For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: షణ్ముఖ్ పరువు తీసిన నాగార్జున.. ఆ కంటెస్టెంట్‌పై హోస్టుకు ప్రియ కంప్లైంట్

  |

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే రికార్డు స్థాయిలో రేటింగ్ రాబడుతూ.. సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోన్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. కొత్త కాన్సెప్టుతో వచ్చినప్పటికీ.. దీనికి ప్రేక్షకుల భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందించడంతో ఏడాదికి ఒక సీజన్ చొప్పున నాలుగింటిని ఇప్పటికే పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే గత ఆదివారం ఐదో సీజన్ కూడా ప్రారంభం అయింది. అంతేకాదు, ఈ వారం మొత్తం ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఈ నేపథ్యంలో తాజాగా వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఇందులో షణ్ముఖ్ జస్వంత్ పరువు తీశాడు. అంతేకాదు, ఓ కంటెస్టెంట్‌పై ప్రియ కంప్లైంట్ కూడా చేసింది. ఆ సంగతులు మీ అందరి కోసం!

  అలా మొదలై... ఆసక్తికరంగా సాగింది

  అలా మొదలై... ఆసక్తికరంగా సాగింది

  ఎన్నో అంచనాల నడుమ బిగ్ బాస్ ఐదో సీజన్ గత ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ఇందులోకి ఈ సారి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఇక, ఆరంభంలోనే నామినేషన్స్ టాస్క్ ఉండడంతో ఆరోజు పలు గొడవలు జరిగాయి. ఆ తర్వాత అంటే ఈ వారం మొత్తం అలాంటి సంఘటనలే కనిపించడంతో ఆసక్తికరంగా సాగిందీ షో.

  ఆ పొరపాటు చేయడం వల్లే సాయి ధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్.. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది!

  ఫస్ట్ కెప్టెన్ సిరి.. బెస్ట్, వరస్ట్ వాళ్లిద్దరు

  ఫస్ట్ కెప్టెన్ సిరి.. బెస్ట్, వరస్ట్ వాళ్లిద్దరు


  బిగ్ బాస్ ఐదో సీజన్ మొదటి వారం ఎన్నో రకాల టాస్కులతో సందడిగా సాగింది. ఇక, ఇందులో జరిగిన మొట్టమొదటి కెప్టెన్సీ టాస్కులో సిరి హన్మంత్ విజయం సాధించింది. ఇక, ఈ వారం మొత్తం ఉత్తమ ప్రదర్శన కనబరిచిన కంటెస్టెంట్‌గా విశ్వ.. చెత్త ఆటగాడిగా జస్వంత్ పడాల ఎంపికయ్యారు. వరస్ట్ కేటగిరీ కంటెస్టెంట్‌గా చెడ్డపేరు తెచ్చుకుని జెస్సీ జైలు పాలయ్యాడు.

  ఈ వారం నామినేషన్‌లో ఆ ఆరుగురు

  ఈ వారం నామినేషన్‌లో ఆ ఆరుగురు

  బిగ్ బాస్ షో మొత్తంలో ఎంతో ముఖ్యమైన ప్రక్రియల్లో నామినేషన్స్ ఒకటి. ఎంతో ఆసక్తికరంగా ఎన్నో గొడవల మధ్య ఇది ప్రతి సోమవారం జరుగుతుంది. ఇక, ఐదో సీజన్‌కు సంబంధించి మొదటి వారం నామినేషన్స్ టాస్క్ సైతం ఎంతో రచ్చ రచ్చగా జరిగింది. ఇందులో ఈ వారానికి యాంకర్ రవి, జస్వంత్ పడాల, ఆర్జే కాజల్, హమీదా, మానస్, సరయులు నామినేట్ అయ్యారు.

  Bigg Boss Elimination: వారం చివర్లో మారిపోయిన పోలింగ్.. ఆ ఇద్దరిలో ఒకరు వెళ్లిపోవడం ఖాయం!

  ఆ కంటెస్టెంట్లపై నాగార్జున ప్రశంసలు

  ఆ కంటెస్టెంట్లపై నాగార్జున ప్రశంసలు

  బిగ్ బాస్‌లో ప్రతి శనివారం, ఆదివారం ఎపిసోడ్స్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున ఎంట్రీ ఇస్తాడన్న విషయం తెలిసిందే. ఇక, ఈరోజు జరిగే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో నాగ్ ఎంతో జోష్‌తో కనిపించాడు. కెప్టెన్‌గా ఎంపికైన సిరిని, ఎంటర్‌టైన్ చేసిన లోబోను, శ్రీరామ చంద్రను ఆయన ప్రశంసించడం ప్రోమోలో చూపించారు.

  షణ్ముఖ్ పరువు తీసిన కింగ్ నాగార్జున

  షణ్ముఖ్ పరువు తీసిన కింగ్ నాగార్జున

  ఈ ప్రోమోలో నాగార్జున అందరితో మాట్లాడిన దాన్ని చూపించలేదు. కానీ, కొంత మంది కంటెస్టెంట్ల విజువల్స్ మాత్రమే పొందుపరిచారు. ఇక, ఇందులో టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా ఉన్న షణ్ముఖ్ జస్వంత్ పరువు తీశాడాయన. ‘అరే ఏంట్రా ఇది.. వారం అయిపోయిందిరా.. కొంచెమైనా ఆడరా.. ఇకనైనా మొదలుపెట్టరా' అంటూ తనదైన శైలి డైలాగులు వదిలాడు నాగ్.

  Seetimaarr Day 1 collections: చరిత్ర సృష్టించిన గోపీచంద్.. ఇండియాలోనే ఫస్ట్ మూవీగా సంచలన రికార్డ్

  అతడిపై నాగార్జునకు ప్రియ ఫిర్యాదు

  తాజాగా విడుదలైన ప్రోమోలో అక్కినేని నాగార్జున.. సింగర్ శ్రీరామ చంద్రను ప్రశంసించాడు. ‘గుడ్ జాబ్ శ్రీరామ్.. పాటలతో పాటు నీకు ఈ టాలెంట్ కూడా ఉందని ఇప్పుడే తెలిసింది' అంటూ అభినందించాడు. ఆ సమయంలో ప్రియ ‘ఇదే కాదు.. కనిపించనివి చాలా ఉన్నాయి. ఈ మధ్య ట్రాకులు కూడా నడుపుతున్నాడు' అంటూ శ్రీరామ్‌పై నాగార్జునకు కంప్లైంట్ చేసింది ప్రియ.

  'Father Knows Who The Father Is' - TMC MP Nusrat Jahan || Filmibeat Telugu
  నీకు నీలా ఉండు.. రోజ్ ఇవ్వాలంటూ

  నీకు నీలా ఉండు.. రోజ్ ఇవ్వాలంటూ


  ఇక, ఈ ప్రోమోలో నాగార్జున పలువురితో చక్కగా మాట్లాడాడు. మరీ ముఖ్యంగా సరయుతో ‘నువ్వు నీలాగే ఉండమ్మా' అని అన్నాడు. అప్పుడామె ‘మీరు తిడతారేమోనని భయపడ్డా' అని అంటుంది. ఆ తర్వాత లహరితో ‘నువ్వు ఈ రోజ్ వచ్చే వారంలో ఎవరికైనా ఇస్తావని అనుకుంటున్నా' అన్నాడు నాగ్. దీనికామె ‘ఎవరినైనా పంపించండి సార్' అంటూ బదులిచ్చింది.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series Recently Started 5th Season. In Upcoming Episode.. Akkineni Nagarjuna Blamed Shanmukh Jaswanth.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X