For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: సన్నీకి ఫ్లాట్ అయి ఐలవ్యూ చెప్పిన అలియా భట్.. మూర్చపోయిన సన్నీ.. 'బాలయ్య'ను కూడా వదల్లేదు

  |

  బిగ్ బాస్ తెలుగు 5 గ్రాండ్ ఫినాలే ఈరోజు (డిసెంబర్ 19) సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. ఐదుగురు ఫైనలిస్ట్‌లు మరియు వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ క్షణాలు రానే వచ్చాయి. అయితే గెస్ట్ లలో ఒకరిగా ఎంటర్ అయిన అలియా భట్ సన్నీకి ఐ లవ్యూ చెప్పింది. ఆ వివరాల్లోకి వెళితే

  గ్రాండ్‌ఫినాలే

  గ్రాండ్‌ఫినాలే

  టాలీవుడ్ హీరో నాగార్జున హోస్ట్ గా 19 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన రియాల్టీ షో 'బిగ్‌బాస్‌ సీజన్‌-5' ముగింపు దశకు చేరుకుంది. టాప్‌-5లో ఉన్న మానస్‌, శ్రీరామ్‌, సన్నీ, షణ్ముఖ్‌, సిరిలలో విజేతగా ఎవరు నిలుస్తారో మరి కొన్ని గంటల్లో తేలి పోనుంది. సుమారు 104 రోజులుగా ప్రేక్షకుల్ని అలరిస్తోన్న ఈ షో గ్రాండ్‌ఫినాలే ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రసారం కానుంది.

  తోటి కంటెస్టెంట్స్‌ల ఆట పాటలతో

  తోటి కంటెస్టెంట్స్‌ల ఆట పాటలతో

  ఈ వేడుకల్లో 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్ నుంచి రాజమౌళి, 'బ్రహ్మాస్త్ర' టీమ్‌ నుంచి రణ్‌బీర్‌కపూర్‌, అలియాభట్‌, 'పుష్ప' ప్రమోషన్స్‌ కోసం రష్మిక, సుకుమార్‌, దేవిశ్రీ ప్రసాద్‌, బ్రో సినిమా ప్రమోషన్స్ కోసం నవీన్ చంద్ర, జగపతి బాబు, శ్యామ్ సింగ రాయ్ సినిమా ప్రమోషన్స్ కోసం సాయిపల్లవి, నాని.. హౌస్‌లోకి వెళ్లి ఇంటి సభ్యులతో సరదాగా మాట్లాడనున్నారు. మరోవైపు కంటెస్టెంట్‌ల ఇంటిసభ్యులు, ఎలిమినేటై ఇంటికి వచ్చిన తోటి కంటెస్టెంట్స్‌ల ఆట పాటలతో ఈ వేడుకలు మరింత సందడిగా మారాయి.

  త్రో బాక్ వీడియో

  ఫైనల్‌కు ముందు, ఈ సీజన్‌లోని ఐదుగురు ఫైనలిస్ట్‌లలో ఒకరైన సన్నీ యొక్క త్రో బాక్ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వీడియోలో, సన్నీ గతంలో బాలీవుడ్ నటి అలియా భట్‌తో తన పాత పరిచయం గురించి మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా, ఈ రాత్రి గ్రాండ్ గాలా ముగింపుకు ఆమె ముఖ్య అతిధులలో ఒకరు కావడంతో ఆమె మళ్ళీ దబిడి దిబిడే అనడం మనం గమనించవచ్చు.

  దబిడి దిబిడే

  దబిడి దిబిడే

  నిజానికి పాపులర్ బాలకృష్ణ డైలాగ్ 'దబిడి దిబిడే'ని రిపీట్ చేయమని అలియాను తాను జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు కోరగా ఆమె ఎలా చేసిందో సన్నీ వీడియోలో గుర్తు చేసుకున్నారు. యాదృచ్ఛికంగా, ఫైనల్ నైట్ యొక్క తాజా టీజర్‌లో కూడా అలియా భట్ 'దబిడి దిబిడే' డైలాగ్ చెప్పడం జరిగింది. ఆసక్తికరంగా, "సన్నీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని అలియా చెప్పినప్పుడు సన్నీ మూర్ఛపోతున్నట్టు పడిపోయాది. మొత్తం మీద ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగనుంది అనే చెప్పాలి.

  సన్నీ కప్ గెలిచే అవకాశా

  సన్నీ కప్ గెలిచే అవకాశా

  గ్రాండ్ ఫినాలేలో SS రాజమౌళి, అలియా భట్, రణబీర్ కపూర్, నాని, సాయి పల్లవి , కృతి శెట్టి , జగపతి బాబు, నవీన్ చంద్ర మరియు శ్రియా శరణ్ , మాజీ కంటెస్టెంట్స్ నటరాజ్, అనీ, విశ్వ , కాజల్ తదితరులు ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చారు . రాహుల్ సిప్లిగంజ్ తన అద్భుతమైన ఆటతీరుతో మెరుపులు మెరిపించనున్నాడు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి మరోసారి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని అంటున్నారు. సన్నీ కప్ గెలిచే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఎంత వరకు నిజం కానుంది అనేది.

  English summary
  in Bigg Boss Telugu 5 Grand Finale alia bhat says i love you to sunny.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X