Bigg Boss Telugu top 5.. లిస్టులో ఆ ఐదుగురు.. ఆమెతో డేటింగ్ చేస్తా.. మెహబూబ్ దిల్ సే హాట్ కామెంట్స్

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ముగింపు దశకు చేరుకొంటున్నది. ఇంటిలో మిగిలిన ఏడుగురు సభ్యుల్లో ఎవరు టాప్ 5లో ఉంటారనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన మెహబూబ్ ప్రస్తుతం తన భావాలను మీడియాతో పంచుకొంటున్నారు. ఈ సందర్భంగా ఇంటిలోని విషయాలను, తన అనుభవాలను చెప్పుకొంటూ..

అభిజిత్‌తో మంచి రిలేషన్

అభిజిత్‌తో మంచి రిలేషన్

ఇంటిలో నాకు సోహైల్‌కు మంచి రిలేషన్ ఉంది. అయితే అంతే బాండింగ్ నాకు అభిజిత్‌కు ఉంది. కానీ స్క్రీన్ మీద ఎక్కవడా కనిపించలేదు. నాకు ఇతరులతో గొడవలు జరిగాయి. కానీ నాకు అభిజిత్‌కు గొడవలు జరుగలేదు. మా మధ్య బలమైన స్నేహం ఉంది. అందుకే నేను వచ్చేటప్పుడు కంటతడి పెట్టుకొన్నాడు అని మెహబూబ్ తెలిపాడు.

అభిజిత్ నాకు.. నేను అభిజిత్‌కు హెల్ప్

అభిజిత్ నాకు.. నేను అభిజిత్‌కు హెల్ప్

అభిజిత్‌‌కు నేను సలహా ఇచ్చాను. కొన్ని విషయాల్లో నాకు ఆయన హెల్ప్ చేస్తే.. మరికొన్ని విషయాల్లో అభిజిత్‌కు నేను హెల్ప్ చేశాను. నోయల్‌తో అభిజిత్‌కు మంచి స్నేహం ఉంది. కానీ నోయల్ వెళ్లే సమయంలో ఎలాంటి ఫీలింగ్ అభిజిత్‌లో కనిపించలేదు. అభిజిత్‌తో మరో వ్యక్తితో బాండింగ్‌ ఉండటం వల్ల మాది చూపించలేదు అని మెహబూబ్ వెల్లడించాడు.

 అభిజిత్ కష్టాల్లో ఉంటే..

అభిజిత్ కష్టాల్లో ఉంటే..

తొలి ఐదు వారాల్లో ఒక సమస్యతో అభిజిత్ బాధపడ్డాడు. మనసులో ఎటూ తేల్చుకోలేక పోతూ మదనపడతున్నాడు. అయితే ఆ విషయాన్ని నేను గ్రహించాను. మరో వ్యక్తి వల్ల ఇది జరుగుతున్నదని అభిజిత్‌ను అలర్ట్ చేశాను. దాంతో తన గేమ్ స్ట్రాటెజీని మార్చుకొన్నాడు. అప్పటి నుంచి నన్ను మంచి ఫ్రెండ్‌గా భావించాడు. నాకు ఎలాంటి సహాయం కావాల్సి వచ్చినా నేను చేస్తుంటాను అని మెహబూబ్ చెప్పాడు.

హారికతో డేటింగ్ చేస్తా..

హారికతో డేటింగ్ చేస్తా..

ఇంటిలో నేను డ్యాన్సింగ్, యాక్టింగ్, టాస్కులు పర్‌ఫెక్ట్‌గా చేశాను. అయితే ఒకరితో అఫైర్ పెట్టుకొనే విషయంపై ఆలోచించలేదు. నాకు నేనుగా ఎలివేట్ కావాలని అనుకొన్నాను. లవ్ ట్రాక్‌తో ఫుటేజ్ సంపాదించే ప్రయత్నం చేయలేదు. ఒకవేళ లవ్ ట్రాక్ నడపాలనుకొంటే హారిక దేత్తడితో నడిపించే వాడిని అని మెహబూబ్ తెలిపాడు.

ఆ రోజు నా బ్యాగ్ కూడా సర్దుకోలేదు

ఆ రోజు నా బ్యాగ్ కూడా సర్దుకోలేదు


అన్ని రకాలుగా నేను స్ట్రాంగ్ అనే ఫీలింగ్‌లో ఉన్నాను. మరికొన్ని వారాలు ఇంటిలో ఉంటానని అనుకొన్నాను. ఎలిమినేషన్ రోజున నా బ్యాగ్‌ కూడా సర్దుకోలేదు. నేను ఎట్టి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లనననే నమ్మకం ఉంది. ఒక్కసారి ఎలిమినేట్ అయ్యానని చెప్పాక నా మైండ్ బ్లాంక్ అయింది అని మెహబూబ్ చెప్పాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Abhijeet, Sohel Fight | Silver Coins Task Made Housemates Furious
టాప్ 5లో ఉండేది వీరే..

టాప్ 5లో ఉండేది వీరే..

బిగ్‌బాస్‌లో టాప్ 5లో ఎవరు ఉంటారంటే.. అభిజిత్, సోహైల్, అఖిల్, హారిక, అవినాష్ ఉంటారని అనుకొంటున్నాను. అరియానా కూడా ఉండే అవకాశం ఉంది. కంటెస్టెంట్లు చాలా బలంగా ఉన్నారు. చివరి రోజుల్లో ఏదైనా జరుగవచ్చు. ఒకవేళ తనకు బదులుగా ఇంటి నుంచి బయటకు పంపించాల్సి వస్తే.. మోనాల్‌ను బయటకు పంపించాలని అనుకొంటాను అని మెహబూబ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X