Bigg Boss: ఆ అమ్మాయితో అక్కినేని నాగార్జున డేట్.. వామ్మో అందరి ముందే అలా అడిగేశాడేంటి!

ఇండియాలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోగా హవాను చూపిస్తూ.. టీఆర్పీల దుమ్ము దులిపేస్తోన్న ఏకైక షో బిగ్ బాస్. దేశం మొత్తంలో దాదాపు ఐదారు భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో వచ్చే షోకు మాత్రమే భారీ స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందన లభిస్తోన్న విషయం తెలిసిందే. అందుకే మన షో నేషనల్ లెవెల్‌లో రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఏకంగా నాలుగు సీజన్లను వరుసగా పూర్తి చేసుకుని సత్తా చాటింది. ఇక, ఎన్నో అనుమానాల నడుమ ఇటీవలే ఐదో సీజన్ కూడా ప్రారంభం అయింది.

ఇప్పటికే మొదటి వారం పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఎంతో ఆసక్తికరంగా సాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన వీకెండ్ ఎపిసోడ్‌లో ఆ అమ్మాయితో అక్కినేని నాగార్జున వ్యవహరించిన తీరు హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

గ్రాండ్‌గా మొదలు.. అంచనాలకు తగ్గట్లుగా

గ్రాండ్‌గా మొదలు.. అంచనాలకు తగ్గట్లుగా

కరోనా ప్రభావం కారణంగా బిగ్ బాస్ ఐదో సీజన్ ఈ ఏడాది ఉండదన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత ఆదివారం ఇది అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక, ఆరంభంలోనే నామినేషన్స్ టాస్క్ ఉండడంతో ఆరోజు పలు గొడవలు జరిగాయి. ఆ తర్వాత అంటే ఈ వారం మొత్తం అలాంటి సంఘటనలే కనిపించడంతో ఆసక్తికరంగా సాగిందీ షో. దీంతో షోపై ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకు అనుగుణంగా కంటెంట్ కనిపించింది.

గత వారంలో జరిగిన హైలైట్స్ ఏంటంటే?

గత వారంలో జరిగిన హైలైట్స్ ఏంటంటే?

బిగ్ బాస్ ఐదో సీజన్ మొదటి వారం ఎన్నో రకాల టాస్కులతో సందడిగా సాగింది. నామినేషన్స్ టాస్కులో ఆరుగురు ఎలిమినేషన్ జోన్‌లోకి వెళ్లారు. ఇక, ఇందులో జరిగిన మొట్టమొదటి కెప్టెన్సీ టాస్కులో సిరి హన్మంత్ విజయం సాధించింది. ఇక, ఈ వారం మొత్తం ఉత్తమ ప్రదర్శన కనబరిచిన కంటెస్టెంట్‌గా విశ్వ ఎంపికయ్యాడు. చెత్త ఆటగాడిగా జస్వంత్ పడాల పేరు రావడంతో అతడు జైలు పాలయ్యాడు. ఇక, ఈ వారం పలువురి మధ్య గొడవలు కూడా జరిగాయి. అలాగే, వినాయక చవితి పండుగ సందర్భంగా హౌస్‌లో కంటెస్టెంట్లు అందరూ పూజలు చేశారు.

వీకెండ్ ఎపిసోడ్‌ స్పెషల్.. నాగార్జున రచ్చ

వీకెండ్ ఎపిసోడ్‌ స్పెషల్.. నాగార్జున రచ్చ

బిగ్ బాస్ ఐదో సీజన్ ప్రారంభమై అప్పుడే వారం రోజులు గడిచిపోయింది. దీంతో శనివారం సాయంత్రం అక్కినేని నాగార్జున హోస్టింగ్‌తో వీకెండ్ ఎపిసోడ్ సందడిగా సాగింది. ఆరంభంలోనే అదిరిపోయే పాటకు అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేసిన ఆయన.. ఆ తర్వాత కంటెస్టెంట్లను తిట్టనని చెప్పేశాడు. అందుకు అనుగుణంగానే హౌస్‌లో జరిగిన గొడవలను ఏమాత్రం ప్రస్తావించకుండా అందరితో చక్కగా మాట్లాడారు. దీంతో అప్పటి వరకూ భయం భయంగా ఉన్న కొందరు కంటెస్టెంట్లు నాగార్జున వ్యవహరించిన తీరుతో జాలీ మూడ్‌లోకి వచ్చేశారు.

