twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 5: నాగార్జున రెమ్యూనరేషన్ లీక్.. ఎన్టీఆర్‌ను దాటేసి ఇప్పుడు భారీగా!

    |

    తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రేక్షకుల మద్దతును కూడగట్టుకుని ఐదేళ్లుగా నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అసలేమాత్రం అంచనాలు లేకుండానే మన భాషలోకి పరిచయం అయిన ఇది అత్యధికంగా టీఆర్పీ రేటింగ్‌ను అందుకుని జాతీయ స్థాయిలో గుర్తింపును పొందింది. ఫలితంగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇక, ఈ షో విజయంలో హోస్టుగా చేసిన స్టార్ హీరోల పాత్ర ఎంతో ఉందని చెప్పాలి. మరీ ముఖ్యంగా మూడు, నాలుగు సీజన్లకు భారీ రేటింగ్ వచ్చేలా చేసి.. ఇప్పుడు ఐదో దాన్ని కూడా హోస్ట్ చేస్తున్నాడు సీనియర్ హీరో అక్కినేని నాగార్జున. ఈ నేపథ్యంలో ఆయనకు బిగ్ బాస్ నిర్వహకులు ఎంత మొత్తం రెమ్యూరేషన్‌గా చెల్లిస్తున్నారు అన్న వివరాలు బయటకు వచ్చాయి. ఆ లెక్కలేంటో చూద్దాం పదండి!

    ఇప్పటికే ఐదు సీజన్లు.. ముగ్గురు స్టార్లు

    ఇప్పటికే ఐదు సీజన్లు.. ముగ్గురు స్టార్లు

    తెలుగులో బిగ్ బాస్ షో నాలుగు సీజన్లను ఎవరూ ఊహించని విధంగా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇది ఇంతలా సక్సెస్ అయిందంటే దానికి హోస్టులు కూడా కారణమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సీజన్‌ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌ను నేచురల్ స్టార్ నాని, మూడు నాలుగు సీజన్లను సీనియర్ హీరో అక్కినేని నాగార్జున తమదైన శైలి హోస్టింగ్‌తో అద్భుతంగా నడిపించడం వల్లే ఇది ఈ స్థాయిలో ఉంది. ఇక, ఇప్పుడు ఐదో సీజన్‌ను కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ చేస్తున్నారు. ఆదివారమే ఇది అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది.

    బ్రా ఒక్కటే ధరించి విష్ణుప్రియ రచ్చ: ఇంతకు ముందెన్నడూ చూడనంత ఘాటు ఫోజులతో!బ్రా ఒక్కటే ధరించి విష్ణుప్రియ రచ్చ: ఇంతకు ముందెన్నడూ చూడనంత ఘాటు ఫోజులతో!

    మొదటి సీజన్‌కు ఎన్టీఆర్ రెమ్యూనరేషన్

    మొదటి సీజన్‌కు ఎన్టీఆర్ రెమ్యూనరేషన్

    తెలుగు వాళ్లకు అస్సలు పరిచయం లేని కాన్సెప్ట్‌తో ప్రసారం అయ్యే బిగ్ బాస్ షోను తీసుకొచ్చిన సమయంలో ఎన్నో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే, అందరి అనుమానాలకు పుల్‌స్టాప్ పెట్టేసి, షోను విజయవంతం చేశాడు అప్పటి హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్. తనదైన శైలి హోస్టింగ్‌తో ఈ షోను జనాల్లోకి తీసుకెళ్లడంలో అతడు సక్సెస్ అయ్యాడు. ఫలితంగా ఈ సీజన్‌కు భారీ స్థాయిలో రేటింగ్ వచ్చి రికార్డులు బద్దలైపోయాయి. ఇక, ఆ సీజన్ కోసం ఎన్టీఆర్ ఒక్క ఎపిసోడ్‌కు రూ. 40 లక్షల చొప్పున రూ. 8 కోట్లు వరకూ తీసుకున్నాడట. ఇది 10 వారాలే జరిగిన విషయం తెలిసిందే.

     రెండో సీజన్‌కు నాని ఎంత తీసుకున్నాడు

    రెండో సీజన్‌కు నాని ఎంత తీసుకున్నాడు

    బిగ్ బాస్ రెండో సీజన్ కొన్ని వివాదాల నడుమ మొదలైంది. అప్పుడు షోను నిషేదించాలన్న డిమాండ్లు కూడా బాగా వినిపించాయి. అలాంటి సమయంలో దీనికి నేచురల్ స్టార్ నాని చక్కగా హోస్టింగ్ చేశాడు. ఇందులోనూ అతడు సహజసిద్ధమైన హోస్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. అంతేకాదు, అప్పడు కౌశల్ ఆర్మీ ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితుల్లోనూ చక్కగా షోను నడిపించాడు. ఇక, ఈ సీజన్ కోసం నాని ఒక్కో ఎపిసోడ్‌కు 10 లక్షల రూపాయల చొప్పున రూ. 3 కోట్లు చార్జ్ చేశాడట. ఈ సీజన్ 15 వారాలు జరిగింది. దీని తర్వాత అతడు హోస్టుగా చేయనని చెప్పి తప్పుకున్నాడు.

    అషు రెడ్డి ప్రైవేటు పార్ట్‌ను చూపించిన ఆర్జీవీ: పవన్ కల్యాణ్‌ కోసం ఆమెను బుక్ చేసేశాడుగా!అషు రెడ్డి ప్రైవేటు పార్ట్‌ను చూపించిన ఆర్జీవీ: పవన్ కల్యాణ్‌ కోసం ఆమెను బుక్ చేసేశాడుగా!

