Bigg Boss: కెప్టెన్సీ టాస్కులో ట్విస్టుల మీద ట్విస్టులు.. ప్రియకు ఊహించని బంపర్ ఆఫర్!
బిగ్ బాస్ షో ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ప్రస్తుతం 5వ వారం మధ్యలో ఉంది. ఈవారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం పోటీ పడే ఇంటి సభ్యులను ఎన్నుకోవడం కోసం ఒక రాజుల ఎపిసోడ్ ను సృష్టించారు. రవి రాజ్యం, సన్నీ రాజ్యం అంటూ రెండు భాగాలుగా హౌస్ ను విడదీయడంతో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈరోజు ఎపిసోడ్ లో రాజు గా ఎవరు గెలవ బోతున్నారు? అలాగే గెలిచిన తర్వాత కెప్టెన్సీ టాస్క్ కోసం ఎవరు పోటీ పడుతున్నారు అనే విషయాల మీద క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

ఇదంతా ఒక లవ్ స్టోరీ
ఇక తాజాగా ఒక ప్రోమో విడుదల చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఆ ప్రోమో ప్రకారం ఒకవేళ మీరు రాజు అయితే ఎవరికి కెప్టెన్సీ పోటీదారులుగా పోటీ చేసే అవకాశం కల్పిస్తారు అని శ్వేతా వర్మ యాంకర్ రవిని అడుగుతుంది. దీంతో రవి నేను ఆనీ మాస్టర్ అలాగే హమీద ఇద్దరికీ అవకాశం ఇస్తానని అంటాడు. ఇదే విషయాన్ని శ్వేతా వర్మ తీసుకెళ్లి అనీ మాస్టర్ కి చెప్పగా ఆమె మాట్లాడుతూ రామ్ హమీద అంటాడు, హమీద రామ్ అంటుంది ఇదంతా ఒక లవ్ స్టోరీ అని ఆమె అనడం కనిపించింది.

వాడు అంటూ శ్రీ రామచంద్రను
ఇక షణ్ముఖ్ జస్వంత్ కూడా పడుకొని మాట్లాడుతూ ఏది ఏమి జరిగినా హామీద కెప్టెన్ అవ్వకూడదు ఆమె కెప్టెన్ అయితే వాడు అంటూ శ్రీ రామచంద్రను ఉద్దేశిస్తూ రేషన్ మేనేజర్ అవుతాడు అని అంటాడు. ఇక ప్రియా కూడా మాట్లాడుతూ ఒకవేళ రవి హమీదని కెప్టెన్సీ పోటీదారు అని కనుక అంటే నేను సన్ని టీమ్ కి వెళ్ళి పోతాను అంటుంది.

రవి హామీ ఇచ్చాడని
మరో పక్క షణ్ముఖ్ మాట్లాడుతూ ఈ పోటీ మొదలైన మొదటి రోజే తనకు రవి హామీ ఇచ్చాడని నిన్ను కెప్టెన్సీ పోటీదారులుగా పెడతానని అనడంతో నేను ఈ టీమ్ లో కొనసాగుతున్నానని అంటాడు. ఇక సన్నీని ఉద్దేశించి మానస్ గట్టి గట్టిగా అరుస్తూ ఆ ఇద్దరిలో ఎవరైనా ఒక్కరు నీకు సపోర్ట్ చేశారా అని ప్రశ్నించడం కనిపించింది.

ఎవరు ఫైనల్?
ఇక సిరి తాను కెప్టెన్ అయ్యాక గేమ్ ఇప్పుడు మొదలవుతుంది అనడం కనిపిస్తోంది, అయితే ఆమె ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయింది కాబట్టి ఆమె మళ్లీ అవకాశం ఉంటుందో లేదో తెలియదు. సో ఆమె వేరే వారి మాటలే నా మళ్ళీ రిపీట్ చేస్తుందా అనే అనుమానం కలుగుతోంది. శ్రీ రామచంద్ర కూడా ఇదే మాటలను రిపీట్ చేయగా విశ్వ వారెవ్వా అనడం కూడా ప్రోమో లో చూపించారు. ఇక ఈరోజే చివరి అవకాశం అని ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారో ఫైనల్ గా చెప్పాలని ఇంటి సభ్యులను కోరడం కూడా కనిపిస్తోంది. అయితే సన్నీ , శ్రీరామచంద్ర మధ్య చిన్న వివాదం కూడా ఏర్పడినట్లుగా ప్రోమోలో చూపించారు.

హౌస్ కెప్టెన్ గా ప్రియా
ఇక ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు సన్నీ ఈ రాజు పోటీలో ఓడిపోయాడని, దీంతో రవి టీంలో ఉన్న సభ్యులకు కెప్టెన్సీ పోటీదారులుగా నిలబడే అవకాశం వచ్చిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు హౌస్ మొత్తం మీద అసలు కెప్టెన్సీ అవకాశమే లేదని భావిస్తున్న ప్రియకు అవకాశం రావడంతో అందరూ ఆమెను సపోర్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద ఈ రోజు రాత్రి ఎపిసోడ్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











