Bigg Boss 5 Nominations: ఎమోషన్స్ తో చిచ్చుపెడుతున్న బిగ్ బాస్.. పోస్ట్ కార్డ్ వచ్చేది ఎవరికి?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఏడవ వారం ఎంతో ఆసక్తిగా కొనసాగింది. ఇక 8వ వారం నామినేషన్ ప్రక్రియ మొదలు కాబోతోంది ఈ వారంలో ఎవరు నామినేట్ అవుతారు అనేది మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు వెళ్లిపోయిన వారు ఏదో ఒక విధంగా పొరపాటు చేసి ఎలిమినేట్ అయ్యారు. కానీ ప్రస్తుతం హౌస్ లో ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వస్తున్నారు.

ఇక ఈసారి పవర్ఫుల్ కంటెస్టెంట్స్ లో ఎవరో ఒక మెయిన్ కంటెస్టెంట్ వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నామినేషన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు సరికొత్త గా మొదలు పెడుతున్న బిగ్ బాస్ షో ఈ వారం కూడా ఎమోషన్స్ తో చిచ్చు పెట్టబోతున్నాడని ప్రోమో ద్వారా తెలుస్తోంది.

నోటి దురుసు కారణంగా

నోటి దురుసు కారణంగా

బిగ్ బాస్ గతవారం ఎంతో ఆసక్తికరంగా కొనసాగింది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు రావడమే కాకుండా మంచి ఎమోషనల్ కంటెంట్ కూడా హైలెట్ అయ్యింది. ఇక కొందరు అయితే విభిన్నంగా రొమాంటిక్ యాంగిల్ లో కొనసాగడం మరింత విశేషం. అయితే కావాలని రెచ్చగొట్టిన ప్రియ తన నోటి దురుసు కారణంగా గత వారం హౌజ్ లో నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. సన్నీ విషయంలో ఆమె దూకుడుగా ప్రవర్తించడంతో ప్రేక్షకుల నుంచి తీవ్రస్థాయిలో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇక ఫైనల్ గా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

మరొకటి వదులుకోవాల్సిందే

మరొకటి వదులుకోవాల్సిందే

అయితే బిగ్ బాస్ షోలో ఈ వారం నామినేషన్ ప్రక్రియ కాస్త ఎమోషనల్ యాంగిల్ లో గొడవలు క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు మీ అందరికీ ఎంతో ప్రియమైన వారి నుంచి ఒక లేఖను పొందే అవకాశం ఉంటుంది అని చెప్పిన బిగ్ బాస్.. అక్కడే నామినేషన్ ప్రక్రియను కండిషన్ గా పెట్టి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. మనం కోరుకున్న ప్రతి ఒక్కటి మన జీవితంలో అంత ఈజీ రాదు అంటూ.. ఏదైనా దక్కించుకోవాలి అంటే దానికి బదులుగా మరేదైనా వదులుకోవాల్సి ఉంటుంది.. అని చెప్పారు.

ఎమోషనల్ గా చిచ్చు పెడుతున్న బిగ్ బాస్

అయితే ఎవరికైతే పవర్ రూమ్ లో ఉన్న సభ్యులు లేఖలు ఇస్తారో వారు ఈ వారం ఈ వారం నామినేషన్ నుంచి సేవ్ అవుతారు. లేఖ లభించని సభ్యులు మాత్రం నామినేట్ అవుతారు.. అని బిగ్ బాస్ చాలా క్లియర్ గా వివరణ ఇచ్చాడు ఇక ఈ సారి ఎమోషనల్ గా నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టిన బిగ్ బాస్ సరికొత్త తరహాలో గొడవలు క్రియేట్ చేయబోతున్నట్లు చాలా క్లారిటీగా అర్థం అవుతోంది. మరి ఆ పరిణామాలు ఎవరి పై ప్రభావం చూపుతాయి చూడాలి.

Recommended Video

#BiggBossTelugu5 : Vj Sunny సూపర్ పవర్ | Shannu ని దాటేస్తాడేమో || Filmibeat Telugu
నామినేషన్ లిస్ట్ వైరల్

నామినేషన్ లిస్ట్ వైరల్

ఇక ఎనిమిదవ వారంలో నామినేట్ అయిన సభ్యులు వీరే అని ఒక లిస్ట్ అయితే వైరల్ అవుతోంది. 6 మంది సభ్యులు డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీ రామచంద్ర, మానస్, షణ్ముఖ్ జస్వంత్, సిరి హనుమంతు, యాంకర్ రవి, లోబో నామినేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరూ కూడా జనాల్లో ఎంతో కొంత గుర్తింపు అందుకుంటూ ఇన్నిరోజులు బలంగా పోరాడారు. ఈ వారం ఎవరో ఒకరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఒక టాక్ అయితే వస్తుంది. మరి 8వ వారం ఎవరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారు చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X