Just In
- 8 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 9 hrs ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 10 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 11 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Lifestyle
ఆదివారం దినఫలాలు : ఈరోజు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా పని చేయాలి...!
- News
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిగ్‌బాస్ తెలుగు 4 ఓటింగ్ లీక్: తారుమారైన అభిజిత్ ఓట్ల శాతం.. రన్నరప్ కోసం ఆ ఇద్దరి మధ్యే పోటీ
తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షో సీజన్ 4కు సంబంధించిన ఓటింగ్ లైన్లు శుక్రవారం అంటే డిసెంబర్ 18వ తేదీతో ముగుస్తాయి. ఈ క్రమంలో తన అభిమాన కంటెస్టెంట్‌ను గెలిపించుకొనేందుకు ప్రేక్షకులు శాయశక్తుల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు కంటెస్టెంట్లు భారీ ఓటింగ్‌ను సంపాదించుకొన్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

అభిజిత్‌దే పైచేయి..
బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్ మొదలైనప్పటి నుంచి ఓటింగ్ విషయంలో అభిజిత్‌దే పైచేయి. మరే ఇతర కంటెస్టెంటు కూడా గత 14 వారాల్లో అభిజిత్‌ను మించి ఓటింగ్ శాతాన్ని నమోదు చేసుకోలేదు. ఇక అదే ప్రభంజనం 14 వారం కూడా అదే విధంగా కొనసాగుతున్నట్టు సమాచారం.

సగానికిపైగా ఓట్లు అభిజిత్ ఖాతాలోకే
14వ వారంలో ఇప్పటి వరకు అంటే ఓటింగ్ లైన్లు ముగియడానికి ఒక రోజు ముందు అంటే గురువారం రాత్రి వరకు అభిజిత్ టాప్ పోజిషన్‌లో కొనసాగుతున్నాడు. ఓటైన మొత్తంలో దాదాపు సగానికిపైగా ఓట్లు అభిజిత్ ఖాతాలో పడ్డాయి. సుమారు 60 శాతం ఓట్లు అభిజిత్‌కే దక్కినట్టు తెలుస్తున్నది.

మిస్డ్ కాల్ డేటాలో అరియానా టాప్
అభిజిత్‌కు యాప్ ద్వారా ఓటింగ్ విషయంలో ఎదురేలేనప్పటికి.. మిస్డ్ కాల్ డేటా విషయానికి వస్తే అభిజిత్‌కు కొంచెం గట్టిపోటి ఎదురైనట్టు తెలుస్తున్నది. మిస్డ్ కాల్ డేటాలో అరియానా గ్లోరి ముందు ఉన్నట్టు సమాచారం. ఓటింగ్ పరంగా అరియానా ముందుకు రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

సోహెల్‌పై అరియానా అధిపత్యం
ఇక రెండో స్థానం కోసం సయ్యద్ సోహెల్ ర్యాన్, అరియానా గ్లోరి మధ్య భారీ పోటి జరిగే అవకాశం కనిపిస్తున్నది. యాప్ ఓటింగ్ డేటా ప్రకారం సోహెల్ ముందున్నప్పటికీ.. మిస్డ్ కాల్ డేటా పరిగణనలోకి తీసుకొంటే అరియానాకు పాజిటివ్‌గా మారిందనే విషయం ఇప్పుడు చర్చగా మారింది.

రెండో స్థానం కోసం భారీ పోటీ
బిగ్‌బాస్ తెలుగు 4 విజేతగా అభిజిత్‌ను ఇప్పటికే ప్రేక్షకులు ప్రకటించినంత పనిచేశారు కాబట్టి రెండోస్థానంలో ఎవరు ఉంటారనే విషయంపై ఆసక్తికరంగా చర్చ జరుగుతున్నది. ఒకవేళ మిస్డ్ కాల్ డేటా, యాప్ డేటా పరిశీలిస్తే తక్కువ తేడాతో అరియానా గానీ, సోహెల్ గానీ రన్నరప్‌గా నిలుస్తారనే ఊహగానాలు కొనసాగుతున్నాయి.

శనివారం సాయంత్రం కల్లా
బిగ్‌బాస్ తెలుగు 4 ముగింపు వేడుకకు సంబంధించిన షూట్ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయాయి. శనివారం ఉదయం నుంచే టాప్ 5 కంటెస్టెంట్ల పోజిషన్‌కు సంబంధించిన ప్రక్రియను హోస్ట్ నాగార్జున ప్రారంభిస్తారు. శనివారం సాయంత్రం కల్లా విజేత ఎవరనే విషయంపై స్పష్టత వస్తుంది.

ఆదివారం ముగింపు వేడుకలు
ఇక బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌కు సంబంధించిన గ్రాండ్ ఫినాలే ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రసారం కాబోతుంది. బిగ్‌బాస్ ఫైనల్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో భారీ టీఆర్పీ రేటింగ్ నమోదయ్యే అవకాశం లేకపోలేదు.