క్యాన్సర్‌తో అలా చనిపోయింది.. శ్మశానం బుక్ చేసి వచ్చి నవ్వుతూ.. విషాదాన్ని బయటపెట్టిన ప్రియ
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటి షో మూడో రోజుల ఆటలో ఇంటి సభ్యుల మధ్య ఎన్నో కోణాలు కనిపించాయి. ప్రేక్షకుల ముందు, ఇంటి సభ్యుల ముందు మంచిగా గుర్తింపు పొందడానికి తమ రేంజ్‌లో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. తమ జీవితంలోని సంఘటనలు, తమ గురించి ఏమిటో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తమలోని భావోద్వేగాన్ని బయటపెడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే ప్రియ తన జీవితంలో చోటుచేసుకొన్న విషాద గాథను కంటెస్టెంట్లతో పంచుకొన్నారు. ప్రియ జీవితంలో జరిగిన విషాదం ఏమిటంటే..
Photo Courtesy: Star మా and Disney+Hotstar

తన పాప మరణం గురించి ప్రియ
యాక్టర్ ప్రియ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. తన కూతురు క్యాన్సర్ వ్యాధితో మరణించిన విషయాన్ని ఇంటి సభ్యులకు చెప్పడంతో అందరూ షాక్ గురయ్యారు. ఇప్పుడు నవ్వుతూ కనిపించే ప్రియ జీవితంలో ఇంత విషాదంగా ఉందా అనే ప్రశ్న తలెత్తింది. ఇంటి సభ్యులతో తన పాప మరణం గురించి చెప్పుకొని భావోద్వేగానికి గురయ్యారు.

క్యాన్సర్ వ్యాధితో పోరాటం
నటరాజ్ మాస్టర్, లహరి షారి, విశ్వ, ప్రియాంకతో చిన్నపాటి మీటింగ్ ప్రియ పెట్టారు. ఏదో సాధారణంగా మొదలైన చర్చ.. ఎమోషనల్‌గా మారిపోయింది. లైఫ్ చాలా హ్యపీగా ఉండాలి. అలాంటి పరిస్థితులు ఎక్కడ ఉంటాయో చూడండి అంటూ నటరాజ్ మాస్టర్ అంటే.. గతేడాదిలో ఎన్నో విషాదాలు చూశాం. కానీ మా ఇంటిలో క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేస్తున్న మా పాప బతికి ఉన్నప్పుడు ఆ బాధ గురించి నేను చెప్పలేను అని ప్రియా ఎమోషనల్ అయ్యారు.

శ్మశాన వాటిక లభించని సమయంలో
2020లో కోవిడ్ సమయంలో శ్మశాన వాటికలు లభించడం లేదు. ఇక ఎక్కువ రోజులు బతకదు. ఆమె జీవితం మరో రెండు రోజులు అని తెలిసిన తర్వాత శ్మశాన వాటికను బుక్ చేసి వచ్చి.. ఆమెతో నవ్వుతూ పలకరించడం ఎంత బాధగా ఉంటుదో తెలుసా? కడుపులో చేయి పెట్టి నలిపేసిన ఫీలింగ్ అది. ఆ ఫీలింగ్‌ను భరించడం చాలా కష్టం అని ప్రియ అన్నారు. దాంతో ఇంటి సభ్యులందరూ సారీ అని చెబుతూ మీ జీవితంలో ఇలాంటి విషాదం గురించి మాకు తెలియదు అంటూ ఓదార్చారు.

ఎంత బాధలో ఉన్నా సరే..
మా పాప ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. ఆమె ఎంతో బాధలో ఉన్నా సరే.. నీకు తలనొప్పి అన్నావు.. ఇప్పుడు ఎలా ఉంది అంటూ నన్ను అడిగేది. కొంచెం గాలి ఎక్కువ వీచినా.. ఊపిరి తీసుకోలేక అల్లాడిపోయేది. ఆ బాధను కూడా వ్యక్తం చేసే శక్తి లేకపోతే... కంటి నుంచి కన్నీరు రాల్చి ఆ బాధను తెలియజేసేది. అంతటి బాధలో ఏడవడం వల్ల ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందేది. అందుకే నాకు బాధ ఉన్నా నేను ఎక్స్‌ప్రెస్ చేయను అని ప్రియ అన్నారు.
Recommended Video

అమెకు మంచి జన్మను ఇచ్చి ఉంటారేమో
దాంతో ప్రియను నటరాజ్ ఓదార్చుతూ.. ఇదే మీరు మనసులో పెట్టుకోవాలి. మీ పాపది మంచి జన్మ అని నటరాజ్ అంటే.. ఎక్కడో రాజవంశంలో పుట్టిన రాకూమారిలా పుట్టి ఉంటుంది అని ప్రియ అంటే.. ఈ లోకం నుంచి త్వరగా తీసుకొని వెళితే.. ఆమెకు దేవుడు ఎక్కడో ఒక మంచి జన్మను ఇచ్చి ఉంటాడు అని నటరాజ్ మాస్టర్ ఉపశమనం కలిగించే మాటలు చెప్పారు. బిగ్‌బాస్ ఇంటిలో ఇలాంటి విషాద విషయాలే కాకుండా వినోదాన్ని కూడా ఇంటి సభ్యులు పండిస్తూ ఆటను రక్తి కట్టిస్తున్నారు.


Click it and Unblock the Notifications











