నాకు తీట.. అలానే చేస్తా.. సోహైల్ వీరంగం.. రా.. కౌగిలించుకో.. మోనాల్‌ ఆఫర్.. అఖిల్ ఏం చేశాడంటే

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4లో 87వ రోజున నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య భారీగా వాదోపవాదాలు చోటుచేసుకొన్నాయి. అలాగే ఇంటిలో అరియానా, సయ్యద్ సోహైల్ మధ్య జరిగిన సంభాషణ కొంత వినోదంగా, మరికొంత సీరియస్‌గా సాగింది. నామినేషన్ల ప్రక్రియలో జరిగిన విషయాలు, సోహైల్, అరియానా మధ్య జరిగిన విషయాలు ఇలా ఉన్నాయి.

హగ్ ఇవ్వకుండా మోనాల్‌పై అఖిల్ షాక్

హగ్ ఇవ్వకుండా మోనాల్‌పై అఖిల్ షాక్

ఆదివారం ఎపిసోడ్ తర్వాత వాష్‌రూమ్‌లోకి వచ్చిన అఖిల్, మోనాల్ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. నా పక్కన ఎందుకు కూర్చోలేదు అంటూ అఖిల్ అడిగితే.. అలా జరిగిపోయింది. దాని వెనుక ఎలాంటి కారణం లేదు అంటూ అన్నారు. అయితే నాకు హగ్ ఇవ్వు అంటే. ఇష్టం లేకుండా కౌగిలించుకోవడంతో.. నీవు నాకు తెలిసిన అఖిల్ కావు. అఖిల్ అలా కౌగిలించుకోడు అంటూ మోనాల్ బాధపడింది. అయితే నాతో మాట్లాడకు అని అఖిల్ అంటే.. స్పేస్ కావాలా? టైమ్ కావాలా అని మోనాల్ అంటే.. ఇంటిలో చాలా స్పేస్ ఉంది అని అఖిల్ సమాధానం ఇచ్చాడు.

నిద్రపోయిన మెహబూబ్, సోహైల్

నిద్రపోయిన మెహబూబ్, సోహైల్

ఇంటిలో నిద్రపోయిన మెహబూబ్, సోహైల్‌ను చూసి కుక్కలు మొరిగాయి. అయితే అందుకు శిక్షగా రెండు బకెట్లతో స్నానం చేయాలి అని కెప్టెన్ అరియానా ఆదేశించింది. అయితే మెహబూబ్ బయటకు రాగా.. సోహైల్ వెళ్లి రెండు బకెట్ల నీళ్లు తెచ్చి మీద పోశాడు. అయితే తాను కూడా నిద్రపోయాను. కానీ అబద్దం ఆడి పనిష్‌మెంట్ తప్పించుకొన్నానని చెప్పాడు. ఆ విషయం అరియానాకు తెలిసినా మామూలుగానే ఉంది.

స్విమ్మింగ్ పూల్‌లో దూకిన సోహైల్

స్విమ్మింగ్ పూల్‌లో దూకిన సోహైల్

మెహబూబ్ నిద్రపోయి పనిష్‌మెంట్ అనుభవించిన కాసేపటికే.. సోహైల్ నిద్రపోవడం వెంటనే కుక్కలు మొరగడంతో అరియానా వచ్చి రెండు పనిష్‌మెంట్స్ పూర్తి చేయమని అరియానా సూచించింది. అయితే ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు సాయంత్రం చేస్తానని సమాధానం చెబితే అరియానా ఒప్పుకోలేదు. 15 నిమిషాల్లో పనిష్‌మెంట్ పూర్తి చేయాలని సూచించడంతో పరుగెత్తుకెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో దూకాడు. ఇక నుంచి నేను నిద్ర పోతా.. పనిష్‌మెంట్ అనుభవిస్తూనే ఉంటా అని అన్నాడు.

అరియానాపై సోహైల్ వీరంగం

అరియానాపై సోహైల్ వీరంగం

అయితే అఖిల్, అవినాష్ ఇతరులు వచ్చి ఎందుకు నిద్రపోవడం, ఎందుకు పనిష్మెంట్ అనుభవించడం ఎందుకు అంటే.. నాకు తీట.. నేను అలానే చేస్తా. నా ఇష్టం. కెప్టెన్ అయినంత మాత్రాన ఆదేశాలిస్తారా; నాకు పనిష్మెంట్ కంటే నా హెల్త్ ముఖ్యం అని సోహైల్ చిలిపిగా నవ్వుతూ అన్నాడు. ఇక అరియానాను తన లేసులు ఇవ్వలేదని ఆటపట్టించు.. సోహైల్ వేసే పనిష్మెంట్ కూడా అనుభవించాలని చెప్పాడు. అయితే సోహైల్ పనిష్మెంట్ ఏమిటని అరియానా అడిగితే.. ఆలోచించుకొని చెబుతా అని సోహైల్ అన్నాడు.

నామినేషన్ ప్రక్రియలో గందరగోళం

నామినేషన్ ప్రక్రియలో గందరగోళం

ఇక ఇంటిలో నామినేషన్ల ప్రక్రియ చాలా గందరగోళంగా మారింది. ఇంటి సభ్యులు ఒకరిపై మరొకరు కోడిగుడ్లు కొట్టుకొంటూ నామినేట్ చేసుకొన్నారు. అయితే నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా అరియానాకు, సోహైల్‌కు గట్టిగా గొడవ జరిగింది. ఇక అభిజిత్, అవినాష్ మధ్య కూడా వేడివేడిగా వాదనలు చోటుచేసుకొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X