ఇంటి సభ్యులను సూట్‌కేస్ సర్దుకోమన్న బిగ్‌బాస్.. కెప్టెన్సీ టాస్క్ రద్దు.. కంటెస్టెంట్లకు షాక్స్‌పై

బిగ్‌బాస్ తెలుగు ఇంటిలో భిన్నమైన పరిస్థితి ఎదురైంది. నాలుగు సీజన్‌లో ఇంటికి కెప్టెన్ లేకుండానే గడిచిపోనున్నది. ఇంటిలో సభ్యుల మధ్య అత్యాశ వల్ల ఎవరికీ ఇమ్యునిటీ లభించకుండా పోయింది. ఇంటి సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి కెప్టెన్సీ టాస్క్ రద్దు చేసి వార్నింగ్ ఇచ్చారు. ఇంతకు కెప్టెన్సీ టాస్క్ ఎందుకు రద్దు చేశారంటే..

కెప్టెన్సీ కోసం ఆఖరి బంతి

కెప్టెన్సీ కోసం ఆఖరి బంతి

ఇంటిలో 10వ వారం కోసం ఆఖరి బంతి టాస్క్‌ను ఇంటి సభ్యుల ముందుకు తీసుకు వచ్చారు. తమ బొమ్మ ఉన్న బంతి కాకుండా వేరే బంతిని తీసుకొని దానిని బాస్కెట్ బాల్ పోల్‌లోని గోల్‌లో వేయాలి. చివరిగా వేసిన వారు రేసు నుంచి బయటకు వెళ్లిపోతారు అని రూల్ చెప్పారు. అలా గేమ్‌ను ఇంటి సభ్యులతో ఆలోచించారు.

అఖిల్, మెహబూబ్ మధ్య డ్రామా

అఖిల్, మెహబూబ్ మధ్య డ్రామా

చివరకు రేసులో అఖిల్, మెహబూబ్ కెప్టెన్సీ టాస్క్‌లోనే మిగిలారు. అయితే ఎవరో ఒకరు త్యాగం చేయాల్సిన పరిస్థితుల్లో వారు కాంప్రమైజ్ కాకుండా ఉన్నారు. అయితే వారు అలానే ఉండి గేమ్‌ను ఆపివేయడంతో బిగ్‌బాస్ వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఇంటి సభ్యుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.

కెప్టెన్సీ టాస్క్ రద్దు

కెప్టెన్సీ టాస్క్ రద్దు

ఇంటి సభ్యులకు ఇమ్యునిటీ అవసరం లేన్నట్టు కనిపిస్తుంది. గేమ్ సరిగా అర్థం చేసుకోకుండా ఆడుతున్నారు మీరిద్దరు అంటూ మెహబూబ్, అఖిల్‌పై ఘాటుగా మండిపడ్డారు. ఇంటి సభ్యులు ఇప్పటి వరకు ఆడిన ఇంటి సభ్యులు ఆటను గౌరవించడం లేదు. కాబట్టి కెప్టెన్సీ టాస్క్‌ను రద్దు చేస్తున్నాం అంటూ వార్నింగ్ ఇచ్చారు.

ఇమ్యునిటీ లభించదు

ఇమ్యునిటీ లభించదు

ఇంటి సభ్యుల తీరువల్ల పదో వారంలో ఇంటికి కెప్టెన్ ఉండరు. ఈ వారం అంతా కెప్టెన్ లేకుండానే ఉండాలి. కెప్టెన్సీ వల్ల వచ్చే ఇమ్యునిటీ కూడా ఉండదు. ఈ అవకాశాన్ని ఎవరూ ఉపయోగించుకోలేకపోవడం దురదృష్టకరం అంటూ కామెంట్ చేశాడు.

Recommended Video

Chiranjeevi Tests Positive For COVID-19, Under Home Quarantine | Filmibeat Telugu

అర్ధరాత్రి నిద్ర లేపి


ఇక 65వ రోజు బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు షాకిచ్చారు. అర్ధరాత్రి సైరన్ మోగించి ఇంటి సభ్యులను నిద్ర లేపారు. వారిని సూట్ కేసులు సర్దుకొని లాన్ లోకి రమ్మని అడిగారు. ఆ తర్వాత ఫైనల్ వరకు మీకు ఎవరు అడ్డు పడుతారో వారిలో నుంచి ఒకరి పేరు చెప్పండి అని అడిగారు. దీంతో ఇంటి సభ్యుల్లో టెన్షన్ పెరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X