Don't Miss!
- News రుణమాఫీపై రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నా: హరీష్ రావు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
Bigg Boss Telugu 5 బిగ్‌బాస్ ఇంటిలో లాక్ డౌన్.. పేడ కంపులోకి దింపి.. కంటెస్టంట్లతో అలాంటి టాస్క్
బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితిలు ఎప్పుడు ఒకేలా ఉండవు ఎలాంటి సమయంలో అయినా సరే కంటెస్టెంట్స్ ఆ టాస్క్ లో భాగంగా పోరాడాల్సి ఉంటుంది. అయితే ఇటీవల షో రేటింగ్ బాగా తగ్గిపోయింది అనుకున్నారో ఏమో గానీ టాస్క్ ల విషయంలో మాత్రం బిగ్ బాస్ నిర్వాహకులు అస్సలు తగ్గడం లేదు. రోజురోజుకు ఎంటర్టైన్మెంట్ డోస్ అంతకంతకూ పెంచుతూ ఉన్నారని అనిపిస్తోంది.
ఇక ఈ సారి కెప్టెన్సీ టాస్క్ కూడా నెవ్వర్ బిఫోర్ అనేలా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ టాస్క్ లో గెలిస్తే నామినేషన్స్ నుంచి తప్పించుకోవచ్చు అని కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా బలంగా పోరాడుతున్నారు. ఇక రీసెంట్ గా విడుదల చేసిన ప్రోమో కూడా నేటి ఎపిసోడ్ పై ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేసింది.
అస్సలు తగ్గడం లేదు
బిగ్ బాస్ 5 టాస్క్ లు ఇవ్వడంలో చాలా తెలివిగా ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోంది. నామినేషన్ ప్రక్రియను రెగ్యులర్ గా కాకుండా ఎమోషన్స్ తో ఆడుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. కంటెస్టెంట్స్ కు సంబంధించిన పర్సనల్ లైఫ్ ను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాడు. వారి కుటుంబ సభ్యులు రాసిన లేఖలను కళ్ళముందే ముక్కలు ముక్కలు చేయడం కొందరిని కలచివేసింది. బిగ్ బాస్ టాస్క్ ల విషయంలో అయితే అస్సలు తగ్గడం లేదు అనిపిస్తుంది.
అభయ హస్తం.. లాక్ డౌన్
బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ అవ్వాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. గతంలో చాలా మంది పోరాడి చివరలో దక్కించుకోలేక పోయారు. ఈసారి ఎలాగైనా లోబో షణ్ముఖ్ కెప్టెన్ గా సెలెక్ట్ అవ్వాలని కష్ట పడేందుకు సిద్ధమయ్యారు. అయితే బిగ్ బాస్ హౌస్ అభయ హస్తం అనే కెప్టెన్సీ టాస్క్ కోసం హౌస్ ను లాక్ డౌన్ చేయడం విశేషం. కెప్టెన్సీ కంటెస్టెంట్ గా సెలెక్ట్ అయిన వారే ఇంట్లోకి వెళ్ళాలి అనే కండిషన్ కూడా పెట్టాడు.
పెడలో టాస్క్
ఇక షణ్ముఖ్ లోబో మొదట కెప్టెన్ గా సెలెక్ట్ అవ్వాలని పోటీకి దిగారు. ఇక బిగ్ బాస్ ఒక బాత్ టబ్ లో ఆవుపేడను ఉంచి అందులో ముత్యాలను కనుగొనాలని టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక షన్ను లోబో ఇద్దరు కూడా రంగంలోకి దూకి గట్టిగానే పోరాడినట్లు తెలుస్తోంది. ఇక మధ్యలో ఎప్పటిలానే కాజల్ తలదూర్చి ప్రయత్నం చేసింది.
దానికితోడు విశ్వ మాటలకు కూడా షన్ను ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. వందమంది వంద రకాలుగా మాట్లాడుతారు అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. వందమంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళమే కదా అని అనడంతో ఆ వంద మందిలో నువ్వు ఉన్నావా అని షన్ను మరొకసారి సీరియస్ అయ్యాడు.
Recommended Video
ఏం చేసుకుంటావో చేస్కో..
నీట్ గా ఉన్నది లెక్కించాలని లేదు అక్కడ.. అంటూ కాజల్ చెప్పడంతో దయచేసి ఒర్లడం మీరు కూడా ఆపేస్తారా అంటూ సంచాలకుడు చూసుకుంటున్నారు కదా అని సమాధానం ఇచ్చాడు. అందుకు కాజల్ ఒక్కసారిగా కోపంతో నీకు వినాలని లేకపోతే చెవులు మూసుకో అనేసింది. వేరే చోటుకు వెళ్లి మాట్లాడుకపో అంటూ లోబో మరో కౌంటర్ ఇవ్వగా నేను ఇక్కడే ఉండి మాట్లాడుతాను అని కాజల్ చెప్పింది. దీంతో లోబో ఉల్టా అయిపోతది అనడంతో ఏం చేసుకుంటావో చేస్కో అని కూడా కాజల్ రీవర్స్ కౌంటర్ ఇచ్చింది. మరి ఈ గొడవలు ఎంతవరకు దారి తీస్తాయో చూడాలి.