Bigg Boss Telugu 5.. ఆడవాళ్లు సముద్రం లాంటి వాళ్లు.. మానస్ ప్రేమ కోసం ప్రియాంక.. లవ్ గురుగా మారిన వీజే సన్నీ
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో 6వ వారం ఎలిమినేషన్ తర్వాత ఇంటిలోని సభ్యులు ఎమోషనల్‌గా మారారు. లోబో, శ్వేతా వర్మ ఇంటి నుంచి వెళ్లిన తర్వాత ఎలిమినేషన్ గురించి ఇంటి సభ్యులు చర్చించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంటిలో ఏడో వారం కోసం నామినేషన్ల ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ నామినేషన్ల ప్రక్రియ ఎలా సాగింది. 42, 43వ రోజుల్లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

సిరి హన్మంతు ఎమోషనల్‌గా
ఎలిమినేషన్ ప్రక్రియ తర్వాత లోబో, శ్వేతా వర్మ ఇంటి నుంచి వెళ్లిన అనంతరం జస్వంత్ పడాల, సిరి హన్మంతు తీవ్రంగా చర్చించుకోవడం కనిపించింది. శ్వేతా వర్మ కాకుంటే నేనే ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యేదానిని అంటూ సిరి హన్మంతు ఎమోషనల్ అయింది. అయితే అలాగా జరిగి ఉండకపోవచ్చు. నీవు ఎలిమినేట్ అయ్యే పరిస్థితి ఉండకపోవచ్చు అని జస్వంత్ మోరల్ సపోర్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు.

యాంకర్ రవి నామినేషన్ గురించి
ఇక షణ్ముఖ్, యాంకర్ రవి నామినేషన్స్, ఎలిమినేషన్స్ గురించి మాట్లాడుకొంటు కనిపించారు. గత ఐదు వారాలుగా నామినేట్ అవుతున్నాను. చాలా భయంగా ఉంది. నా భార్య నిత్య ఎలా టెన్సన్ పడతున్నదో.. నిత్య ఎలాంటి కష్టాలు పడుతున్నదో తలచుకొంటేనే భయంగా ఉంది అంటూ యాంకర్ రవి అంటూ కనించాడు.

ప్రియాంక సింగ్ గురించి సన్నీ
మానస్ గురించి వీజే సన్నీ, ప్రియాంక సింగ్ ఎమోషనల్‌గా మాట్లాడుకోవడం కనిపించింద.ి ఇంటిలో తనకు అన్నం తినిపించకపోవడంపై మానస్‌పై ప్రియాంక సింగ్ అలిగింది. ఇంట్లోని అందరికి తినిపిస్తాడు. నేను తినిపించమని చెప్పినా తినిపించలేదు. నేను అడిగినా పట్టించుకోలేదు అని ప్రియాంక సింగ్ అంటే. అయితే నీవు మానస్‌ను గట్టిగా అడుగ వచ్చు కదా అని వీజే సన్నీ అంటే.. అలా అడిగితే నన్ను ఇగ్నోర్ చేస్తాడటనే భయం ఉంది అంటూ ప్రియాంక సింగ్ చెప్పింది.

ప్రియాంక గురించి మానస్
ప్రియాంక బాధపడుతున్న విషయాన్ని మానస్‌తో విజే సన్నీ చెప్పాడు. అయితే నాకు అలాంటిదేమీ లేదు. ప్రియాంకకు ఏదైనా చేస్తానని చెప్పినా వద్దని అంటుంది అని మానస్ అంటే... నీవు ఆడవాళ్ల మనసు గురించి తెలుసుకోవాలిరా అంటూ వీజే సన్నీ అన్నాడు. దాంతో నీలాగ నాకు మూడు బ్రేకప్స్ కాలేదు అని విజే సన్నీపై మానస్ సెటైర్ వేశాడు. దాంతో ఆడవాళ్లు మహా సముద్రం లాంటి వాళ్లు. ఎంత తోడుకుంటే అంత అంటూ వీజే సన్నీ లవ్ గురుగా మారిపోయారు.
Recommended Video

ఏడో వారం ఎలిమినేషన్ కోసం
ఏడో వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ల ప్రక్రియ ఘాటుగా సాగింది. ఏడోవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి పోవడానికి అర్హత ఉందని అంటూ కంటెస్టెంట్లు ఒకరినొకరు నామినేట్ చేశారు. ఈ వారం నామినేట్ అయిన వారిలో అని మాస్టర్, కాజల్, ప్రియ, జెస్సీ, లోబో, సిరి హన్మంతు, యాంకర్ రవి, ప్రియాంక సింగ్, శ్రీరామచంద్ర ఉన్నారు. ఈ సారి టాప్ కంటెస్టెంట్లు ఎలిమినేషన్ ముప్పు ఎదుర్కొంటున్నారు. ఎవరు సేఫ్ అవుతారు? ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతారు అనే విషయం చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











