For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: ఆ ఒక్క మాట చెప్పి కంటెస్టెంట్లకు షాకిచ్చిన నాగార్జున.. ఎంతైనా మన్మథుడు కదా!

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతూ హవాను చూపిస్తున్నాడు కింగ్ అక్కినేని నాగార్జున. దాదాపు నలభై ఏళ్లుగా టాలీవుడ్‌లో ఎన్నో రకాల చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఆయన.. మర్చిపోలేని సినిమాలను అందించాడు. తద్వారా కొన్ని కోట్ల మంది అభిమానాన్ని అందుకున్నాడు. వెండితెరపై సందడి చేస్తూనే.. కొన్నేళ్ల క్రితం బుల్లితెరపైకి హోస్టుగా ఎంట్రీ ఇచ్చాడాయన. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోను మూడేళ్లుగా నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో నాగార్జున ఊహించని విధంగా మాట్లాడాడు. దీంతో అంతా షాక్ అయ్యారు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  నాలుగు సీజన్లు.. ముగ్గురు స్టార్ హీరోలు

  నాలుగు సీజన్లు.. ముగ్గురు స్టార్ హీరోలు

  బిగ్ బాస్ షో తెలుగులో నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీని సక్సెస్ వెనుక హోస్టులుగా చేసిన హీరోల పాత్ర కూడా చాలా ఉంది. మొదటి సీజన్‌ను జూనియర్ ఎన్టీఆర్, రెండో దాన్ని నేచురల్ స్టార్ నాని, మూడు నాలుగు సీజన్లను సీనియర్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున తమదైన శైలి హోస్టింగ్‌తో అద్భుతంగా నడిపించి బిగ్ బాస్‌ను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లారు.

  పవన్ కల్యాణ్ సెన్సేషనల్ రికార్డ్: ఒకే సినిమాతో రెండు ఘనతలు సొంతం.. ఇండియాలోనే ఏకైక హీరో

  నాగార్జునకు నేషనల్ రికార్డులు సొంతం

  నాగార్జునకు నేషనల్ రికార్డులు సొంతం

  బిగ్ బాస్ అన్ని సీజన్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. మరీ ముఖ్యంగా అక్కినేని నాగార్జున నడిపించిన మూడు, నాలుగు సీజన్లకు అయితే ఓ రేంజ్‌లో స్పందన దక్కింది. ఫలితంగా రికార్డు స్థాయిలో రేటింగ్ వచ్చింది. మరీ ముఖ్యంగా నాలుగో సీజన్ ఫినాలే ఎపిసోడ్‌కు ఏకంగా 18 పైచిలుకు టీఆర్పీ దక్కింది. దీంతో నేషనల్ రికార్డులు కూడా బద్దలైపోయాయి.

   ఐదోది కూడా ఆయనే.. గ్రాండ్‌గా ఎంట్రీ

  ఐదోది కూడా ఆయనే.. గ్రాండ్‌గా ఎంట్రీ

  ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఐదో సీజన్ కూడా ప్రారంభం అయింది. దీనిని కూడా కింగ్ అక్కినేని నాగార్జునే హోస్ట్ చేస్తున్నారు. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ప్రీమియర్ ఎపిసోడ్ సెప్టెంబర్ 5న జరిగింది. ఇందులో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక, ఇది మొదలై ఒక వారం పూర్తవడంతో.. ఆదివారమే ఒకరు షో నుంచి బయటకు వెళ్లిపోయారు.

  ప్యాంట్‌ లేకుండా హీరోయిన్ ఘాటు ఫోజు: ప్రైవేట్ ఫొటో షేర్ చేసిన వర్మ.. మామూలోడు కాదుగా!

  Bigg Boss Telugu 5 Episode 7 Analysis..RJ Kajal the ultimate target for housemates
   కంటెస్టెంట్లకు చుక్కలు చూపిస్తున్నాడు

  కంటెస్టెంట్లకు చుక్కలు చూపిస్తున్నాడు

  అక్కినేని నాగార్జున హోస్టింగ్ స్టైల్ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. తప్పు చేసినప్పుడు కంటెస్టెంట్లను మందలించడం.. మంచిగా ఆడితే అభినందించడం వంటివి చేస్తూ ఆయన బెస్ట్ హోస్టుగా పేరు తెచ్చుకున్నాడు. ఇక, తాజా సీజన్‌లో నాగార్జున రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్లకు చుక్కలు చూపించేలా వ్యవహరిస్తున్నాడీ స్టార్ హీరో.

  నేను మీకు తెలుసా? వాటితో చిక్కులు

  నేను మీకు తెలుసా? వాటితో చిక్కులు

  ఎంతో సందడిగా సాగే ఆదివారం ఎపిసోడ్‌లో అక్కినేని నాగార్జున కంటెస్టెంట్లు అందరితో ఆటలు ఆడిస్తుంటాడన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నిన్నటి ఎపిసోడ్‌లో ‘నేను మీకు తెలుసా' అనే టాస్క్ ఆడించాడు. ఇందులో కంటెస్టెంట్లను జంటలుగా మార్చి.. ఒకరి గురించి మరొకరిని ప్రశ్నలు అడిగాడు. ఇందులో కొందరిని విచిత్రమైన ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాడు.

  Bigg Boss: లేడీ కంటెస్టెంట్‌లకు దెబ్బ మీద దెబ్బలు.. ఐదుగురిలో నలుగురు ఎలిమినేట్

  అలా ప్రపోజ్ చేసిన మేల్ కంటెస్టెంట్

  అలా ప్రపోజ్ చేసిన మేల్ కంటెస్టెంట్


  ఈ టాస్కులో భాగంగా సన్నీ, లహరి జంటగా వచ్చారు. ఆ సమయంలో నాగార్జున ఇద్దరినీ ఒకరి గురించి ఒకరికి సంబంధించిన ప్రశ్నలు అడిగాడు. ఆ సమయంలో లహరి ‘సన్నీకి ఓ టాలెంట్ ఉంది సార్. విచిత్రమైన గొంతుతో మాట్లాడుతుంటాడు' అని చెబుతుంది. అప్పుడు నాగ్ అతడిని చూపించమని అడుగుతాడు. అప్పుడతను ‘నాగార్జున ఐ లవ్ యూ' అని చెబుతాడు.

  ఎంతైనా మన్మథుడు కదా.. అంతే మరి

  ఎంతైనా మన్మథుడు కదా.. అంతే మరి


  గొంతు మార్చి ఎవరికీ అర్థం కాకుండానే సన్నీ ఆ మాట చెప్పినప్పటికీ.. నాగార్జున మాత్రం దాన్ని గుర్తు పట్టేశాడు. అంతేకాదు, ‘నాగార్జున ఐ లవ్ యూ అని చెప్పావు కదా. ఆ మాట నాకు ఏ భాషలో చెప్పినా అర్థం అవుతుంది' అని అక్కడున్న వాళ్లందరికీ షాకిచ్చాడు. దీంతో సన్నీ ‘ఎంతైనా మన్మథుడు కదా. అందుకే గుర్తు పట్టారు' అంటూ కామెంట్ చేశాడు.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series Recently Started 5th Season. Akkineni Nagarjuna Shocking Comments on Love in Recent Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X