Bigg Boss Telugu 5: ఆమెను టార్గెట్ చేసిన అభిజీత్ ఫ్యాన్స్.. ఆ వీడియోలు షేర్ చేసి మరీ దారుణంగా!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురు చూస్తోన్న ఐదో సీజన్ గత ఆదివారం ఎన్నో హంగుల మధ్య ప్రారంభం అయింది. ఇందులో పలువురు కంటెస్టెంట్లు ఎన్నో ఆశలతో అడుగు పెట్టారు. ఎలాగైనా ప్రేక్షకుల మనసు దోచుకుని టైటిల్ విజేతలు అవ్వాలని ప్రతి ఒక్కరూ పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే ఆరంభం నుంచే అంతా తమ తమ బలాలను చూపిస్తూ సాగిపోతున్నారు. ఇప్పటికే పలు టాస్కుల్లోనూ భాగమై సత్తా చాటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ లేడీ కంటెస్టెంట్‌ను అభిజీత్ అభిమానులు తెగ టార్గెట్ చేస్తున్నారు. అంతేకాదు, కొన్ని వీడియోలను షేర్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు మీకోసం!

Photo Courtesy: Star మా and Disney+Hotstar

బిగ్ బాస్ హిస్టరీలోనే మొదటిసారిగా

బిగ్ బాస్ హిస్టరీలోనే మొదటిసారిగా

ఇటీవల మొదలైన ఐదో సీజన్‌లో రికార్డు స్థాయిలో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు నేరుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో సిరి హన్మంత్, వీజే సన్నీ, షణ్ముక్ జశ్వంత్, ప్రముఖ నటి ప్రియ, యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్, ప్రియాంక సింగ్, లహరి, సింగర్ శ్రీరామచంద్ర, సరయు, జస్వంత్, శ్వేతా వర్మ, మానస్ షా, ఉమాదేవి, ఆర్జే కాజల్, లోబో, హమీదా, ఆనీ మాస్టర్, విశ్వలు ఉన్నారు.

నిన్న మొన్నటి వరకూ అలా చేసినా

నిన్న మొన్నటి వరకూ అలా చేసినా

తాజాగా మొదలైన ఐదో సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా.. అందులో కొందరు మాత్రమే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ రేడియో జాకీ కాజల్ ఒకరు. నిన్న మొన్నటి వరకూ బిగ్ బాస్ షో జరిగే తీరుపై విమర్శలు చేసిన ఆమె.. ఇప్పుడదే షోలో కంటెస్టెంట్‌గా పాల్గొనడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఆమె హాట్ టాపిక్ అయిపోతోంది.

అదే కారణంతో నామినేట్ చేసేశారు

అదే కారణంతో నామినేట్ చేసేశారు

బిగ్ బాస్ షోకు సంబంధించిన వ్యవహారాలపై ఆర్జే కాజల్‌కు పూర్తి స్థాయిలో క్లారిటీ ఉంది. దీనికి కారణం ఆమె కొంత కాలంగా ఈ షోపై రివ్యూలు ఇస్తుండడమే. ఇక, ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పలువురు కంటెస్టెంట్లు ఆమెను గత సోమవారం జరిగిన నామినేషన్స్ టాస్కులో నామినేట్ కూడా చేశారు. తద్వారా ఆమెపై వాళ్లంతా ఎలాంటి అభిప్రాయం ఏర్పరచుకున్నారో అర్థం అవుతోంది.

 హౌస్‌లో బిగ్ ఫైట్.. ఏడ్చేసిన కాజల్

హౌస్‌లో బిగ్ ఫైట్.. ఏడ్చేసిన కాజల్

బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం ఉన్న 19 మంది కంటెస్టెంట్లలో ఆర్జే కాజల్‌ కొంచెం అతి చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రతి విషయంలోనూ తల దూర్చడం.. అందరికీ మార్గదర్శనం చేయడం వంటి వాటి వల్ల ఆమెపై ఇలాంటి అభిప్రాయం ఏర్పడింది. ఇక, తాజా ఎపిసోడ్‌లో ఇదే కారణంతో లహరి ఆమెతో గొడవకు దిగింది. దీంతో ఆర్జే కాజల్‌ బాధ పడడంతో పాటు బాగా ఏడ్చేసింది.

కాజల్‌ను టార్గెట్ చేసిన అభి ఫ్యాన్స్

కాజల్‌ను టార్గెట్ చేసిన అభి ఫ్యాన్స్

ప్రస్తుతం సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న ఆర్జే కాజల్‌‌కు ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న ఆమె.. తరచూ ఏదో ఒక గొడవలో భాగం అవుతోంది. దీంతో తనలో తానే ఎంతగానో కుమిలిపోతోంది. ఈ నేపథ్యంలోనే గత సీజన్ విజేత అభిజీత్ అభిమానులు ఆర్జే కాజల్‌ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు.

అప్పుడలా చేయడం వల్లే ఇప్పుడిలా

నాలుగో సీజన్ జరుగుతోన్న సమయంలో ఆర్జే కాజల్‌ తరచూ ఈ షోపై స్పందిస్తూ పలు రకాల వీడియోలు చేస్తుండేది. అదే సమయంలో సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కూడా పెట్టింది. వాటిలో అభిజీత్ పీఆర్ టీమ్‌ను పెట్టుకున్నాడని, అందుకే అతడికి సరిగా ఆడకపోయినా ఓట్లు పడుతున్నాయని విమర్శించింది. అందుకే అతడి ఫ్యాన్స్ ఇప్పుడామెను తెగ ట్రోల్ చేస్తున్నారు.

Recommended Video

#5MuchDrama between #Lobo & #Siri also between #Kajal & #Lahari
ఆ వీడియోలను షేర్ చేసి మరీ ట్రోల్

ఆ వీడియోలను షేర్ చేసి మరీ ట్రోల్

మంగళవారం లహరితో గొడవ అయిన తర్వాత ఆర్జే కాజల్‌ ఏడవడం, తన పాప చూస్తే బాధ పడుతుందని కామెంట్ చేయడంపైనా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఆమె చేసిన ఓ వీడియోను అభిజీత్ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. తద్వారా ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. అలాగే, ఆర్జే కాజల్‌ కూడా పీఆర్ టీమ్‌ను సెట్ చేసుకుని పక్కా ప్లాన్‌ ప్రకారం వచ్చిందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X