    మూడో సీజన్‌కు నాగార్జున చార్జ్ ఎంతంటే

    మూడో సీజన్‌కు నాగార్జున చార్జ్ ఎంతంటే

    తెలుగులో బిగ్ బాస్ షోకు సంబంధించిన మొదటి రెండు సీజన్లను ఇద్దరు కుర్ర హీరోలు హోస్ట్ చేయగా.. మూడో సీజన్‌ను సీనియర్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున నడిపించాడు. ఈ సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్ నుంచి రికార్డుల మీద దండయాత్ర చేసిన ఆయన.. వీకెండ్ ఎపిసోడ్‌లను ఎంతో స్పెషల్‌గా మార్చాడు. మంచిగా ఆడితే ప్రోత్సహించి అభినందించడం.. ఏదైనా తప్పులు చేస్తే కంటెస్టెంట్లను మందలించడం వంటివి చేసి మెప్పించాడు. ఈ సీజన్ 15 వారాల పాటు జరిగింది. ఇందులో నాగ్ ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 12 లక్షల చొప్పున రూ. 3.50 కోట్లు తీసుకున్నాడట.

     నాలుగో సీజన్‌కు నాగ్ రెమ్యూనరేషన్ ఇలా

    నాలుగో సీజన్‌కు నాగ్ రెమ్యూనరేషన్ ఇలా

    బిగ్ బాస్ షోకు సంబంధించి మొదటి మూడు సీజన్లకు ముగ్గురు స్టార్లు హోస్ట్ చేయగా, నాలుగో దాన్ని మరో ప్రముఖ హీరో నడిపించబోతున్నాడని జోరుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు కూడా బయటకు వచ్చాయి. కానీ, దానికి భిన్నంగా దీన్ని కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ చేశారు. ఇది కూడా 15 వారాల పాటు జరిగింది. దీనికి ఎపిసోడ్స్ ప్రకారం కాకుండా రూ. ఏడు కోట్లు రెమ్యూనరేషన్‌గా అందుకున్నాడట ఈ సీనియర్ హీరో. అంటే గత సీజన్ కంటే ఎక్కువే అయినా ఎన్టీఆర్ కంటే తక్కువనే చెప్పాలి. ఈ సీజన్ 18 పైచిలుకు రేటింగ్ సాధించింది.

    షర్ట్ మొత్తం విప్పేసిన సీరియల్ నటి: లోదుస్తులు కూడా లేకుండా మరీ పచ్చిగా కనిపించడంతో!షర్ట్ మొత్తం విప్పేసిన సీరియల్ నటి: లోదుస్తులు కూడా లేకుండా మరీ పచ్చిగా కనిపించడంతో!

    ఐదో సీజన్‌కు నాగార్జున రెమ్యూనరేషన్ లీక్

    ఐదో సీజన్‌కు నాగార్జున రెమ్యూనరేషన్ లీక్

    ఎన్నో అనుమానాలు, ప్రతికూల పరిస్థితుల నడుమ బిగ్ బాస్ ఐదో సీజన్ ఈ ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. దీన్ని కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ చేస్తున్నారు. ఎంతో గ్రాండ్‌గా జరిగిన ప్రీమియర్ ఎపిసోడ్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇది మొదలైన రోజే నాగార్జున తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ఓ న్యూస్ లీకైంది. తాజా సమాచారం ప్రకారం.. ఐదో సీజన్‌ కోసం ఆయన ఎపిసోడ్లను బట్టి కాకుండా ఏకంగా రూ. 9 కోట్లు తీసుకుంటున్నాడట. అంటే ఇది జూనియర్ ఎన్టీఆర్ చార్జ్ చార్జ్ చేసిన దానికంటే ఎక్కువే.

    Recommended Video

    Harbhajan Singh లో ఇంత గొప్ప సింగర్ ఉన్నాడా.. రోజా మూవీ లో పాట పాడిన బజ్జీ
    నాగార్జునకు అది అదనంగా వస్తుంది కూడా

    నాగార్జునకు అది అదనంగా వస్తుంది కూడా

    ప్రస్తుత సీజన్‌కు రూ. 9 కోట్లు తీసుకోవడం ద్వారా తెలుగు బిగ్ బాస్ చరిత్రలో అక్కినేని నాగార్జున అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. ఇక, ఈ రెమ్యూనరేషన్‌తో పాటు ఆయనకు మరిన్ని లాభాలు కూడా రాబోతున్నాయి. బిగ్ బాస్ మొదటి సీజన్‌ను లూనావాలాలో నడిపించిన విషయం తెలిసిందే. రెండో దాని నుంచి తాజా సీజన్ వరకూ వరుసగా అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే బిగ్ బాస్ హౌస్ సెట్ వేస్తున్నారు. సో.. దీనికి రెంట్ కూడా అక్కినేని నాగార్జున ఖాతాలోకే వెళ్లింది. హోస్టుగా, స్టూడియో ఓనర్‌గా ఈ సీనియర్ హీరో బాగానే లాభ పడుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది.

    English summary
    Bigg Boss is the Telugu Top Rreality TV Series Recently Started 5th Season. Akkineni Nagarjuna Host This Season Also. Now his Remunerationa Details Leaked.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X