బోల్డు బ్యూటీ తీరుపై నాగార్జున అసహనం

బోల్డు బ్యూటీ తీరుపై నాగార్జున అసహనం

తొలిసారి బిగ్ బాస్ సీజన్‌లో ఒకేసారి 19 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో చాలా మంది ప్రేక్షకులకు సుపరిచితులు అయిన వారే ఉన్నారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో హవాను చూపిస్తోన్న పలువురు సెలెబ్రిటీలు సైతం ఈ సీజన్‌లో అడుగు పెట్టారు. అలాంటి వారిలో బోల్డు బ్యూటీ సరయు. సెవెన్ ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా అడల్ట్ కామెడీతో వీడియోలు రూపొందించే ఈ బ్యూటీ.. బూతులతో రచ్చ రచ్చ చేస్తుంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో ఈమె వ్యవహరించే తీరుపై తాజాగా నాగార్జున అసహనం వ్యక్తం చేశాడు.

అందరి ముందే అలా అడిగి షాకిచ్చాడుగా

అందరి ముందే అలా అడిగి షాకిచ్చాడుగా

కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో సరయు మింగేస్తా అదీ ఇదీ అంటూ డబుల్ మీనింగ్ డైలాగులు వదిలింది. దీంతో నాగార్జున ఎంతో మురిసిపోయాడు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన వీకెండ్ ఎపిసోడ్‌లో అందరితో మాట్లాడిన నాగార్జున.. సరయుతో కొంచెం స్పెషల్‌గా చాట్ చేశాడు. ఈ క్రమంలోనే ఆమెను ఉద్దేశించి 'ఏంటమ్మా సరయూ.. నువ్వు హౌస్‌లో బూతులు మాట్లాడడం లేదేంటి' అని అడిగి షాకిచ్చాడు. దీంతో ఆమె 'మీరు తిడతారని భయంతో మాట్లాడట్లేదు సార్' అంది. అప్పుడాయన 'నువ్వు నీలా ఉండమ్మా' అని చెప్పాడు.

బోల్డు బ్యూటీతో నాగార్జున డేట్.. అలా చెప్పి

బోల్డు బ్యూటీతో నాగార్జున డేట్.. అలా చెప్పి

బూతుల గురించి నాగార్జునతో మాట్లాడుతోన్న సమయంలోనే సరయు ఎవరూ ఊహించని విధంగా రియాక్ట్ అయింది. అప్పుడామె 'మీరు నన్ను బూతులు మాట్లాడమంటున్నారు కదా.. నన్ను మీతో డేట్‌కు తీసుకెళ్తానంటే బూతులు మొదలు పెడతా' అంటూ షాకింగ్‌గా మాట్లాడింది. దీనికి అదే విధంగా నాగార్జున స్పందిస్తూ 'నిన్ను డేట్‌కి తీసుకుని వెళ్లాలంటే ముందు బయటకు రావాలి కదా' అన్నాడు. అప్పుడామె.. 'ఇప్పుడు కాదు సార్.. వంద రోజుల తర్వాత బయటకు వస్తాను కదా. అప్పుడు వెళ్దాం' అంది. దీనికి నాగార్జున అందరి ముందే ఓకే అనేయడం విశేషం.

Recommended Video

Bigg Boss Telugu 5 Episode 7 Analysis..RJ Kajal the ultimate target for housemates
నాగార్జున తీరుపై విమర్శలు.. సరయు పైనా

నాగార్జున తీరుపై విమర్శలు.. సరయు పైనా

సరయును బూతులు మాట్లాడమంటూ నిన్నటి ఎపిసోడ్‌లో అక్కినేని నాగార్జున కోరడం పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పటికే బిగ్ బాస్ షోను బూతు షో అన్న కామెంట్లు వ్యక్తం అవుతోన్న సమయంలో ఇప్పుడాయన బూతులు మాట్లాడమని ఓ అమ్మాయితో అనడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే, అందరి ముందే అరవై ఏళ్ల నాగార్జునను డేట్‌కు తీసుకెళ్లమన్న సరయును కూడా నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. దీంతో శనివారం ఎపిసోడ్‌లో వీళ్లిద్దరూ వ్యవహరించిన తీరుపై కొందరు ఔత్సాహికులు మీమ్స్ కూడా క్రియేట్ చేసి షేర్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X