష్టపడ్డావా? కుర్చీలో కూర్చోవడం కష్టమంటారా అంటూ ప్రశ్నించాడు. ఈ క్రమంలో నోయల్ గురించి అభిజిత్ మాట్లాడబోతుంటూ.. మళ్లీ అడ్డుకొన్నాడు. ఆ సమయంలో వాడు సూసైడ్ చేసుకొనే పరిస్థితి అంటూ గట్టిగా అరిచాడు. అయితే సూసైడ్ విషయం ఎందుకు వచ్చిందో అర్థం కాకుండా ఉంది.

 అఖిల్‌ను నామినేట్ చేసిన అమ్మా రాజశేఖర్

అఖిల్‌ను నామినేట్ చేసిన అమ్మా రాజశేఖర్

ఇక అఖిల్‌ను అమ్మా రాజశేఖర్ నామినేట్ చేశాడు. నువ్వు ఎలా నన్ను ఇంటికి పంపించాలనుకొన్నావో.. అలాగే నేను కూడా నిన్ను బయటకు పంపించాలని నామినేట్ చేశాను అని అన్నాడు. అయితే సిల్లీ కారణాలు చెప్పి నామినేట్ చేయాలని అఖిల్ సూచించాడు. నువ్వు నన్ను ఇంటి నుంచి పంపించాలని అనుకుంటే.. నేను అలా అనుకోవద్దా అని మాస్టర్ సమాధానం ఇచ్చారు

నామినేషన్ల ప్రక్రియలో బిగ్‌బాస్ ట్విస్టు

నామినేషన్ల ప్రక్రియలో బిగ్‌బాస్ ట్విస్టు

ఇలా గొడవల మధ్య నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని బిగ్‌బాస్ ప్రకటించారు. అమ్మా రాజశేఖర్, అభిజిత్, అవినాష్, హారిక, మోనాల్ 9వ వారానికి నామినేట్ అయ్యారని చెప్పాడు. ఆ తర్వాత ఇంటి సభ్యులను సమావేశ పరిచి నామినేషన్ల ప్రక్రియ ముగియలేదని, నామినేషన్ల నుంచి తప్పించుకోవాలంటే ఓ గేమ్ ఆడాలి. ముఖం దాచుకో టాస్క్ ఆడమని చెప్పాడు. ఎవరై చెక్క మీద నుంచి కదలకుండా గేమ్ అయ్యేంత వరకు ఉంటాడో అతడు నామినేషన్ నుంచి సేవ్ అవుతాడు అని చెప్పాడు.

అర్ధాంతరంగా ముగిసిన టాస్క్

అర్ధాంతరంగా ముగిసిన టాస్క్

ముఖం దాచుకో టాస్క్ సందర్భంగా అఖిల్, సోహైల్ మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. తనను బే అంటూ తిట్టడంతో అఖిల్‌పై సోహైల్‌ మండిపడ్డాడు. మాటలు జాగ్రత్తగా రావాలి అంటూ ఒకరిపై ఒకరు కలియబడ్డారు. అలా గేమ్‌ అంతా గొడవలో సాగింది. చివరకు ముఖం దాచుకో టాస్క్ అర్ధాంతరంగా ముగిసింది. ఇంటి సభ్యులు ఎవరూ నామినేట్ తప్పించుకోలేకపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X